ఆమె గురుతులు

కొత్త ఇంటికి వెళ్తున్నామని నా కోడలు ఇల్లంతా సర్ది,అవసరమైన కాగితాలు,పుస్తకాలు తీసి పెడుతున్నాప్పుడు ,నా గదిలోని పాత పుస్తకాలలో ఒక చిన్న డైరీ దొరికింది అని నాకు తెచ్చి ఇచ్చింది.

డైరీ దొరికిందని నా కోడలు తెచ్చి ఇచ్చేసరికి నేను దాన్ని చూసి చాలా సంబరపడ్డాను ఎందుకంటే ఎక్కడో పోయింది అని అనుకుని దానికోసం ఎన్నో రోజులు వెతికి,వెతికి చివరికి దొరకక పోయేసరికి  నా మనస్సు ఎంతో బాధ పడింది.

అది అంత ముఖ్యమైనది కాకున్నా దాన్ని చూసినప్పుడల్లా నాకు ఎదో తెలియని నూతన ఉత్సాహం కలిగేది. డైరీలో  ఉన్న ఆమె జ్ఞాపకాలను తడుముతూ నేను గతం లోకి జారిపోయాను

అవి నేను టి,టి,సి   ట్రైనింగ్ కోసం ఒక ఊరిలో ఉంటున్న రోజులు,అప్పట్లో అక్కడ ఉంది చదువుకోవాలి అంటే ఒక చిన్న కాపురం పెట్టాల్సిన పరిస్థితి,మా జిల్లా నుండి వేరొక జిల్లాకు వెళ్లి చదువుకోడం అంటే చాలా కష్టం గా ఉండేది.

రవాణా సౌకర్యాలు సరిగ్గా ఉండవు,దాంతో మా వాళ్ళు సకాలం కట్టి ఇచ్చారు.ఒక వారం రోజుల ముందు వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని,దాని కోసం పడరాని పాట్లు ఎన్నో పడ్డాక దొరికింది.

దాంట్లో నా కాపురాన్ని పెట్టించిన మా వాళ్ళు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు నన్ను వదిలేసి, రోజు ఇల్లు సర్దుకోవడం,సామాను అంతా తీసి పెట్టడం తో సరిపోయింది..

ఇంటి నుండి తెచ్చుకున్న  అటుకుల తో రాత్రి భోజనం చేసి పడుకున్న,తెల్లారిన తర్వాత మళ్ళీ బయట అంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పక్క వారిని అడిగి తెలుసుకున్నా

ఇంటిగల ఆయన బాబు నీకు వాడుకోవడానికి,స్నానానికి నీళ్లు కావాలి అంటే ఇంట్లో ఉన్న బావిలో నుండి తోడుకొని వాడుకో,తాగడానికి మాత్రం బోరింగ్ నుండి నీకు కావాలిస్తే తెచ్చుకో,

బావి నీళ్లు నీకు తాగడానికి ఇబ్బంది గా ఉంటేనే అవి తెచ్చుకో  లేదంటే  బావి నీళ్లే  తీయ్యగా ఉంటాయి.  మరి నీ ఇష్టం అని  చెప్పాడు.

సరే లెమ్మని  నేను    బావి నీళ్లను అన్నిటికీ  వాడేసాను. చివరికి అవే నీటిని గుడ్డ తో వడగట్టుకుని తాగేసా, అయితే తెల్లారే సరికి  గొంతు మొత్తం పట్టుకుంది.

అయితే అంతకు ముందు ఉన్న నీళ్లు కాలేజీ దగ్గర ఉన్న పంపు లో పట్టుకున్నవి కాబట్టి నాకు అలవాటు అయ్యాయి కాబట్టి  ఏమి అనిపించలేదు.ఇవి బావి నీళ్లు కావడం ,నాకు పడక పోవడంతో గొంతు పెట్టేసి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది.

మా ఇంటి యజమాని నా అవస్థలు గమనించి తనకు తోచిన కషాయం ఎదో ఇచ్చారు దాంతో గొంతు నొప్పి తగ్గింది కానీ,మళ్ళీ బావి నీరు తాగాలి అంటే భయం వేసింది. 

నేను ఇంటి యజమాని గారిని అడిగాను అయ్యా ఇక్కడ బోరింగ్ ఎక్కడ ఉంది అని ,అప్పుడే కొత్తగా వేశారు,అవి మాకు కాలేజీలో అలవాటు అయ్యాయి.

అది ఇక్కడికి వచ్చిన తర్వాతే అనుకోండి ,మా ఊర్లో అయితే ఏవి పడితే అవి తాగేవాళ్ళం, చదువులో పడి కొంచం సున్నితంగా తయారయ్యాం అది వేరే సంగతి అనుకోండి.

దానికి ఆయన బాబు ఇలా ఎదురుగా వెళ్తే అమ్మగారి బంగ్లా దగ్గర కొత్తగా ఒక పంపు వేశారు అక్కడ నుండి నువ్వు తెచ్చుకోవడం మంచిది అని అన్నారు.

అమ్మగారి బంగ్లా నా పేరే చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు.అదే మాటని అడిగాను నేను మా ఇంటి యజమాని ని ,అయన నాకు వివరించి చెప్తూ ,అందులో ఇంతకూ ముందు జమిందార్లు ఉండ వాళ్ళు .

వాళ్ళు చనిపోయాక వారి వారసులు ఇప్పుడు ఉంటున్నారు. బంగ్లా లో జమిందారి గారి భార్య గారు ఉండేవారు.మేము బంగ్లాను అమ్మగారి బంగ్లా అని పిలిచే వారిమీ,అదే వాడుకగా అయ్యింది .

బంగ్లాలో అన్ని వింతలూ విడ్డురాలే ఉన్నాయి,కానీ మేము ఒక్కసారి కూడా బంగ్లని చూడలేకపోయము లోపలి వెళ్ళి అని అన్నాడు ,దాంట్లో ఇప్పుడు ఎవరూ లేరా అని అడిగాను నేను కుతూహలంగా ,ఉన్నారు బాబు

జమిందారి వంశం లో మిగిలిన చిన్న దొరగారి భార్య చిన్నమ్మ గారు ఇప్పుడు అదే బంగ్లాలో ఉంటున్నారు,అయితే అటూ వైపు చూసే దైర్యం మాత్రం ఎవరూ చేయ్యారు ,ఇంత వరకు ఆమె ఎలా ఉంటుందో కూడా మేమెవరం చూడలేదు అని అన్నాడు అతను.

o బాగా వివరిoచి చెప్పాక నేను ఉరుకుంటానా అసలే కుర్రతనం,ఆపైన కాబోయే టిచర్లం కాబట్టి వెళ్ళి చూడాలి అనే కోరిక నాలో కలిగింది. తెల్లారి నేను నీళ్ళా కోసం వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిలే ఉన్నారు ,

దాంతో నేను దూరంగా ఉండగానే ఏంటి పంతులు నీళ్ళు కావాలా అని ఒకావిడ  అడిగి తన  బిందేలోని  నీటిని  నా బిందెలో పోసింది.అయినా నా చూపులన్నీ అమ్మగారి బంగ్లా మీదే ఉన్నాయి ,దాన్ని పరికించి చూసాను నేను.

దాని చుట్టూ రాతి కట్టడం,మధ్యలో ఇల్లు ,చుట్టూ చెట్లు ,అదొక తోట లా దాని మధ్యలో పర్ణశాల లాంటి ఇంటి లా నాకు అనిపించింది.

దాన్నే చూస్తున్న నేను నిళ్ళు పోసినావిడ మళ్ళి పలకరించడం తో లోకం లోకి వచ్చి ,బిందె తీసుకుని నా గదికి వెళ్ళి పోయా,వెనక నుండి వారి నవ్వులు నన్ను హేళన చేస్తునట్టు అనిపించి ,ఇక ముందు నీటి కోసం మధ్యానం వేళలో  రావాలని అనుకున్నా .

కానీ కొన్ని రోజుల వరకు అది కుదరనే లేదు.ఎప్పుడూ చూసినా నాకు బోరింగు దగ్గరకు కనిపించే గది తలుపులు ముసి ఉండేవి.దాంతో నేను చూడలేక పోయాను.

 అలాoటి ఒక రోజు మధ్యానం క్లాసు అయ్యాక ,ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడానికి,తాగడానికి ఒక రెండు బిoదెల నిళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది అని ,తలుపులు దగ్గరగా వేసి ,బిందెలు తీసుకుని వెళ్లాను.,

నేను ఒక్కన్నే కాబట్టి నాకు రెండు బిందెల నిళ్ళు చాలా ఎక్కువ,మిగతా స్నేహితులంతా హాస్టల్ లో ఉన్నారు,నేను వారి దగ్గరికి నేను వెళ్ళడమె కానీ నా గది కి ఎవరూ రారు ,

ఎందుకంటే గది లో ఏముంటుంది ,హాస్టల్ లో  అయితే అల్లరి ,పేకాట ఏదోటి కాలక్షేపం అవుతుంది కదా కాబట్టి నేనే అక్కడికి వెళ్ళే వాణ్ణి ,సరే బిందెలు తీసుకుని ఎండలో నీటి కోసం వెళ్లాను.

పట్ట పగలు,మిట్ట మధ్యానం పైగా నేనున్న బస్తి కామ్ గా ఉంటుంది ఎప్పుడు కాబట్టి చాలా గంభీరంగా ఉందా రోజు.నేను బోరింగు దగ్గరికి వెళ్ళి హయిగా అక్కడ ఉన్న చెట్లని ,ఎవరూ లేని ప్రశాంత సమయాన్ని ఎంజాయ్ చేస్తూ,బోరింగు కొడుతున్న శబ్దం తప్ప ,అక్కడ ఏమి కనిపించడం లేదు

అయితే శబ్దం కూడా అందరికి డిస్టర్బ్ అవుతుందేమో అని బోరింగు కొట్టడానికి కూడా నాకు భయం వేసింది.నేను అంత వరకు అమ్మగారి బంగ్లా చాలా దూరం లో ఉందేమో అని అనుకున్నా కానీ ,అది బోరింగు దగ్గరికే ఉంది.అంటే బోరింగు ని అనుకోని కాకుండా కాస్త దూరం లో ,నేను అంతకు ముందు ఎప్పుడు వచ్చినా ఎవరో ఒకరు నిళ్ళు నింపి ఇవ్వడం తో నేను గమనించలేదు.

నేను ఎవరూ రారులే అని పరధ్యానంగా బోరింగు కొడుతూ,పాత పాట ఎదో పాడుకుంటున్న గొణుగుతూ అంతలో ఏమండి అనే మృదు మధరమైన పిలుపు వినిపించింది.

నేను పాట ఆపేసి,చుట్టూ చూసాను కానీ నాకు ఎవరూ కనబడలేదు,నేను చుట్టూ చూడడం తో మళ్ళి ఇటూ ఇటూ అని వినబడింది.

నేను రాతి కట్టడం వైపు చూసాను,అక్కడ ఒక ఇరవై ,ముప్పయి దాటని ఒక అతివ ముసుగులో ఉంది ,నేను మళ్ళి చూడడం తో ఆమె మళ్ళి దాసి లు అంతా సంతకు వెళ్ళారు.

ఇంట్లో ఎవరూ లేరు,నాకు నీళ్ళ అవసరం గా ఉంది,ఒక్క బిందెడు పోస్తారా అని ఎంతో మృదువుగా అడిగింది.

ఊరి వాళ్ళు ఎప్పుడు చూడని చిన్నమ్మగారు నన్ను పిలిచి,నన్ను నీళ్ళు అడిగారనే ఉత్సాహంతో నేను వెంటనే అలాగేనండి అని ఆమె బిందనే తీసుకోబోయాను.,

వద్దు మీ బిందెని ఇక్కడ ఉంచండి నేను తీసుకుంటా అని అంది,దాంతో నేను బిందేని పెట్టడం ,ఆమె నిళ్ళు పోసుకుని ఇచ్చేయడం జరిగింది.అవి తీసుకుని వెళ్ళ బోతూ చాలా మంచివారు మీరు కొత్తగా వచ్చారా అని అడిగింది.

 నేను అవును అని సమాధానం చెప్పి ఆమెని అలా చూస్తుండి పోయాను.అబ్బా ఏమి అందం ,ఏమి అందం నేను నా జీవితం లో అంత అందగత్తెని ఎప్పుడూ చూడలేదు,ఏప్పటికి చూడను కూడా కావచ్చు.

అంతటి అందగాటే ,అప్సరసలు అంటారు కదా అలా ఉంది,నేను మామూలు అమ్మాయిలని చాలా మందిని చూసాను కాలేజిలో ,బస్ లో ,రైల్లో కానీ ఇలాంటి అమ్మాయిని మాత్రం చూడలేదు.

పెద్ద పెద్ద కళ్ళు,తెల్లని శరీర ఛాయ,బారెడు జడ ,ఎత్తుకి తగ్గ లావుతో, కొలతలు తగ్గకుండ,బ్రహ్మదేవుడు తీరికగా కుర్చుని మలిచినట్టుగా ఉందా అందాల బొమ్మ,నేను ఆమెని అలా చూస్తూ ఉండగానే ఆమె నన్ను చూసి నవ్వుతూ వెళ్లిపోయింది బిందేని తీసుకుని.

అలా ఎంత సేపు అయ్యిందో ఆవు వచ్చి నా బిందె ని బోర్లిoచేసరికి నేను ఇలా లోకి వచ్చి,తిరిగి నా బిందెలు తీసుకుని నింపుకుని వెళ్ళి పోయాను.ఇక రాత్రి నాకు నిద్ర పట్టలేదు.

,ఎన్నో రోజుల తర్వాత నాకు నిద్ర పట్టలేదు అని చెప్పొచ్చు,అయితే తర్వాత నేను ఆమె మళ్ళి ఎప్పుడు కనిపిస్తుందా అని చూస్తూ,నేను చిత్ర కారున్ని కాకపోయినా ఆమె బొమ్మని గీయాలని ఏంతో ప్రయత్నం చేసాను.

కానీ నాకు రాలేదు కానీ నాలో ఉన్న కవి హృదయాన్ని నేను ఆమెలో అందాలను చూసి, ఆమె అందం పై కొన్ని కవితలు రాసాను ,అదే చిన్న డైరి లో  ఆమె గురుతులుగా పొందు పర్చుకున్నాను.

ఇక నా ట్రైనింగు పూర్తి అయిపోఇతుంది అనే సమయం లో ఒక రోజు సమయం రాత్రి ఏడూ గంటలు అవుతుంది అనుకుంటా

సమయంలో నీళ్ళు అవసరం అయ్యి ,మళ్ళి నేను వెళ్లేసరికి ఆమె నన్ను చూసి దగ్గరికి వచ్చింది.మీరు వెళ్ళిపోతున్నారట కదా అని అడిగింది.ఔరా ఇలాంటి విషయాలు ఎంతలో తెలుస్తాయో అనుకున్నా

కానీ ఆమె పై నాకున్నది అది ప్రేమ ఆకర్షణ కాదు ఆమె అందానికి ముగ్ధుడైన మొదటి వ్యక్తిని నేనే కావచ్చు,అలా కవితలు రాయడం కూడా మొదటి సారి అవ్వడం తో ఒక అపురూపమైన వ్యక్తి నాతో మాట్లాడింది అనే గొప్ప తప్ప ఇంకేమి లేదని నా మనసుకు అనిపించింది.

నేను అవును అని సమాధానం ఇచ్చి మీ పేరు అని అడిగాను దైర్యం చేసి ,ఆమె నవ్వుతూ తెలుసుకుని ఎం చేస్తారు అని అంది గుర్తు పెట్టుకుంటా అని అన్నా ను.

సరే నా పేరు దేవయాని అని చెప్పి,మీకు మంచి భవిష్యత్తు ఉంది అని ,చేతి లోంచి ఒక వస్తువు ఎదో ఇచ్చేసి,గబగబా వెళ్ళిపోయింది. అదే ఆమెని చివరిగా చూడడం అదొక పాపిట బిళ్ళ దాన్ని ఇప్పటికి ఆమె గురుతులుగా నేను దాచుకున్నా. అది ఆవిడ ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు.

ఆమె అన్నట్టుగానే బాగానే ఉంది నా జీవితం,నా కూతురికి అదే పేరు పెట్టుకున్నా,ఇన్నేళ్ళకు ఆమె గురుతుగా మిగిలిపోయిన కవితల  డైరీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాను. 

ఇలాంటి అపురూపమైన మనుషులు మీ జీవితం లో ఉన్నారా ఉంటె నాతో ఆ అనుభూతులను  పంచుకోండి….

 

 

Related Posts