ఆత్మా+హత్యా Suicide or Murder? 3

ఆత్మా+హత్యా

ఒక రెండు కుటుంబాలు తమ వంశం పెరగాలని తాము సంపాదించిన ఆస్తిపాస్తులు పేరుప్రఖ్యాతులు అనుభవించాలని మా కుటుంబం బాగుండాలనే కోరికతో లేదా కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి తాము తమ ప్రేమానురాగాలకు గుర్తుగా బిడ్డలని కంటారు తల్లి గర్భవతి అయింది మొదలు మొదటి రెండు నెలలు వాంతులు వికారాలు బాధపడుతుంటే అప్పుడప్పుడే జీవం పోసుకుంటుంది.

తన బిడ్డ ఇంకా రూపం కూడా ఏర్పడని ఒక కథనాన్ని ప్రేమిస్తున్న తండ్రి లోపల ఎక్కడ ఏమవుతుందో ఆ వాంతుల వల్ల అని తల్లడిల్లిపోతూ భార్యకు వాంతులు తగ్గడానికి ఏవేవో ప్రయోగాలు చేస్తూ.

Youngster putting rose flower to head in suicidal thoughts

చివరికి పెద్దల డాక్టర్ల సలహాతో ఆ వాంతులను తగ్గించి మొదటి నెల నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పాలు పండ్లు ఇస్తూ ఆ తల్లి ఇష్టం లేకుండా బిడ్డ బాగా పెరగాలని ఎదగాలని ఏ లోపాలు లేకుండా మచ్చలేని చందమామలు బయటకు రావాలని కలలు కంటూ తొలిసారి అయినా, మలిసారైనా, ఎవరైనా  ఆ తొమ్మిది నెలలు ఎంతో ఇష్టపడుతూ కష్టపడుతూ ఇష్టంగా కష్టపడుతూ ఐదో నెల లో అందరూ కలిసి  సీమంతం చేసి పిల్లలతో చల్లగా బయటపడాలని దీవిస్తూ ఉంటే రాబోయే జీవి తన జీవితంలో కొత్త లోకాన్ని సృష్టిస్తాడు అని ఆశ పడుతూ కాస్త భయపడుతూ…

తనని పరిపూర్ణ మహిళ గా చేస్తున్న ఆ జీవి మీద పిచ్చి ప్రేమ తో తాను చనిపోవచ్చు అని తెలిసినా కొంచెం అటూ ఇటూ అయినా భార్య ప్రాణాలు పోతాయని తెలిసిన తన ప్రాణాన్ని పణoగా పెడుతున్న భార్య మీద ప్రేమ కాస్తున్న కడుపులో ఆడో మగో తెలియని పిండం మీద పెంచుకున్న అతి ప్రేమ ఆ భయాన్ని తొక్కేస్తే 9 నెలలు నిండగానే వచ్చే నొప్పిని భరిస్తూ శరీరంలో ఉన్న ఎముకల్ని బిగబట్టి చనిపోవచ్చు అని తెలిసిన బిడ్డకు జన్మనిస్తుంది తల్లి.

9 నెలలు ఒక జీవిని మింగి క్రక్కె ఆ ప్రక్రియను తాను ఆనందంగా నిర్వర్తిస్తుంది. అంత నొప్పిని భరించి ఆ బాధను ఆందోళనను ఒక్క బిడ్డ బయటకు రావడం తోనే ఆ బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా తన బిడ్డను చూసుకుంటుంది. ఆడపిల్ల  పుడితే మహాలక్ష్మి అని మగవాళ్ళు పుడితే వంశాంకురం అని సంబర పడతారు ఇంటిల్లిపాది తామే ఆ నొప్పిని అనుభవించినట్లు గా భావించి పిల్ల పుట్టగానే ఆ బాధనంతా మరిచి ఆనంద పడిపోతారు.

ఇక తండ్రి ఆనందం చెప్పనలవి కాదు మహాలక్ష్మి పుట్టింది అంటూ మా అమ్మమ్మ, తాతమ్మ,  అమ్మ, మళ్ళీ పుట్టింది అంటూ ఎంతో ముద్దు చేసి భార్యను పక్కకు పెట్టి మరి తండ్రి ఆడపిల్లను తన గుండెల మీద పెంచుతాడు తల్లి తన పిల్లల కోసం పాలు బాగా రావాలని నోటికి రుచించక పోయిన పత్యం తింటూ పిల్లకు పాలు ఇస్తుంది. తన ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి పెంచుతుంది.

ఆత్మా+హత్యా

Depressed lonely male sitting among dry grass in autumn meadow in cloudy day

కొంచెం పాకినా ఆoబాడినా ఒక చిన్న మాట మాట్లాడినా ఎంతో మురిసిపోతూ అమ్మ పాడింది అమ్మ మాట్లాడింది అమ్మ కూర్చుంది అని అంటూ పిల్లలకు దెయ్యం భూతం కొట్టకుండా ఎన్నో విధాల జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ తనకు నచ్చిన బట్టలు తనకు నచ్చిన కూర తనకు నచ్చిన వస్తువులనే ఇంట్లోకి తెస్తూ తన ఇంట్లో తన తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర బంధువుల లో ఒక మహారాణిలా పెరుగుతుంది అమ్మాయి తనకు నచ్చిన చదువును చదివిస్తూ తాను కోరుకున్న రంగంలో స్థిరపడేలా చెయ్యాలని చూస్తారు.

తల్లిదండ్రులు ఎంత కష్టమైనా అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల చాటు బిడ్డగా చదువుకుని ఒక లక్ష్యం వైపు గా వెళ్లాలనుకున్న అమ్మాయి తన ఊరు దాటి తల్లిదండ్రులను వదిలి తాను ఎంచుకున్న రంగాన్ని  ప్రేమిస్తూ వచ్చి ఎన్నో సాధకబాధకాలు పడి చివరికి తాను అనుకున్నది సాధించిన తర్వాత ఎవడో ముక్కు మొహం తెలియని వాడు అప్పటివరకు చూడని వాడు ఎలాంటివాడో తెలియని వాడు.

ఆమె జీవితంలోకి ఇప్పటినుండి నేనున్నానంటూ వచ్చి తల్లిదండ్రుల అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ ని జాగ్రత్తల్ని తీసుకుని ఆమె పైన చూపిస్తుంటే ఎవరో తెలియని వాడు తన మీద చూపిస్తున్న ఆ ప్రేమని ఆప్యాయత ని నిజమని నమ్మి వాడి ప్రేమకు పొంగిపోయి వాడికి తానే లోకమని తలచి వాడే లోకంగా వాడినే ప్రాణంగా ప్రేమించి అప్పటివరకు తన వారితో కూడా చెప్పుకోలేని పంచుకోలేని కొన్ని భావాలను తన ఆశలను కోరికలను ఆశయాలను తన జీవితంలో తాను ఎలా ఉండాలో అనే వాటిని తన మనసును వాడి ముందు బయటపడేస్తుంది బయట పడుతుంది ఆమె.

అప్పటిదాకా ఆమె లోకంగా బతికిన వాడు ఆమె బలాలను బలహీనతలను తెలుసుకొని ఒకవేళ ఆమె సంపాదన పరురాలైన లేక మరేదైనా ఆమెని ఆమె జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ఆమె వాడి నమ్మి తన జీవితాన్ని వాడి చేతిలో పెడుతుంది తన వారు కూడా గుర్తుకు రారు ఆ సమయంలో వాడు అంత ప్రేమను చూపిస్తాడు.

ఆమె జీవితం వాడి చేతిలో కి వెళ్ళగానే వాడు ఆమె మీద అధికారం చెలాయిం చాలని చూస్తాడు. అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు వాళ్లతో మాట్లాడకు అలా నవ్వకు ఇలా నవ్వకు ఆ బట్టలు వేసుకో కు అంటూ తనకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు తీసుకుంటూ ఏవేవో కథలు చెప్తూ ఆమె మీద ప్రేమతోనే అని చెప్తున్నా నువ్వు అలా ఉంటే నాకు నచ్చదు అని కల్లబొల్లి కబుర్లు చెప్తూ ఆమెను మానసికంగా బలహీను రాలిని చేస్తాడు వాడు.

ముందే ఆడపిల్ల బలహీనురాలు శారీరకంగా మానసికంగా కూడా మనసు తో ఆడుకుంటూ బలహీనురాలిని చేస్తాడు. ఆమె వాడి ని నమ్మి పిచ్చిగా ప్రేమించడం తో వాడు చెప్పిన వాన్ని నమ్ముతుంది వాడంటే పడిచస్తుంది ఎందుకంటే అప్పటివరకూ అన్నదమ్ములు తల్లిదండ్రుల ప్రేమ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక బయటి వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి తన జీవితం లోకి కొత్తగా వచ్చిన వాడు చూపుతున్న ప్రేమని నిజమని నమ్ముతూ వాడి చేతిలో కీలుబొమ్మగా మారిపోతుంది.

మరి ఇక్కడ ఆమెకి ఆలోచనాశక్తి లేదా అంటే లేదనే చెప్పవచ్చు ఎందుకంటే వాడు ఆమెని ఆలోచించే సమయం ఇవ్వకుండా చేశాడు చేస్తాడు కాబట్టి. ఇక తన జీవితానికి వాడే అర్థం పరమార్థం అని నమ్ముతుంది వాడిని ఆరాధిస్తుంది వాడికి ఏదైనా అయితే తను ఏడుస్తూ బాధపడుతుంది వాడి కష్టాన్ని తన కష్టంగా అనుకుంటుంది వాడి నొప్పిని తననొప్పిగా స్వీకరిస్తుంది వాడి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతుంది. అవసరమైతే తన నగలు కూడా ఇస్తుంది తన వారికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచుతోంది.

తన వారి నుండి ఎన్నో విషయాలను వాడి గురించి దాచిపెడుతుంది తను ఇచ్చిన డబ్బులు నగలను కూడా తన వారికి తెలియని ఇవ్వదు తెలిస్తే ఎందుకు ఇచ్చావు అని అంటారు అని కాదు ఒక బయటి వ్యక్తి కోసం తాను అలా చేశానని తెలిస్తే వారి ముందు తాను బయటపడతానని భయం. తనలో ఈ కోణం కూడా ఉందని తన వారికి ఎక్కడ తెలుస్తుందో నని అనుమానం వల్ల తన వారికి తెలియనివ్వదు అదే ఆమె చేసిన చేస్తున్న పెద్ద తప్పు. అప్పటివరకు తన వాళ్లతో ఏ విషయాలు దాచక అన్ని విషయాల గురించి ఫ్రీగా చర్చించే అమ్మాయి ప్రేమికుడు.

ఆత్మా+హత్యా

 

కానీ భర్తగా కానీ వచ్చే వ్యక్తి గురించి మాత్రం చర్చించలేదు.ఎందుకో ఒక్క ఈ విషయం అనే కాదు ప్రతి ఇంట్లోనూ అల్లుడు కూతురు రాగానే అల్లుడేదో పరాయి వ్యక్తి అయినట్లుగా అతనికి విలువనో మరి భయము తెలియదు కానీ అతను ఒక విధంగా చూస్తారు మరి వారి పర్సనల్ సమస్యలన్నీ చెప్పుకుంటారు కొందరు పైకి భయం అల్లుడొచ్చాడు అని అనగానే ఏదో దయ్యం భూతం వచ్చినట్లు ఫీల్ అవుతారు.

కొందరు పిల్లను ఇచ్చే ముందు మన ఇంటి పరిస్థితి అంతా అతనికి అతని తల్లిదండ్రులకు చెప్పుకుంటాం ఇక అన్నీ తెలిసిన తర్వాత మళ్లీ అతను రాగానే లేనిపోని ఆడంబరాలకు వెళ్లడం లేని మర్యాదలు చేయడం ఏంటో ఇక అల్లుడు కూడా అత్తగారి సంగతంతా వారి ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా తనకు మర్యాదలు చేయలేదని తనకు లోటుపాట్లు జరిగాయని అవమానించారని ఇలా ఏవేవో మాటలతో బింకంగా  కోపంగా ఉంటాడు.అన్నీ తెలిసి ఇక ఈ దాగుడు మూతలు ఎందుకో.

సరే ఇక అమ్మాయి వాడిని నమ్మి వాడి గురించి తన వారికి చెపితే ఎక్కడ తప్పుగా అనుకుంటారు అని  భయపడుతూ వాడిని వారు ఏమైనా అంటే తట్టుకోలేదు కాబట్టి ఏమీ చెప్పదు తన గురించి తాను ఏమి చేసినా చెప్పిన ఆ అమ్మాయిని నమ్ముతుంది గొర్రెల అని భావించి తన మంత్రాన్ని జపిస్తూ నువ్వే లోకం నువ్వే ప్రాణం అంటూ ఉంటాడు అన్ని విధాలా అమ్మాయిని వాడుకుంటూ ఉంటాడు ఈ విషయం తమ కూతురు చెప్పకపోగా బయట వారందరికీ తెలిసిన తర్వాత వారు వచ్చి వారి తల్లిదండ్రులకు చెప్తారు.

అప్పటిదాకా తమ ముందు పెరిగి తిరిగిన తమ కూతురు ఎవరి మాయలో పడింది అని తెలుసుకున్న తల్లిదండ్రులకు గుండెలో బాధ తో బరువు ఎక్కుతాయి.  తమ చిన్నారి తమ కళ్ల ముందు పెరిగిన అమ్మాయి ఒక కొత్త వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి ఇ ఇన్నాళ్లు పువ్వుల్లో పెట్టుకుని పెంచిన తాము ఆమెకు ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయలేమా ఆమెకు తగిన వాడిని వెతక లేమా అని అనుకుంటారు ఆమెకు ఏం కావాలో మాకు తెలియదా అనే భ్రమలో వారు ఉంటారు.

నిజానికి ప్రతి వ్యక్తిలోనూ రెండు తత్వాలు ఉంటాయి ఒకటి మంచితనం రెండోది తమకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు ఆ రెండో మనిషి బయటకు వస్తారు ఎవరి విషయంలో అయినా ఇక అప్పుడు మొదలవుతుంది ఆ అమ్మాయికి టార్చర్ అసలు ఇక్కడ ఆ అమ్మాయి కూడా తక్కువదేమీ కాదు ఆమెలోనూ రెండో వ్యక్తి బయటకు వచ్చి ఇన్ని రోజులు తనకు నచ్చిన వన్నీ చేసిన తన వారు ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని ఎందుకు వద్దంటున్నారో కాదంటున్నా రో అర్థం కాకుండా ఉంటుంది.

మరి అంతలోనే తన పంతం నెగ్గించుకున్న అని తాను అనుకున్న వాడినే దక్కించుకోవాలి అనుకుంటుంది ఇంకా తల్లిదండ్రులు తమ కూతుర్ని ఎవరినైతే ఇష్టపడుతుందో ఆ వ్యక్తి తగిన వాడా కాడా అని ఒకటికి రెండు సార్లు చూస్తారు బయటి వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి ఎలాంటివాడో తెలియని వాడికి తమ కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోరు అసలు వారికి మనసొప్పదు కు వాడి గురించి కొంచెం చెడుగా గమనించిన వాడు వద్దంటే వద్దని పట్టుబడతారు ఇక్కడ కులాలు కాకున్నా వ్యక్తి మంచివాడు కాదని చిన్న అనుమానం కలిగిన వారు ఒప్పుకోరు.

ఆత్మా+హత్యా

White Medication Pill on White Surface

అమ్మాయి సంపాదన పరురాలు అయితే ఇన్నాళ్లు సంపాదిస్తూ తమకు ధారపోసి నడుపుతూ ఇకముందు తమకు తెలియని ఎవడో ఒక ఇస్తుందని వాడు అనుభవిస్తాడని తమ కూతురు కష్టాన్ని దోచుకుంటాడు అని అర్థం కాగానే వారు బంగారు గుడ్లు పెట్టే బాతునీ వదులుకోలేక ఆమెను కట్టడి చెయ్యడం  మొదలుపెడతారు. ఆమెను భయపెట్టో బాధ పెట్టో వాడిని మర్చిపోయేలా చేయాలని నిజాలను అన్నిటిని చెప్పడం మొదలు పెడతారు.

వాళ్ళు అప్పటివరకు వాడి మాయ మొహం లో ఉన్న ఆమె తల్లిదండ్రులు నిజాలను చెప్పడంతో కొంచెంగా బయటకు వచ్చి వాస్తవాన్ని గ్రహించి వాటికి దూరంగా ఉండటం మొదలు పెడుతుంది అప్పుడు ముందే చెప్పుకున్నట్లుగా ప్రేమను చూపించిన వాడు తన రెండో మనిషి ని బయటకు తీసుకొచ్చి నువ్వు అప్పుడు నీ వారి గురించి అలా చెప్పావు నువ్వు నేను కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు ఇంకా ఏవేవో ఉన్నాయంటూ వాటిని మీ వారికి పంపిస్తాం అని బెదిరిస్తాడు.

దాంతో ముందుగా భయపడి వారికి కావలసిన డబ్బు ఇంకేదో అవసరాలు తీరుస్తుంది ఆమె ఇవ్వడంతో వాడామెని వదులుకోలేక డబ్బు రుచిమరిగిన జలగల ఆమెని పీల్చిపిప్పి చేస్తుంటాడు చివరికి ఆ విషయం కూడా ఆమె తల్లిదండ్రులకు ఎలాగోలా తెలిసి ఆమెను కాసేపు తిట్టి చూసావా నేను చెప్పిందే నిజమైంది మాకు తెలియకుండా నువ్వు వాడి నమ్మవు కానీ వాడు ఎంత చెడ్డ వాడు నీకు ఇప్పుడైనా తెలిసిందా అంటూ ముందే గాయపడిన గుండెల్లో పుల్లతో పొడుస్తూ  తూట్లు పెడతారు.

ఆ తర్వాత వాడిలా టార్చర్ పెడుతున్నాడని నలుగురికి చెప్పి వారి సహాయంతో పోలీసు కేసు పెట్టి స్తారు అప్పటివరకు తమ కూతురు వాడికి ఇచ్చిన డబ్బంతా వెనక్కి తీసుకోవాలని చేసే ప్రయత్నంలో తమ పరువు పోతుందని కూడా ఆలోచించరు ఆమె డబ్బులు తిరిగి ఆమె జీవితం బాగుండడానికి అనే ముందు జాగ్రత్తతో వారలా కేసు పెడతారు వాడి మీద కానీ అప్పటి వరకు తన గ్రూపులో ఉన్న బంగారు చిలక లాంటి అమ్మాయి తనకు వ్యతిరేకంగా మరి తనను జైలుకు పంపాలని చూస్తున్నారని అనుకోగానే వాడిలోని మేకవన్నె పులి ని బయటకు తీస్తాడు వాడు.

అందంగా ఆత్మీయంగా నవ్వుతూ అప్పటి కన్నా ఎక్కువ ప్రేమను ఒలకబోస్తూ అయ్యో ఏంటి నువ్వు నన్ను ఎంత అవమానించిన నన్ను ఏమన్నా నేను నీ బాగు కోసమే చూస్తాను నువ్వు బాగుంటే చాలు ఎక్కడున్నావ్ నేను నీ సుఖమే కోరుకుంటాను నువ్వు నన్ను మరిచిపోయిన నేను నిన్ను మర్చిపోలేను అని అంటూ తిరిగి  కపట ప్రేమ ని చూపిస్తాడు. అప్పటికే సందిగ్ధ తో ఉన్న అమ్మాయి ఎవర్ని నమ్మాలో తెలియని అయోమయంలో నా వాళ్ళు చెప్పిందంతా అబద్ధం ఇతని ప్రేమే నిజం అతని మాట నిజం అతను నిజం అతనే నా సర్వస్వం అతనే నా జీవనం అని భావించి వాడిని నమ్ముతుంది.

మరొక్కసారి నా మాటల వల్ల తన వారు పరాయి వారు అవుతారు తనవారిని శత్రువుల కనిపిస్తారు తమను విడదీయడానికి చూస్తున్నారని అనుకుంటుంది అమ్మాయి అప్పుడు అభిమానాన్ని వాడు క్యాష్ చేసుకోవాలని చూసి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చేస్తారని అనుకోలేదు అంటూ ఆమెపై లేని ప్రేమని నటిస్తాడు. దానికి ఆమె వాడి మాటలు నమ్మి తన వాళ్ళ వారి మీద పెట్టిన కేసు ని తీసుకుంటానని తన వారికి చెప్తుంది దానికి వారు ఆశ్చర్య పోయి తమ కూతురు తమకు ఎక్కడ అ కాకుండా పోతుందోనని సమయంలో ఆమెను నిర్బంధించిన వాడి పెళ్లి చేసుకుంటాను అనడంతో నమ్మి తాను నమ్మిన వాడు తన వాళ్లు అనుకున్నట్లుగా చెడ్డవాడు మంచివాడు అనే భ్రమలో కేసులు తీసుకునే సరికి తమ కూతుర్ని వాడి నుండి ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మరొకరి సహాయం తీసుకున్న తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయి మీద అ సర్వాధికారాలు పొందాలనుకున్న అప్పుడు ఉన్నవాడు.

అసూయ బరువై ఆమెని నిందిస్తూ నువ్వు వాడితో మాట్లాడకు వాడితో ఉండకు అనే అంశాలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి తన వారికి సర్ది చెప్పుకోలేక తన వాళ్లకు చెప్పుకోలేక ఎదురు చెప్తే ఎక్కడ పెళ్లి చేసుకో డో అని అని భయంతో తనవారిని బెదిరిస్తూ వారి మాటలకు ఎదురు చెప్పి వచ్చిన వ్యక్తిని మంచి చెప్పేవాడిని నువ్వెవరని ప్రశ్నిస్తుంటే వారు ఆ తల్లిదండ్రులు కోపాన్ని ఆపుకోలేక కనిపించిన పెద్ద చేసిన కూతుర్ని ఒక దెబ్బ కొట్టి హక్కు ఉన్నవారు ఆమెని ఒక దెబ్బ వేస్తే అలా అయినా ఆమ వాడిని మర్చి పోతుందని అనుకుంటే ఆ గొట్టిన విషయం కూడా వాడికి చెప్పిన అమ్మాయి నేను ఇక్కడ ఉండలేను నన్ను పెళ్లి చేసుకో అని వాడిని బతిమిలాడితే దానికి వాడు మా అమ్మ ఒప్పుకోవాలంటే శరత్ పెట్టిన ఆమె ధైర్యంగా అతని తల్లి మాట్లాడిన నేను తను ప్రేమించుకున్నాం.

నాకు పెళ్లి చేయండి అని అడిగినప్పుడు ఆమె ఒప్పుకోక చివరికి వాడు ఆ వెధవ అన్ని విధాల ఆ అమ్మాయి తో ఆడుకుని ఒక చిన్న మెసేజ్ తో నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి గుండె పగిలేలా ఏడ్చిన తాను ఇన్నాళ్లు నమ్మిన నన్ను మోసం చేయకు నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఆమె ఆత్మగౌరవాన్ని కూడా పక్కనపెట్టి అడిగినప్పుడు వాడు అమృతం నరరూప రాక్షసుడు లేదు లేదంటూ ఆమెను పట్టించుకోక పోతే తన వారందర్నీ కాదని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి మోసపోయినoదుకు తన వారు చెప్పింది విననందుకు ఆమె తన జీవితాన్ని క్షణకాలంలో అంతం చేసుకుంది.

కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అప్పుడు ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించు తన సమస్యను తన వారికి చెప్పి ఉంటే వారి ఇంకో పరిష్కారం కానీ లేక వేరే ఏదైనా సలహా ఇచ్చేవారు లేదా పెళ్లి చేసుకోక పోయినా మళ్లీ కేసు పెట్టి ఉండేవారు కనీసం వాడికి ఇచ్చిన డబ్బు అయినా లేదా అలాంటి వాడికి జైలు శిక్ష పడేది కానీ కేవలం ఆవేశం నా వారి ముందు నా ఆలోచన అమ్మాయి ప్రాణం తీసుకునేలా చేసింది.

ఒక ఊరు నుండి మరొక ఊరికి వచ్చి అందరికి దూరంగా ఉంటూ తాను అనుకున్న రంగంలో కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న అమ్మాయి వాడు ఎవడో ప్రేమించాను అని అనగానే నమ్మడం ఏంటి నిజమే అమ్మాయిలు కాస్త ప్రేమ చూపించగానే కరిగిపోతారు కానీ ఆ ప్రేమ అనేది నిజమా కాదా అని ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆలోచించి నా వాడు మొట్టమొదటి సారి ఆమె జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని అంశాలు పెట్టినప్పుడు అయినా వాడి మనసుని గ్రహించి మేలుకొని వాడిని దూరం పెట్టి ఉంటే ధైర్యంగా పెట్టడానికి అని ప్రశ్నించిన వాడు ఆమెను వదిలి వెళ్లి పోయే వాడు చివరికి తల్లిదండ్రులు చెప్పిన అప్పుడైనా జాగ్రత్త పడి ఉంటే వాడి మాటలు నమ్మకుండా ఉంటే వారి నుండి ఆమె బయటపడేది కావచ్చు ప్రాణం తీసుకోవడం చాలా సులభం దానికి చాలా ధైర్యం కావాలి అంటారు చాలామంది.

కానీ ఆవేశంలో కోపంలో రెండు నిమిషాల్లో ప్రాణం తీసుకోవచ్చు రెండు నిమిషాలు ఆమె తన వారి గురించి ఆలోచించి ఉంటే తాను పుట్టినప్పుడు తాను కడుపులో ఉన్నప్పుడు తాను తిరుగుతున్నప్పుడు తను నడుస్తున్నప్పుడు తన వారు తన మీద చూపించిన ప్రేమ ఆశలను కోరికలను గుర్తు చేసుకుంటూ ఉంటే తనని కనడానికి తన తల్లి ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించుకుంటే తనకున్న బాధ్యతలను బంధాలను గుర్తు చేసుకుని ఉంటే ఆమె అనుకున్న లక్ష్యాన్ని ఆశయాన్ని కానీ గుర్తు చేసుకుని ఉంటే తనని గాఢంగా ప్రేమించే వ్యక్తి మహారాణిలా చూసే తన తండ్రి నీ గుర్తుతెచ్చుకొని ఉంటే ఆమె తన చావును.

తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఏమో ఆమె సున్నితం ఆమె మనసు పునీతం ఆమె ఆలోచనా విధానం సున్నితం ఆమె తాను ప్రేమించిన వాడు తనని మోసం చేశాడన్నా నిజాన్ని జీర్ణించుకోలేక పోయి చనిపోయింది కానీ ఒక్క క్షణం వాడి కోసం నేను ఎందుకు నా జీవితాన్ని చాలి oచుకోవాలి అని అనుకుంటే, అసలు ఆలోచన కూడా రానివ్వకుండా ఆమె మనసుని ముక్కలు చేసి న వాడిని ఏం చేయాలి కానీ అమ్మాయిల్లో కూడా తాను అనుకున్నదే జరగాలనే ఆలోచనా విధానం మారాలి ఎవరు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఆశించి చెప్తున్నారు.

అనే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కానీ ఇప్పుడు జరగవలసిన నష్టం జరిగిపోయింది ఒక్కడే కానీ వాడు కూడా పడలేదు ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే జీవితం బాగుండేదేమో తన తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి మిగిలిన ఇద్దర్నీ జైలుపాలు చేసి తమ్ముడి అక్కల జీవితాలను అపహాస్యం చేసిన నలుగురి నోళ్లలో నా నేల చేసుకున్నా ఆ అమ్మాయి సాధించింది.

ఏమిటి బ్రతికి ఉండి న్యాయంగా పోరాడి సాధిస్తే తన పేరు చరిత్రలో నిలిచిపోయే దేమో కానీ పిరికితనంతో పోరాడే శక్తి లేక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తన నిండు జీవితాన్ని నాశనం చేసుకుని చచ్చి సాధించేది ఏమిటి  ఏటికిఎదురొడ్డి పోరాడిన అప్పుడే మన జీవితం ధన్యమైనట్టే సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు దాన్ని ఆ సమస్యను గుర్తించి పరిష్కరించకుంటే మనలోని స్ఫూర్తిని నింపుకుని మిగిలినవారికి మనస్పూర్తిగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు దయచేసి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకుంటే మీకు మీరే సమాధానాలు వెతుక్కోవచ్చు నీ కంటే ఎక్కువ సమస్యలు ఉన్నా వారిని అంగవికలుర అని గమనించండి.

మీ సమస్య సమస్య పెద్దదా చిన్నదా అని బేరీజు వేసుకోండి దేవుడిచ్చిన జీవితం ఆత్మహత్యల పేరుతో అర్ధాంతరంగా తీసుకోకండి ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి కనీసం వారి కోసం అయినా బతకండి బ్రతకొచ్చు అనేది మర్చిపోకండి ఆత్మహత్య మహాపాపం అని గుర్తుంచుకోండి

Related Posts