ఆత్మ తో నేను A Helpful Soul 3

ఆత్మ తో నేను

దెయ్యాలు ఉన్నాయా అనేది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వారికి కూడా తెలియని ఒక ప్రశ్న ఇంత పెద్ద ప్రపంచంలో కాకి రెట్టంత ఉన్న నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలనా చెప్పాలి అనే అనుకుంటున్నా.

అయితే ఇది నాకు జరిగిన నిజమైన అనుభవం కాబట్టి అది నేను చెప్తున్నా కాబట్టి మీరు నమ్మవచ్చు అని నేను గట్టిగా చెప్పగలను అబ్బా ఏమైందో చెప్పకుండా ఈ సోది అవసరమా అంటారా సరే చెప్తాని వినండి మరి…

నా పేరు రాజేష్ అండీ నేను టీచర్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నన్ను అదృష్టం వరించి నాకు ఉద్యోగం వచ్చింది ఆ సంతోష సమయంలో నేను ఎక్కడ పోస్టింగ్ వచ్చింది గమనించలేదు.

కానీ నా తల్లిదండ్రులను ఉన్న ఊరిని స్నేహితులను వదిలి వెళ్లే వేరే ఊర్లో వచ్చిందని తెలుసుకున్నా ఉద్యోగం కోసం కాయలు కాచేలా ఎదురుచూసాను. వచ్చాక ఎంత సంతోషంగా ఉంటుంది కదా అలా కలలో తెలిపోతూ నేను వెళ్లాల్సిన రోజు రేపే అని మర్చిపోయాను.

Cutter Man, Dead, Death, Skull

ఆరోజు రాత్రి మా అమ్మ నాకు గుర్తుచేసేంత వరకు కూడా బాబు నువ్వు వెళ్ళేది రేపే కదారా అని అంది.

నాకు గుర్తుకొచ్చి ఇంకా బట్టలు అవేవి సర్దుకోలేదని గబగబా లోపలికి పరుగెత్తా బోయను దానికి మా అమ్మ నీ సంగతి తెలిసే నీ బట్టలు అన్ని రెడి చేసి పెట్టాను కానీ నువ్వు తొందర పడకు నిదానంగా తిను అని అంది.

అమ్మా ఎంతయినా అమ్మా అమ్మనే అని అనుకున్నా మనసులో పైకి మాత్రం మరి నన్ను ఎందుకు అమ్మా భయపెట్టావు అని అన్నాను.

నీకు ఉద్యోగం రావడం మాకు సంతోషంగానే ఉంది కానీ నువ్ మమ్మల్ని వదిలేసి వెళ్లడం అంటేనే ఇబ్బందిగా బాధగా ఉంది అంది.

అబ్బా అమ్మ నేను వెళ్లిన తర్వాత అక్కడ ఇల్లు అది తీసుకుని మిమల్ని రమ్మని ఉత్తరం రాస్తాలే కానీ నువ్వు అలా బాధ పడకు అని అన్నాను మా నాన్నగారు కూడా అలాగే లేర కానీ రెండు రోజులకు ఒక్కసారి అయిన ఉత్తరాలు రాస్తుండు అని నన్ను తెల్లవారి వచ్చి బస్ స్టాండ్ లో బస్ ఎక్కించారు.

నేను నాకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళానుఊరంటే పెద్దది కాదు ఒక రెండు వందల గడపలు ఉన్న ఒక పల్లె అందంగా ఉన్న ఆ పల్లె నాకు బాగా నచ్చింది అనుకోండి చూడగానే నేను దాంతో ప్రేమాలో పడి పోయా పల్లెతో ప్రేమ ఏంటి అంటారా అయ్యో మీకు పల్లెలో అందాలూ కనిపించవా అండి.

పచ్చని పొలాలు ఒక పక్కన చెరువు చెరువులోని తామర పువ్వులు చల్లని గాలి స్వచమైన ప్రేమ కలిగిన మనుషులు వీరంతా అంటే వారికీ కల్లాకపటం తెలియదు కుళ్ళు కుతంత్రాలు తెలియని వాళ్ళు వాళ్ళ అభిమానం సంపాదించుకుంటే మనల్ని దేవుళ్ళా చూస్తారు మికా విషయం తెలుసా అందుకే అన్నాను ఆ ఊరితో నేను ప్రేమలో పడిపోయా అని.

సరే ఊర్లోకి వెళ్ళగానే కొందరు నాకు ఎదురయ్యి ఎవళ్ళు బాబు మీరని అడిగారు నేను వారికీ మీ ఊరికి కొత్తగా వచ్చిన పంతులుని అని చెప్పా .నేను అలా చెప్పగానే అయ్యా మీరు పంతులు గారా అంది రండి అయ్యా మీకోసమే మేము చూస్తున్నాం.

నేను ఈ ఊరికి సర్పంచుని విడు నా పాలేరు నా పేరు నాయుడయ్య అంటారు విడు గోపాలనం అని వారిని వారు పరిచయం చేసుకున్నారు.

వారితో పాటుగా నేను నా బడి కేసి వెళ్లాను నాయుడయ్య పేరుకే సర్పంచ్ అని కానీ అతన్ని ఒక ట్రంపు కార్డు లా వాడుకుంటున్నారు పెద్ద వాళ్ళని తెలిసి అవాకయ్యా రాజకీయాలు పల్లెలూ కూడా మారుస్తున్నాయా అని బాధగా అనిపించింది.

ఆత్మ తో నేను

నాకు కానీ నేను అందులో తల దూర్చ లేక పోయాను బడి పంతుల్ని నాకెందుకులే అనుకున్నా అందరి లాగానే వాళ్ళు నాకు ఒక చిన్న గుడిసె ను అదే ఇంటిని వసతిని ఇచ్చారు.

Soul, Ghost, Horror, Halloween, Creepy

నాకు నలుగు రోజులు నేను వండుకోలేను అని తెలిసి మా అమ్మ గారు వచ్చే వరకు వంట చేసి పెట్టడానికి ఎవర్నైనా పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు.

సరే వాళ్ళు పంపే వరకు అయినా నేను చెయ్యి కల్చుకోక తప్పదు అని అర్ధం అయ్యి నా ప్రయత్నం నేను చేస్తూ కట్టెల పొయ్యి మిద బియ్యం పెట్టాను మంట ఎక్కువయ్యిందేమో అన్నం పొంగిపోతూ ఉంటె ముత తియ్యడానికి గుడ్డ కనిపించక చెయ్యి తో తీసేసరికి చెయ్యి కాలింది మూత పక్కన పడింది.

అబ్బా అని నేను కాలిన నా చెయ్యిని ఉప్ ఉప్ అని ఉడుకుంటూ ఉండగా హ హ హ  అని నవ్వు వినిపించి ఏ ఎవరూ అని అడిగి చూసాను నవ్వు వినిపించిన వైపు అక్కడ ఒక పాతికేళ్ళ అమ్మాయి నిలబడి నవ్వుతుంది.

ఎవరమ్మా నువ్వు అని అడిగా ఆమెని నేను అయ్ నా పేరు వాసంతి పంతులుగారు నన్ను మా అయ్యా మీకు వండి పెట్టమని పంపారు అని అంటూ గబుక్కున వచ్చి అన్నాన్ని పొయ్యి మీదనుండి దింపింది గుడ్డ లేకుండానే నేను అది గమనించినా ఆడవాళ్లే కదా వారికీ అలవాటుగానే ఉంటుంది అని అనుకుని పట్టించుకోలేదు .

నువ్వు గోపాలం కుతురివా అతన్ని చుస్తే అంత పెద్ద కూతురు ఉన్నట్టుగా అనిపించదులే అన్నాను నేను ఆమెతో మళ్ళి ఓ నీ పేరు వాసంతి నా బసంతి లాగా బాగుంది అని నేను మాట్లాడుతూ ఉండగానే ఆమె వంట చేసేసినట్టుగా ఉంది నాకు కంచంలో వడ్డించి తెచ్చింది బయటకు.

నేను మంచి ఆకలి మిద ఉండడం వళ్ళ గబగబా తినెసాను అబ్బా ఏమి రుచి ఏమి రుచి అంత రుచి గల తిండిని కూరని మా అమ్మ కూడా వండలేదు ఇంత  వరకు అని చెప్పగలను.

ఇక అప్పటి నుండి రోజు ఆమె నాకు వండి పెట్టడం నేను తిని పెట్టడం రకరకాల రుచులు ఆమె నాకు వండి పెడుతూ ఉండేది వాసంతి నాతోచాలా విషయాలు మాట్లాడేది ఆమె తెలివికి నేను ఆశ్చర్య పోయే వాడిని ఆమెకు ఎన్నో విషయాలు నాకు తెలియనివి కూడా ఆమెకి తెలుసు చదువుకున్న నాకు కూడా అవి చాలా వింతగా అనిపించేవి.

అయితే ఆమె ఎన్ని మాటలు మాట్లాడిన ఆమెలో ఎదో గoభీరత ఉండేది ఆమె కళ్ళలో ఎదో వేదన కనిపించేది నాకు అది ఎప్పుడు అడుగుదాం అని అనుకున్నా ఆ మాట అడగకుండా నన్ను ఏమర్చేది ప్రతి అమావాస్య పౌర్ణమికి నాతో మల్లె పువ్వులు పకోడీ ఒకనాటుకోడిని తెమ్మని అనేది నేను కోడి ని తెచ్చి ఇచ్చేవాడిని.

ఆ కోడి నాకు వండి పెట్టేది అంత రుచి గల కోడి కూరని నేను నా జన్మలో తినలేదు అంత బాగా వండేది నేను తిన్న తర్వాత నన్ను లోనికి రానివ్వకుండా ఆమె తినేదో మరి పట్టుకుపో ఎదో కానీ బొమికలు కూడా కనిపించేవి కావు తెల్లారి….

వాసంతి వచ్చి చాలా రోజులు అయినా ఒక్క సరి కూడా ఆమె తండ్రి అదే గోపాలం నాకు కనిపించలేదు నన్ను కలవలేదు పల్లెలో అంతే సహాయం చేస్తారు కానీ దీని గురించి మరి మాట్లాడారు అని అనుకున్నా.

ఆత్మ తో నేను

Spooky, Death, Cemetery, Graves, Soul, Man, Woman, Fog

నేను ప్రొద్దున మాత్రం ఒకే గంట ఉంది వెళ్ళిపోయేది మిగతా సమయం అంతా ఆవిడా ఎక్కడికి వెళ్ళి పోయేదో మరి అయితే నేను ఆమె తన ఇంటికి వెళ్లిపోతు ఉందని అనుకుంటూ ఉండే వాడిని.

ఈ మూడు నెలలు వాసంతి నన్ను ఒక్క సరి కూడా డబ్బులు కానీ వస్తువులు కానీ అడగలేదు పోనీ నేను ఇవ్వాలని అనుకున్నా వద్దు బాబు నాకు విలువ కట్టడం అదే నా పనికి విలువ కట్టడం మంచిది కాదు .

నాకు నచ్చదు నేను ఈ పని ఆప్యాయంగ మీరు నాకు నీడను ఇచ్చిన స్నేహితుడు అని భావించి చేస్తున్నా అని అనేది పోనీ నీకు చీరలు లేవు కదా వచ్చినప్పటి నుండి అదే పచ్చ చిరతో ఉన్నావు అంటే నాకు ఈ చిరంటే ప్రాణం బాబు అని మాత్రం అని  నాకేమి తేవద్దు అని అంటూ ఉండేది.

నేను తన మనసు ఎక్కడ బాధ పడుతుందో తెస్తే అని తేకుండా ఏమి అడగకుండానే ఉండే వాడిని అంతగా కష్టం వస్తే గోపాలానికీ ఇవ్వచ్చు అని అనుకున్నా కూడా.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను మా అమ్మా నాన్న గారిని రమ్మని ఉత్తరం రాసాను.

ఆ విషయాన్ని నేను అదే రోజు రాత్రి వాసంతికి చెప్పాను ఇక నీకు ఈ వండి పెట్టె గోల ఉండదు అని మా అమ్మగారు వస్తున్నారు అని నేను ఆ మాట చెప్పగానే అయ్యో అవునా అయితే నేను ఇక్కడనుండి వెళ్ళిపోక తప్పాదా అని అంది బాధగా ఆమె అంతాగా బాధ పడ్డం అదే మొదటి చివరి సారి అవుతుందని నేను అనుకోలేదు.

ఆమెని చూడడం కూడా నేనే తిరిగి ఏమన్నా అంటే మా అమ్మగారు వచ్చినా నువ్వు ఇక్కడే ఉండొచ్చు నేను నీకు చదువు చెప్తాను మా అమ్మకు పనిలో సహాయం చెయ్యమని అన్నాను ఎదో జాలిగా అనిపించి.

నిజానికి వసంతి నాకు చాలా సహాయం చేసేది. నేను వర్క్ శెట్లు రాస్తున్నప్పుడు పిల్లల పరీక్ష పేపర్లు దిద్దుతున్నప్పుడు నేను ఉన్న ఇంటిని కూడా శుబ్రంగా పెట్టేది అలికి రకరకాల ముగ్గులతో నింపేది. చుట్టూ పక్కల రకరకాల పువ్వుల పండ్ల మొక్కలను వేసింది.

అవి పచ్చగా అయ్యి పువ్వులు పుస్తూ ఉంటె వాటిని చూసి సంతోష పడేది నేను వాటిని కోసుకొమ్మని అంటే బాబు పువ్వు చెట్టుకు ఉంటేనే అందం అని అక్కడనుండి వెళ్ళిపోయేది మా అమ్మగారు వస్తాను అని అనగానే వసంతి అలా బాధగా వెళ్ళిపోవడం నాకు ఎందుకో బాధ అనిపించింది.

సరే ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు కదా నేను ఏమి అనలేకపోయాను  మూడు నెలలు నా కడుపు నింపింది అనే కృతజ్ఞత నాకు ఉంది కాబట్టి.

మా అమ్మగారు వచ్చాక నా ఇల్లునిఅదే నేను ఉంటున్న ఇల్లుని చూసి చాలా ముచ్చట పడిందిచుట్టూ చెట్లుముగ్గులుచక్కగా సర్ది ఉన్న ఇల్లుని చూసి నువ్వేనా ఇలా పెట్టుకుంది అని అడిగింది.

నన్ను లేదమ్మా నాకు బడి తోనే సరిపోతుంది. ఇదంతా చేసిన వ్యక్తి వేరే ఉంది అని అన్నాను వేరే ఉందా అని మా అమ్మ నా వైపు అనుమానంగా చూసేసరికి అయ్యో అమ్మా ఆ అమ్మాయి ఈ ఊరి సర్పచ్ దగ్గర పని చేసే గోపాలం కూతురు అమ్మ తను నాకు స్నేహితురాలు అంతే అని అన్నాక కానీ ఆమె మొఖం లో అనుమానం పోలేదు.

ఆత్మ తో నేను

ఇంతా బాగా సర్దినమొక్కలు కూడా బాగా పెంచిన అమ్మాయిని నేను ఒక్కసారి అయినా చుడాలిరా అన్న అమ్మ కోరికను సరే అమ్మా పిలిపిస్తాను అని చెప్పి నేను తిరిగి నా పనిలో పడిపోయాను. వాసంతి విషయం మర్చిపోయి అన్ని పనులు అయిపోయి ఒక ఆదివారం నాడు మధ్యానం భోజనం చేసి ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఆ చెట్టుని కూడా నాటింది వాసంతే…

నీడలో మంచం మిద పడుకున్న నా దగ్గరికి ఎవరో వచ్చినట్టు గా అనిపించి కళ్ళు తెరిచి చూసాను. అక్కడ గోపాలం నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు వాసంతి గుర్తొచ్చి ఏమయ్యా గోపాలం బాగున్నావా మొదటి రోజు కనిపించావు అంటే ఇదిగో ఇప్పుడే మళ్ళి నిన్ను చూడడం అని అన్నాను.

ఏమి బాగు బాబు ఆ సర్పంచుని ఎదో కేసు లో ఇరికించారు మీరు వచ్చిన రోజు రాత్రే నన్ను గూడా పట్టుకుని పోయారు. ఇదిగో నిన్న మదేమి తప్పు లేదని నలుగు నెలలు జైల్లో ఉంచాకా వదిలేసారు నిన్ననె ఊర్లోకి వచ్చిన పాపం ఉరికి కొత్త మీరు ఏమి ఇబ్బందులు పడ్డారో ఏమిటో అని చూద్దామని ఈ యల ఇలా వచ్చిన బాబు అన్నాడు గోపాలం.

అయ్యో అవునా గోపాలం నాకు తెలియనే లేదు కానీ నేనేమి కష్ట పడలేదు ఇబ్బంది కుడా పడలేదు గోపాలం మీ అమ్మాయి నాకు అన్ని విధాలా చేసి పెట్టింది. నన్ను చాలా బాగా చూసుకుంది అని అన్నాను నవ్వుతూ గోపాలం తో ..

బాబు ఒక్క నిమిషం మీరేమి అంటున్నారు బాబు నా కూతురు మీకు అన్ని చేసి పెట్టిందా ఎవరూ బాబు నా కూతురు అని అడిగాడు విచిత్రంగా ఒకింత ఆశ్చర్యపోతూ అదేంటి గోపాలం నీ కూతుర్ని నాకు వండి పెట్టమని పంపవు గా నువ్వు అదే మీ వాసంతి ఆ అమ్మాయే వచ్చి నాకు వంట చేసింది.

మిగతా పనులన్నీ చేసేది అని చెప్పను నేను విస్తుపోతూ ఆ మాటలు వినగానే గోపాలం అమ్మా బాబోయి అయితే మీకు వాసంతమ్మా కనిపించిందా బాబు మీతో మాట్లాడిందా…

మీకు వంట చేసి పెట్టిందా? అని అన్నాడు. వాసంతమ్మా అని గౌరవం ఇస్తున్నావు నీ కూతురు కదా ఆమె పైగా కనిపించిందా అంటున్నావు అంటూ వచ్చి అడిగింది మా అమ్మగారు లోపల నుండి. అమ్మ నమస్తే నా పేరు గోపాలం ఈ ఊరి సర్పంచ్ పాలేరుని అమ్మా నాకు ముగ్గురు కొడుకులే కూతుర్లు లేరు అని ఆనందు గోపాలం ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది.

అదేంటి మరి వాసంతి అని అడిగా నేను గోపాలాన్ని చూస్తూ.. బాబు అదే చెప్తాను మీకు వినండి భయ పడకుండా అని చెప్పడం మొదలు పెట్టాడు..

Ghost, Black And White, Dark, Horror, Halloween

బాబు మీకంటే ముందు ఈ ఉరికి వచ్చిన టిచరమ్మ వాసంతి అమ్మ బాబు ఆమె చాలా మంచిది చాలా చిన్న వయస్సు కల్లా కపటం తెలియని మాకంటే కూడా ఇంకా స్వచమైన మనసు కలది మాతో పాటుగా కలిసిపోయింది ఆడింది పాడింది మాలో ఒక మనిషి అయ్యింది.

ఆ అమ్మకి ఎవరూ లేరు అనాధ ఆశ్రమం లో ఉండి చదువుకుని మీలాగే పంతులమ్మగా మారింది. మరి అంతకు ముందు అంటే ఇక్కడికి రాక ముందే ఆ అమ్మకు పెళ్లి అయ్యింది అని తెలుసు అతను పెద్ద డాక్టర్ అని కూడా చెప్పింది.

ఆమెకి పిల్లలు అంటే చాలా ఇష్టం పాపం అయన మాత్రం ఊర్లు తిరుగుతూ  పేద వారికీ సేవ చేస్తూ ఉండేవారుఒక దుర్దినానా ఆ బాబు గారు యక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని టేలిగ్రం వచ్చింది వాసంతమ్మా పరుగున వెళ్ళి అయన శవం తో ఈ ఉరోచ్చింది.

ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆమె కూడా గుండె పగిలి చనిపోయింది వారిద్దరిని మేమే అదిగో ఆ చెరువు దగ్గరే పాతి పెట్టాము కొన్ని రోజులకు ఆమె ఆత్మ కొందరికి కనిపించిది అని తెలిసింది.

ఆత్మ తో నేను

కానీ మాకు ఎప్పుడు కనిపించలేదు.ఆమెకు మొక్కలు అన్నపిల్లలకు పాట్టాలు చెప్పడం అన్నా చాలా ఇష్టంఅలాగే ఈ ఇల్లు అన్నా చాలా చాలా ఇష్టం అందుకే నీకు కనిపించినువ్వు కష్టపడడం చూడలేక వచ్చి సహాయం చేసిందేమో బాబు ఆమె దయ్యం కాదు దేవత నీకు కనిపించడం నీ అదృష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు.

తను అన్ని రోజులు ఒక ఆత్మతో సహవాసo అదే ఒక ఆత్మతో ఉన్నాను అనే నిజం తెలిసిన నేను వాసంతి మంచితనానికి మంచి హృదయానికి ఎవరికీ కీడు చెయ్యని మనసుకు చేతులెత్తి నమస్కరించాలి అని అనిపించింది. కానీ మా అమ్మ మాత్రం నన్ను ఆ ఊర్లో ఉండనివ్వకుండా వేరే ఊరికి బదిలీ చేసుకునేంత వరకు వదిలి పెట్ట లేదు మరి…..

Related Posts