ఆమె నవ్వింది అంతే,చుట్టూ వేల కళ్ళు విమర్శకులు ఐపోయాయి,
తను ఎందుకు నవ్వుతుంది అనే ఆరాలు మొదలు.
ఆమె ఏం చేసిన ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఈ సమాజం,
నవ్వకపోతే “ఆమెకి పొగరు”
నవ్వితే “ఆమెకి మర్యాద తెలీదు”
మాట్లాడకపోతే “ఆమెకి తెలివి లేదు”
మాట్లాడితే “వాగుడు కాయ”
ఈ సమాజం చేత విధించ బడిన ఎన్నో నియమాలు,
తనకి తెలియకుండానే ఎదురుకుంటూ ఉంది.
ఎప్పుడు నవ్వాలి?
ఎంత వరకు నవ్వాలి,
ఎక్కడ నవ్వాలి అనే విషయంలో కూడా స్వేచ్ఛ లేదు తనకి.
తను ఎందుకు నీ నుండి అనుమతి తీసుకోవాలి?
ఎప్పుడైనా ఆమె నవ్వుతూ ఉంటే చూసావా?
ఆమె నవ్వు చూడడం అలవాటు చేసుకో,
జీవితం అందంగా మారుతుంది,
ఆమె జీవితం ఆమె చేతిలో ఉంటుంది.
ఇది నా సొంత కవిత్వం అని హామీ ఇస్తున్నాను.
-ఈగ చైతన్య కుమార్