ఆన్లైన్ క్లాసెస్

రేయ్ లేవరా టైం అయింది. నువ్వు లేచి, రెడీ అయితే అవతల ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా అన్నాను. అబ్బా అమ్మ ప్లీజ్ బాగా చలిగా ఉంది కాసేపు పడుకుంటాను సరేనా. అది కాదురా నేను ఇచ్చిన అసైన్మెంటు ఇంకా రాలేదు నిన్న మధ్యాహ్నం ఆడుతూనే కూర్చున్నాం. బిగ్ బాస్ చూస్తున్నా. ఆ తర్వాత నిద్ర, అది రాయనే లేదు. కనీసం ప్రొద్దున ఆయన లేచి రాస్తావు అనుకుంటే మళ్ళీ చలి అంటున్నావు. అయినా ఎలాగు బయటకు వెళ్లడం లేదు కదా ఇంట్లోనే కదా చలి ఎక్కడ ఉందిరా..  నువ్వు ఇలా చేస్తావనే, అన్నీ తెచ్చి రాత్రి ఇక్కడే పెట్టాను లేచి రాసుకో. కానీ, పూర్తి చెయ్ అంటున్న తల్లిని విసుగ్గా చూస్తూ అబ్బ అమ్మ క్లాసు 11 గంటలకు కదా ప్లీజ్ ఇప్పుడు నన్ను లేపకు ఇంకొక గంట ఆగి లేస్తా అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు చింటూ.

రేయ్ వద్దు రా బాబు ఇది మంచి పద్ధతి కాదు రా అంది తల్లి నువ్వు కూడా పడుకో చింటూ ఇప్పుడు కూడా అంతేనా ఏంటి ? లేచి ఏమైనా పని చేసేది ఉందా ఏంటి తినడం పడుకోవడమే కదా అంటూ తల్లి అనేసరికి ఇక మన లేక వారిని డిస్టర్బ్ చేయలేక తాను కూడా వేసింది దివ్య ఎనిమిది గంటలకు లేచి బ్రష్ చేసి టిఫిన్ సిద్ధం చేయసాగింది ఈ లోపు తమ్ముళ్లు లేచి నీళ్లు పట్టడం మొదలుపెట్టాడు. దివ్య దోసెలు వేస్తూ చట్నీ రెడీ చేస్తూ మరోవైపు బియ్యం కడిగి పెట్టింది ఇంతలోనే తాను టీ తాగలేదు గుర్తొచ్చి టీ పెట్టుకుని తాగి పచ్చడి చేసేసింది ఈ లోపు పిల్లలు అంతా లేవడంతో వారి బ్రష్లు అయ్యేసరికి పాలు టిఫిన్ రెడీ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత అన్నం అవగానే కూర రెడీ చేసింది తల్లి కూడా రావడంతో ఆవిడకు టీ పోసి ఇచ్చింది. ఇంతలో అమ్మ నా ఇయర్ ఫోన్స్ ఎక్కడ నా చార్జర్ ఎక్కడ అక్క అంటూ అరుస్తున్న అరుపులతో టిఫిన్ చేస్తూ ఇల్లంతా గోలగోలగా తయారయింది.ఇంతలోనే వంట అవడంతో దివ్య స్నానానికి బాత్రూం లో దూరింది ఆ తర్వాత వెంట వెంటనే నేను నేనంటూ 2 బాత్రూంలో స్నానాల కోసం గొడవ చేసి తన బాత్రూంలోకి దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్ చేయడం మొదలుపెట్టింది అప్పుడు సమయం పదకొండున్నర .  పదకొండున్నరకు టిఫిన్ చేస్తే ఎప్పుడు లం చ్ చేయాలో అని అనుకుంటూ నిట్టూర్చి ఉన్నదేదో నోట్లో కుక్కుకొని తలుపులన్నీ వేసేసి శబ్దాలు ఏవి రాకుండా చేసేసింది డోర్ మూసుకున్నారు ఎవరికివారు ఓ వైపు ఆన్లైన్ క్లాసులు ఇంకోవైపు తమ్ముని ఆన్లైన్ మీటింగ్ క్లాసులు జరుగుతున్నాయి. దాంతో అప్పటివరకు హడావుడిగా సందడిగా ఉన్న ఇల్లు నిశ్శబ్దం గా మారింది

చింటూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లెసన్స్ వింటున్నాడు దివ్య ఏదో రాసి పిల్లలకు క్లాసులు చెప్తుంది ఇంకొక గదిలో తమ్ముడు మీటింగ్ లో ఉన్నాడు దాదాపు మూడు గంటల వరకు చాలా బిజీ అయ్యారు ఆ తర్వాత మూడు గంటలకు బ్రేక్ అవ్వగానే అంత హాల్ లోకి వచ్చి భోజనం చేశారు ఎవరో తరుముతున్నట్లు  తినేసి తల్లిని తినమంటే తనకి ఆకలి లేదని అన్నది టిఫిన్ చేశారు కాబట్టి ఎవరు సరిగా తినలేదు అన్నం కూరలు అలాగే మిగిలాయి . రాత్రికి కూడా అలాగే తినమంటే మొహాలు అదోలా పెట్టి ఏదో తిన్నామంటే తిన్నాము అన్నట్టుగా తిని లేచారు ఎవరికీ కడుపు నిండలేదు టీవీల ముందు కూర్చున్నారు బిగ్ బాస్  చూస్తూ ఇదంతా చూస్తున్న దివ్య చిరాకు వచ్చేసింది. రేపటి నుండి బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ అందర్నీ చూస్తూ అందరికీ ఒక మాట చెప్తాను వింటారా అని సీరియస్ గా ఇది అయిపోనివ్వు  అమ్మ అన్నాడు చింటూ. వెంటనే వాడి చెంపపై ఒక్కటిచ్చింది అది ఎలా ఉందంటే దెబ్బకు టీవీ ఆఫ్ చేశారు అందరు .వాడు ఏడుపు  ఒకటే తక్కువ ఇదే చాన్స్ అంటూ దివ్య నువ్వు ఆడతావా  క్లాస్ వర్క్ చేసుకో రా అంటే నా మాటల్ని పెడచెవిన పెడతావా లేపితే లేపకుండా ఉంటావా నువ్వు లేస్తే నిన్ను చూసి మేము లేస్తాం కదా తొందరగా లేస్తే కాసేపు ఎక్సర్సైజులు చేయాలనుకుంటే వినవు ఏమైనా అంటే చలి అంటావు  ఇన్నాళ్లు సరి ఉందిగా అప్పుడు స్కూల్ కి వెళ్ళలేదా ఇంకోసారి లేపగానే లేవకపోతే ఇక నేను నీకు రోజు బడితె పూజచేయాల్సి వస్తుంది, అందరం తొందరగా లేస్తే తొందరగా టిఫిన్లు చేయొచ్చు అది అరిగిపోతుంది.

సమయానికి భోజనం చేయొచ్చు  చూడండి మీ వల్ల అమ్మకు తినడం లేటు అయిపోతుంది టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేయాల్సి వస్తుంది దాంతో సరిగ్గా తినలేక పోతున్నా ము ఆన్లైన్ క్లాసులు వల్లనే కాదు తొమ్మిది నెలల నుండి మీకు అలవాటయింది లేటుగా లేవడం తినడం పడుకోవడం ఇన్ని రోజులు ఓపిక గా చూశాను ఇకమీదట ఓపిక పట్టను ఎవరు లేవకపోయినా వారిపై చన్నీళ్ళు పోస్తాను చెప్తున్న ఇదే ఆఖరి ఛాన్స్ మీకు ఇకనుండి అంటే రేపటి నుండి అందరం తొందరగా లేవాలి తొందరగా పడుకోవాలి పనులు పూర్తి అవుతాయి మీవల్ల నాకు కూడా లేటుగా అలవాటయింది ఆహారం సరిగ్గా అరగడం లేదు దాంతో మందగించింది మీరు కూడా అలాగే తిన్నారు ఈ ఒక్క రోజే కాదు ఈ లాక్ డౌన్    పుణ్యమా  అని   అందరికీ అరుగుదల తగ్గింది దాంతో సరిగ్గా తినకపోతే ఇక మనకు ఇమ్యూనిటీ ఎక్కడి నుండి వస్తుంది. శరీరానికి ఎలాగో శ్రమ ఇవ్వడంలేదు నడక లేదు కాబట్టి అదేదో పొద్దుటే లేచి ఇంట్లోనైనా నడిస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది పెరిగే పిల్లలు నీకు నడక చాలా అవసరం అని లేపుతుంటే అసలు మాట వినడం లేదు అమ్మమ్మ మాట వినకుండా తయారయ్యావు ముద్దు చేస్తుంటే ఓ మరి చూడు చింటూ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ చెప్పింది విను లేస్తావా  లేదా వింటావా వినవా తల్లి కోపం చూసి చింటూ మమ్మీ మమ్మీ అన్నాడు ఏడుపు గొంతుతో నువ్వు చెప్పింది నిజమే అక్క అన్న తిండి చాలా తగ్గిపోయింది పని లేక పోవడం వల్ల బద్ధకం గా తయారయింది

ఇక నుంచి పొద్దున్నే లేచి కాస్తయినా నడుద్దాం ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేద్దాం దాంతో బాడీ తేలిక అవుతుంది ఆకలి కూడా వేస్తుంది జీర్ణక్రియ కూడా బాగవుతుంది పాపం నీకు ఇబ్బందిగా ఉంది కదా మమ్మల్ని క్షమించండి ఇక ముందు నువ్వు చెప్పినట్లే వింటాను అంటున్న తమ్ముని అపనమ్మకంగా చూస్తూ ఇది ఎన్ని రోజులు అంది వెక్కిరింతగా లేదక్కా నిజంగానే చెప్తున్నా ఇదే లాస్ట్ ఇక మేము మారతాం లే పొద్దున్నే లేస్తాం అంటూ లైట్ ఆర్పి వెళ్ళిపోయాడు తమ్ముడు అంతా పడుకున్నారు అన్నట్లుగానే చేస్తారో  లేదో అని ఆలోచిస్తున్న దివ్య ఆరు గంటలకు అలారం వచ్చి బయటికి వచ్చి చూసేసరికి బయట హాల్లో తమ్ముడు కొడుకు వాకింగ్ చేస్తూ కనిపించారు అయితే వీళ్లు మారారు అన్నమాట చింటూ గాడి దెబ్బ పని చేసింది అని నవ్వుకుంటూ తాను తన పనిలో పడడానికి లోనికి వెళ్ళింది దివ్య…. మెల్లగా చెబితే ఎవరు వినరు దెబ్బ పడితేనే వింటారని ఇంకో సారి రుజువైంది….

Related Posts