ఆప్తుడు

అప్పుడు నేను నా భర్త మిగిల్చి పోయిన  నా బాబు ను చూసుకుంటూ తల్లిదండ్రుల ఇంటికి చేరి ఆ దుఖం మర్చిపోక ముందే ఒక రోజు హటాత్తుగా మా నాన్నగారు నిద్రలోనే గుండెపోటు తో చనిపోయారు అసలే బాధలో ఉన్న మాకు అండగా ఉంటాడు అనుకున్న తండ్రీ చనిపోవడం తో పాటుగా నా మీద ఇంకో నిండా కూడా పడింది అదేంటంటే నీ వల్లే నాన్న చనిపోయారు అని నా జీవితం గురించి అలోచించి నాన్న మనోవ్యధ తో చనిపోయారు అని అది ఒక రకంగా నిజమేనేమో కానీ దానికి నేను ఎంత వరకు కారణం నాకు తెలియదు.

నిజమే బిడ్డ తో పాటు తన కూతురు జీవితం ఏమవుతుందో అనే బాధ ఉంటుంది  కానీ దానికి మొత్తానికి నేనే కారణం అంటే మాత్రం ఎంత బాధ గా ఉంటుందో ఒక్క సారి మిరే ఆలోచించండి . ఇక నాన్నగారి ఖర్మలన్ని అయ్యాక మా ఖర్మకు మమల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా చుట్టాలు , ఆత్మీయులు అని అనుకున్న వాళ్ళు, అప్పటి వరకు ఎంతో ప్రేమ నటించిన వారి నిజ రూపాలు మాకు ఇన్నేళ్ళకు తెలిసాయి, కాదు మా నాన్నగారి చావు మాకు తెలిసేలా చేసింది.

కానీ మాకో  సమస్య ఎదురైంది అదేంటంటే నాన్నగారు పోయిన రోజు మంచిది కాదు కాబట్టి ఒక యాడాది ఇల్లు వదిలేయాలి అని దాంతో ఎక్కడికి వేళ్ళలో అర్ధం కానీ పరిస్థితి సడెన్గా ఇల్లు మార్చాలి అంటే కష్టం కాబట్టి అయినా తప్పదు కాబట్టి మేము పక్కనే ఉన్న చిన్న టౌన్ లాంటి ఊరికి వలస వెళ్ళాము.  అన్ని రోజులు నాన్న సంపాదిస్తూ ఉంటె మాకు తెలియలేదు కానీ ఒకటి అర్ధం అయ్యింది ఇంటి బాధ్యత తీసుకున్న మనిషి ఇంటి యజమాని చనిపోతే ఎంత కష్టం ఎదురవుతుందో అనేది మాకు బాగా అర్ధం అయ్యింది ఆ ఊర్లోనే..

ఇక ఆ ఉరేళ్ళాక  మరి బతకాలి అంటే ఏదొక పని చేసుకోవాలి కదా నాకు ఇద్దరు తమ్ముళ్ళు  మా పెద్దోడు  హైదరాబాదు వెళ్లి ఎదో జాబు ప్రయత్నాలు చేయడానికి వెళ్ళాడు , ఇక రెండో వాడు అయితే నాన్నగారి జాబుకోసం పెన్షన్ కోసం తిరుగుతూనే ప్రొద్దున పూట పేపర్ వేయడం మొదలు పెట్టాడు మరి మాకు కడుపు నిండాలి కదా నాలుగు ప్రాణాలు బతకాలి కానీ అవేవి సరిపోయేవి కావు ఎందుకంటే అందరం వయసులోనే ఉన్నాం పైగా పాలిచ్చే తల్లిని నేను దాంతో ఎందులో అయినా ఉద్యోగం వెతకాలి అని అనుకుని వెతకడం మొదలు పెట్టాను.

కొన్ని రోజులు అయ్యాక మా నాన్నగారి పేరు వల్ల నాకు ఒక ప్రైవేట్ బళ్ళో పంతులమ్మగా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అని కాస్త సంతోషించాం కానీ మా పెద్దోడికి ఉద్యోగం దొరకలేదు కాబట్టి వాడికి కూడా అన్ని పంపాలి ఇక్కడి నుండే కాబట్టి ఎక్కడి డబ్బు సరిపోవడం లేదు మాకు. ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంది. అందుకే అంటారు ఏమో దరిద్రునికి ఆకలి ఎక్కువ అని, నిజంగా ఎవరు చెప్పారో కానీ చావు ఇంట్లోనూ, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అయినా గతి లేనప్పుడు పుల్ గా ఆకలి వేస్తుంది కదా (మీకు అలా జరిగి ఉంటె కామెంట్ చేయండి ) .

ఇక ఆ ఆకలికి తట్టుకోలేక ఎవరైనా పిలిస్తే బాగుండు ఎవరైనా అన్నం పెడితే బాగుండు. ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేవాళ్ళం.కానీ ఎవరూ పిలిచేవాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఉన్నదేదో తిని గుట్టుగా బతికేవాళ్ళం.

అయినా పిల్లాడికి పాలు సరిపోక పోవడం తో రాత్రుళ్ళు బాగా ఏడ్చేవాడు, వాడికి నీళ్ళు తాగించే దాన్ని పాలులేక ఏం చేస్తాం అందుకే ఇప్పటికి  మాకు తిండి విలువ తెలుసు కాబట్టి ఎవరు పిల్చినా వెళ్లి తినేసి వస్తాం అన్నం మిగిలితే ప్రొద్దున్నే తినేస్తాం కారం వేసుకుని అయినా ..

ఇక మేము అద్దెకు ఉన్న ఇంట్లో అయిదు కుటుంబాల వాళ్ళు ఉంటున్నారు. మా గొడవ మాకే ఉంది కాబట్టి ఎక్కువ గా ఎవరితోనూ మాట్లాడేవాళ్ళం కాదు ఎక్కువ. పని అయ్యిందా అంటే అయ్యిందని అంతేతప్ప ఇంకేం మాట్లాడేవాళ్ళం  కాదు. ఇక తమ్ముడు జాబు కోసం అమ్మ పెన్షన్ కోసం తిరగడం మొదలుపెట్టారు. అసలే వానాకాలం ప్రొద్దున కొంచం తిని వెళ్తే తిరిగి సాయంత్రం వచ్చేవాళ్ళు. అప్పటి వరకు నేను బాబు నీ తీసుకుని స్కూల్ కి వెళ్ళేదాన్ని.

అమ్మ ఇంట్లో ఉంటె బాబు నీ వదిలి వెళ్తుండే దాన్ని తిరిగి మధ్యానం వచ్చి బాబు కి  పాలు పట్టి ,నేను తిని కాసేపు బాబు తో ఆడుకుని వెళ్ళేదాన్ని,కానీ అమ్మ వాళ్ళు వెళ్తున్న సమయం లో బాబుని ఎక్కడ వదిలి వెళ్ళాలో తెలియక నాతో పాటే తీసుకుని వెళ్ళేదాన్ని అయితే ఒక రోజు ఏం జరిగింది అంటే…

అమ్మా, తమ్ముడు కాస్త అన్నం తినేసి వెళ్ళారు పని కోసం మేము ఉన్న ఊరి నుండి ఇంకో యాభై కిలోమీటర్లు ఉన్న జిల్లాలో పని ప్రొద్దున వెళ్లి సాయంత్రం రావచ్చు పని చూసుకుని అయితే అమ్మా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంట్లో పని చూసుకుని బాబుని తీసుకుని తాళం వేసి బడికి వెళ్లాను.

మధ్యానం బాబు బట్టలు తడపడం తో ఇంటికి వచ్చాను తొందరగానే పర్మిషన్ తీసుకుని, వచ్చి వాడికి బట్టలు మార్చి తిందాం అని చూస్తే అన్నం అయిపోయింది  ప్రొద్దున గ్లాసు బియ్యం ఉంటె పెట్టాను రాత్రి చేసుకున్న రాగి రొట్టె ఉంది ఆ రాగులు కూడా ఎప్పటివో ఉంటె పట్టించాం రెండు రూపాయలు పెట్టి సరే అని ఆ రొట్టె తిన్నాను.

కానీ రొట్టె ఏం సరిపోతుంది నాకు పాలు ఇవ్వడం వల్ల సరిపోవడం లేదు ఆహారం.అయినా చేసేది లేక  అమ్మా వాళ్ళు వచ్చేటప్పుడు సామాను, బియ్యం తెస్తామని అన్నారు రాత్రికి అయినా కడుపు నిండా తినొచ్చు లే అనుకుని అదే ఇంత తొక్కు వేసుకుని తినేసి మళ్ళి బాబుని తీసుకుని వెళ్లాను స్కూల్ లో పడితే ఆ ధ్యాసలో ఆకలి నీ మర్చిపోవచ్చు అని కానీ కడుపు ఊరుకోదు కదా, నేను ఆకలి నీ దాచుకోవచ్చు ఏంటి ఎవరినైనా చేబదులు అడగవచ్చు కదా అంటారా అడగలేను అండి ఎందుకంటే ఆత్మాభిమానం అనేది నన్ను నోరు విప్పనివ్వలేదు.

ఆకలి కి ఆత్మాభిమానం ఏంటి అని అనకండి ఎవరి దగ్గర చేయి చాచి అడగలేదు అప్పటివరకు ఒక వేళ అడిగినా అది ఎలా తీర్చాలి. జీతం తో ఇంటి అద్దె, కరెంటు బిల్లు పొగా ఉన్నదాంట్లో తినడం మరి కొత్త అప్పును ఎలా తిరుస్తాం కాబట్టి అడగలేదు ఎవర్ని.

అమ్మావాళ్ళు సాయంత్రం అవుతున్నా రాలేదు మరి ఒక వైపు వర్షం మొదలు అయ్యింది ఇక టైం చూస్తే ఆరు అవుతుంది. మరి ఇంట్లో చుస్తే సామాను లేదు ఎలా అని అనుకుంటూ పర్సు లో ఉన్న రూపాయి తీసుకుని కాయిన్ బాక్స్ వద్దకు ఆ వాన లోనే వెళ్లి బాబుని ఇంట్లో పెట్టి లాక్ వేసి, ఎదురుగా ఉన్న షాప్ లోకి వెళ్లి ఫోన్ చేసాను తమ్ముడికి.

వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే అమ్మ వాళ్ళ తరపున ఎవరో కనిపించి పని చేయిస్తాము రెండురోజులు ఉండండి అన్నారు అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరే అన్నారు అని తమ్ముడు చెప్పడం తో పోనిలే కనీసం పని కోసం అయినా ఉండి వాళ్ళు కడుపు నిండా తింటారు అనుకున్నా అలాగే పని అయిపోయి డబ్బు వస్తే అయినా మా కష్టాలు తీరతాయి అని అనుకుని సరే అన్నాను.

ఇక వాళ్ళు రారు అని అనుకునే సరికి ఎక్కడి లేని నిసత్తువ ఆవరించింది.అలాగే కాస్త తడిచినా ఇంట్లోకి వచ్చాను బాబు ఏడుస్తున్నాడు వాడిని దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చి పడుకోబెట్టాను. ఇక తిందాం అనుకుని చూస్తే ఏమి లేవు గిన్నీల్లో ఒక రాగి రొట్టె ఉంటె దాన్ని తినేసి నీళ్ళు తాగి, లైట్ తీసేసి చాప వేసుకుని బాబుని వేసుకుని పడుకున్నాము ఇద్దరంమరి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కష్టం కాబట్టి. కానీ ఒక రాత్రి వరకు నాకు కడుపునొప్పిఅలాగే బాబుకు విరోచనాలు పట్టుకున్నాయి రాగి రొట్టె పడక పోవడం వల్ల .

బాబు తెల్లార్లు ఏడవడమే ఇక ఇలా కాదని కొన్ని మెంతులు తినెసాను కడుపు నొప్పి కి ఇక పాపం వాడు కూడా కడుపు నొప్పితో అలాగే ఉన్నాడు ఎదో సిరఫ్ ఉంటె కొంచం పోసాను అప్పటికి పడుకున్నాడు. తెల్లారింది మాములుగానే కానీ సామాను ఏం లేకపోవడం వల్ల వంట ఏం చేయలేదు ఎలాగు కాసేపు అయితే అమ్మా వాళ్ళు వస్తారు అని తాళాలు వేసి వెళ్ళిపోయాను.

కానీ అమ్మా వాళ్ళు రాలేదు కానీ ఫోన్ వచ్చింది ఆంటీ వాళ్ళ షాప్ కు, ఆంటీ వాళ్ళ పాప తో పిలిపించింది వెళ్లి మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫైల్ మీద సంతకం అవ్వలేదు కాబట్టి అతను రాత్రి ఏడూ గంటలకు వస్తాడు అని అక్కడే ఉండి తెల్లారి ప్రొద్దున వస్తాం అని ఆ ఫోన్ సారాంశం సరే ఇక చేసేది కూడా లేదు ఏమి అనలేను ఇంట్లో ఏం లేవని తెల్సి వాళ్ళు కూడా ఏం అనలేదు కానీ ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు అన్నారు సరే అని ఫోన్ పెట్టేసాను .

ఇంటికి వచ్చేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అసలే లో బి.పి పైగా పాలు తాగే పిల్లాడు ప్రొద్దున నుండి నీళ్ళు తప్ప ఏం తినలేదు, ఇల్లంతా వెతికాను ఏమైనా ఉన్నాయేమో అని కానీ ఏమి లేవు అటుకులు,రవ్వ కూడా లేదు. ప్రొద్దున స్కూల్ లో ఎవరో ప్రసాదం అని ఇచ్చిన అరటి పండు పర్సులో ఉందని గుర్తొచ్చి అది తిని, బాబుకు కొన్ని నీళ్ళు పట్టి చెంబుడు నీళ్ళు తాగి పడుకున్నా..

కానీ ఆకలి నిద్రపోనివ్వలేదు.రెండుసార్లు బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి కడుపు ఖాళి అయ్యింది మరి నీళ్ళేగా ఉంది కడుపులో, బయట వర్షం జోరందుకుంది,కరెంటు పోయింది , ఉక్కగా ఉంది అంతా చీకటి కడుపులో ఆకలి నిద్ర రావడం లేదు ఆకలిగా ఉండడం వల్ల స్థిమితం లేదు అటూ ఇటూ పొర్లుతున్నా బాబు కూడా కదులుతున్నాడు దోమలు కుట్టడం తో,చెవుల్లో దూరి శబ్దం చేస్తున్నాయి. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు కానీ మరి ఇంతలా బాధ పడడం ఇదే మొదటిసారి జీవితం లో ఇక ఎప్పుడూ అన్నం పడేయ్యకూడదు అనే నిర్ణయాన్ని ఆ అర్దరాత్రి తీసుకున్నక్షణం ఆకలి తో కడుపులో పేగులు చుట్టుకుపోతున్నాయి ఎన్ని నీళ్ళు తాగను. ఎంత సేపని ఓర్చుకొను పైగా బాబు పాల కోసం నోటిని తెరిచి నన్ను వెతుక్కుంటున్నాడు భగవాన్ వాడికి అందకుండా దూరం జరుగుతున్నా ఇలా ఏ తల్లి చేయదేమో, కన్న తండ్రిలేక ,కట్టుకున్న వాడు లేక ఆదరించే వారు ఉన్నా వారి ఆర్ధిక స్థితి బాగాలేక పోతే ఇదిగో ఇలాంటి స్థితిలోనే ఉండాల్సివస్తుంది.

పాపం అమ్మా తమ్ముడు మాత్రం ఏం చేస్తారు అప్పటికే అందిన చోటల్లా అప్పులు చేసి పోయాడు నాన్న అవి తీర్చడానికి అమ్మ తన దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి నాన్న ఖర్మ చేయించింది. ఇప్పుడు అదులో దాచిన కాస్త డబ్బుతోనే వాళ్ళు బస్ కిరాయిలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు కనీసం టీ కూడా తాగకుండా ఎలా వెళ్ళిన వాళ్ళు అలాగే వస్తున్నారు ఎదో బతకాలి కాబట్టి తింటున్నాం అంతే తప్ప ఎవరికీ ఏ తృప్తీ లేకుండా పోయింది. జీతం డబ్బులు, పేపర్ వేసిన డబ్బులు అన్ని కిరాయికి ,కరెంటు కు ,కాస్త కడుపు నింపుకోవడానికి సరిపోతున్నాయి.

ఇక కడుపులో పేగులు కదులుతున్నాయి ప్రొద్దున నుండి ఏమిలేదు. భగవాన్ ఏంటి నా స్థితి ఆకలికి నేను చచ్చిపోతానా ఏమో నా కొడుక్కి లేకుండా పోతానా అమ్మ వాళ్ళు వచ్చేవరకి అయినా బ్రతుకుతానా లేదా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్న నాకు తలుపు చప్పుడు వినిపించలేదు కానీ

ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసాను అమ్ములు అమ్ములు అని ఎవరో పిలుస్తున్నారు ఎవరై ఉంటారు అటూ నిద్ర, ఇటూ మెలుకువ కానీ స్థితి ఎవరో ఇంత రాత్రి ఎవరు పిలుస్తారు అది నన్ను అసలు ఈ ఇంటికి వచ్చినది మొదలు ఎవరూ రాలేదు చుట్టాలు, మరి ఎవరై ఉంటారు ఇంటి వాళ్ళు పిలవరు ఏదైనా ఉంటె ప్రొద్దున మాట్లాడతారు.

మరి అమ్మా వాళ్ళు రామని చెప్పారు మరి ఎవరూ ..ఇలా ఆలోచిస్తూనే ఉన్నా కానీ తలుపు తియ్యలేదు ,మళ్ళి అమ్ములు అనే పిలుపు అది నాముద్దు పేరు ఎవరూ ఎవరికీ తెలుసు ఆ పేరు పోనీ దొంగలా, లేదా వేరేనా ఎవరైనా ఒంటరిగా ఉన్నదీ గమనించి పిలుస్తున్నారా అని అనుకుంటున్నా నాకు అమ్ములు నేనే తలుపు తియ్యి అంటూ కొద్దిగా తెరిచిన కిటికీ లోనుండి నల్లని మొహం తెల్లని పళ్ళ తో కనిపించింది ఒక ఆకారం.

ఎవరు అంటూ లేచి కాస్త కిటికీ దగ్గరికి వెళ్లాను నేనేరా సత్యాన్ని భయపడకు తలుపు తెరువు అన్నాడు. సత్యమా అంటే మా నాన్నగారి తో పాటు మా ఇంటికి వచ్చేవాడు అని గుర్తొచ్చి ,సరే అంటూ తెరిచాను తలుపులు తూలుతూ వెళ్లి  తలుపులు తీసి అక్కడే కూలబడిపోయాను లో.బి.పి.వల్ల అతను లోపలి కి వచ్చి చూసి అమ్ములు అమ్ములు అంటూ పిలుస్తూ నన్ను చాపలోకి నడిపించుకుని వెళ్లి కూర్చోబెట్టాడు.నేను శక్తిలేక అలా పడుకుండిపోయాను.

బయటకు వెళ్లి రెండు పెద్ద పెద్ద సంచులు లోపలి కి తీసుకుని వచ్చాడు. అవి ఒక పక్కగా పెట్టి ఒక పొట్లం తీసి నా ముందు పెట్టి  బిందేలోంచి నీళ్ళు ముంచాడు. ఆ తర్వాత  పొట్లం లోంచి మిర్చిలు తుంచి నా నోట్లో పెట్టసాగాడు. ఆ వాసనకు కడుపులో పెగులన్ని ఒక్క సారిగా విజ్రుభిoచి ఆకలి పెరిగింది చటుక్కున కళ్ళు తెరిచి వాటిని చూసి ఇక ఆగలేక గబగబా నోట్లో కుక్కుకుని నీళ్ళు తాగడం మొదలు పెట్టాను.

సత్యం లేచి వెళ్లి సంచిలోంచి పాల పౌడెర్ తీసి నీళ్ళు పెట్టి  పాలు కలిపి తెచ్చేసరికి బాబు కూడా లేచాడు వాడికి స్పూన్ తో కొద్ది కొద్దిగా పట్టాడు సత్యం నేను మిర్చిలన్ని తినేసాను తనకి మిగల్చకుండా, అది అయ్యాక పాలు గ్లాసులో పోసి ఇచ్చాడు.

అవి తాగిన నేను అప్పుడు వాస్తవం లోకి వచ్చి చుట్టూ చూస్తూ అంతకు ముందు పడిన ఆవేదన, ఆలోచన అన్ని అర్ధం అయ్యి సత్యా అంటూ తన ఒళ్లో తల పెట్టి ఏడుస్తూ మొత్తం జరిగింది చెప్పాను ఎక్కిళ్ల మధ్య, నాకు తెలియలేదురా నేను ట్రైనింగు లో ఉండడం వల్ల రాలేక పోయాను. ఇక ఇప్పుడు వచ్చాను కదా ఏ భయంలేదు. ఇక నువ్వు ఎప్పటికి ఆకలికి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు సత్యం .

ఎంతమంది చుట్టాలు ఉంటె ఏం లాభం, ఎంత మంది స్నేహితులు ఉంటె ఏం లాభం ఒక్క ఆత్మీయుడు లేకపోయాక కదా ఇలాంటి స్థితిలోనే ఎవరు మనవారు ? ఎవరు పరాయి వారో తెలిసేది అర్ధం అయ్యేది..

ఇంతకీ సత్యం ఎవరూ అంటే మా నాన్న గారి దగ్గర చదువుకున్న శిష్యుడు పొలిసు ట్రైనింగు లో ఉండడం వల్ల నాన్న చావుకు రాలేక పోయాడు. ఇదంతా తెలిసి వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చాడు చాలా బాధపడ్డాడు ముందే వచ్చి ఉంటె మాకింత శ్రమ ఉండేది కాదు. నాన్న ఒకసారి తన ఫీజు కట్టాడు అనే కృతజ్ఞత వల్ల ఎప్పుడూ మా క్షేమాన్ని కోరుకునే ఒక ఆప్తుడిగా, మిగిలిపోయాడు.

ఇలాంటి వ్యక్తులు మన జీవితం లో ఎప్పుడో ఒకసారి ఉంటారు వారిని జీవితం లో వదులుకోకండి అయితే అనుకోకుండా సత్యం మాకు దూరం అయ్యాడు అంటే తనకు ఒక కుటుంబం ఉంటుంది కదా ఆ బాధ్యతల్లో కాస్త మర్చిపోయాడు మళ్ళి గుర్తు వస్తే తప్పకుండా వస్తాడు. ఈ సంఘటనను ఇలా గుర్తు చేసుకుంటూ నా ఆకలి తీర్చిన అతనికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ..

thank you sathya        …

Related Posts