ఆరాధన Worship 3

ఆరాధన

హలొ అందరికి నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే నా ప్రేమ కథ చెప్పాలి అని అనుకుంటున్నా, అదేంటో వినండి మరీ

నా పేరు సుధీర్, నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడు, అదే కాలేజీ లో డిగ్రీ చదువుతున్న ప్రతిభ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాను, అది ప్రేమ అనేకంటే ఆరాధన అని అనడం మంచిదేమో..

ఆమెని చూడగానే ఒక అపురూపమైన అందాన్ని, ఒక దేవతను చూస్తున్నట్టు గా చూసే వాడిని నేను, ఆమెని నేను పరిచయం చేసుకోవడం పెద్ద కష్టం కాలేదు నాకు, ఎందుకంటే ఆమె మా పక్క ఇంట్లోనే ఉండేది. అలా నేను ఆమె దగ్గరికి వెళ్లి, మీరు ఇదే కాలేజీనా, నేను ఇక్కడే జాయిన్ అయ్యాను, అని మాట కలిపేసి, పరిచయం చేసుకున్నాను.

Angel, Mourning, Love, Farewell

ఆమె కూడా నన్ను చూడగానే, నేను తనకు పరిచయం లేకున్నా, నవ్వుతూనే పలకరించింది. నాకు కాలేజీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తిప్పి చూపించింది. ఇక అప్పటి నుండి మేమిద్దరం కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, కలిసేవచ్చేవాళ్ళం

వాళ్ళింట్లోను, మా ఇంట్లోనూ ఎవరు ఏమి అనేవారు కాదు. ఎందుకంటే, ఆమె నాకంటే పెద్దది అని కావచ్చు, ఏమో కానీ మా పరిచయాన్ని ఎవరూ కాదు అనలేదు, ఎవరు వేలెత్తి చూపంచలేదు. కానీ ఆమె మాత్రం నాతో ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడేది.

నేను తనని పేరుతో పిలిచే వాడిని, ఆమె కూడా నన్ను పేరుతో పిలిచేది. మా ఇద్దరికి మా ఇంట్లో వాళ్ళు సైకిల్ కొనిచ్చారు. వాటి మీద మేము కాలేజీకి వెళ్లి వచ్చేవాళ్ళం

ఆమె నేను చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం, అందులో మా ఇంటి విషయాలు, మా వాళ్ళు ఎప్పుడు ఏమి మాట్లాడేది, ఇవే కాకుండా ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం, నా చదువులో ఉండే సమస్యలు, వాటి పరిహారాలు అన్నింటినీ చర్చించుకుని వాళ్ళం, కాలేజీలో కూడా ఎవరు ఎలాంటీ వాళ్ళు, ఎవరు ఎవరితో మాట్లాడుతూన్నారు, ఎవరు ఎవరితో ప్రేమలో ఉన్నారు అనే మాటలు మాట్లాడుకునే వాళ్ళం..

ఇవ్వన్నీ ఒక పక్క, అంటే నాణానికి ఒక పక్కన అయితే  ఇంకో పక్కన ప్రతిభ ఏం చేసినా, అంటే తాను మాట్లాడినా, నవ్వినా, కాలుకదిపినా, రాసినా, పని చేసినా నేను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని, ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా చాలా ఇష్టం, ఆమెని ఒక దేవతలా చూసే వాడిని, నా యవ్వనంలో పరిచయం అయినా నా మొట్ట మొదటి ప్రేమిక నా ప్రతిభ, ఆమె డ్రెస్ వేసుకున్నా అది డ్రెస్ కె అందం పెరిగేది కానీ ఆమెకి కాదు.

ఆరాధన

Boat Dock, Girl, Human, Child, Nature

ఆమె ముట్టుకున్న ప్రతి దాన్ని నేను అసూయతో చేసేవాడిని, ఎందుకంటే ఆమెని ముట్టుకునే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు కాబట్టీ, ఆమె రాసుకున్న నోట్స్ అన్ని నేను ఇప్పటికి నా బీరువాలో దాచుకున్నా పదిలంగా, వాటిలో చదువుకున్న రాతలు ఉన్నా, అవి నాకు ఆణిముత్యలే, నిజం చెప్పాలి అంటే ఆమె రాత కూడా అమె లాగే అందంగా ఉంటుంది.

ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే ఆమె బారెడు జడ ఒక ఎత్తు జడలో రోజూ ఒక గులాబీ తప్పకుండా ఉండేలా చూసేవాడిని, ఆమెకు నేను పరిచయం కాకమునుపు పెట్టుకుందో లేదో కానీ నేను పరిచయం అయ్యాక ఆమెకు రోజు ఒక గులాబీని ఇచ్చేవాడిని నేను, ఇచ్చే వాడిని అంటే ఆమె చేతికి కాదు. ఆమె సైకిల్ సీటు మీద పెట్టేవాడిని, ఆమె దాన్ని నవ్వుతూ తీసుకునేది..

అప్పుడప్పుడు అనేది కూడా ఏంటి కృష్ణా నాకు పువ్వు ఇవ్వకుండా ఉండలేవా, చూడు ఎలా కోసుకుందో అనేది నాకు ముళ్ళు గుచ్చుకోవడం చూసి, కానీ ఏనాడు నేను ఆమెని, ఆమె నన్ను ముట్టుకోలేదు. ఆమెకు పువ్వు ఇవ్వడానికి రోజు మా ఇంట్లో చెట్టుని బతిమాలే వాడిని, ఒక వేళా అది కాకుంటే పక్కింట్లో దొంగతనం చేసేవాడిని, మా అమ్మ, పక్కింటి వాళ్ళు పువ్వు ఎవరు తిస్తున్నారా అని తలలు బద్దలు కొట్టుకునే వాళ్ళు. కానీ నేను వారికి దొరకకుండా తీసుకుని వెళ్లే వాడిని..

ఆమె చదువు పూర్తి అయ్యింది. నేను డిగ్రీ రెండో  సంవత్సరంలో ఉన్నప్పుడు అనుకుంటా, ఆమె ఒకరోజు కాలేజీకి వచ్చి, స్నేహితులతో మాట్లాడదానికి వచ్చింది అనుకుంటా, నన్ను చూసి నవ్వింది. నేను పరుగెత్తుతూ వెళ్ళి ఏంటి ప్రతిభ గారు వారం రోజుల నుండి కనిపించడం లేదు అని అడిగా, దానికి ఆమె నవ్వి, కృష్ణా నాకు పెళ్లి కుదిరింది, మొన్ననే నిశ్చితార్థం కూడా అయ్యింది, అందుకే నీకు కనిపించ లేదు అని అంది అదే నవ్వు తో..

నాకు ఒక్క క్షణం ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క వారం రోజులు కనిపించలేదు అంటే ఊరెళ్ళింది అనుకున్నా, కానీ ఇప్పుడు అత్తారింటికి వెళ్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను, నీకు పెళ్లి ఇష్టమేనా అని అడిగా అతి కష్టం మీద, నచ్చకపోతే పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంటా కృష్ణా అంది నన్ను చూస్తూ, నేను పెద్దగా నిట్టూర్చాను అనుకున్నా, కానీ బయటకు ఏమి రాలేదు. కార్డు ఇచ్చింది. అందులో వాళ్ళిద్దరి  ఫోటోలు ఉన్నాయి అందంగా..

Children, Love, Friends, Hand, Flowers

ఆరాధన

పెళ్లి జరిగిపోయింది, కానీ నేను వెళ్ళలేదు ఎందుకో, అది ప్రేమ కాదు, ఆకర్షణ కాదు, అభిమానం కాదు మరేంటో, అయితే ప్రతిభ అత్తారింటికి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి, నన్ను చూస్తూ, ఇన్ని రోజులు నీతో ఎంతో స్నేహాంగా ఉన్నా, నువ్వు నాతో ఎప్పుడూ వేరేవిధంగా ప్రవర్తించలేదు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఎప్పటికి నా స్నేహితుడిలాగే అనుకుంటా, నువ్వు నాకెప్పుడూ ప్రత్యేకమైన వాడివిగా ఉంటావు. అని చెప్పి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది..

ఇప్పుడు నా వయస్సు ఎనభై సంవత్సరాలు, ఇప్పటికి ఆమె తల్లిదండ్రులు లేరు కానీ అన్నా వదినా దగ్గరికి వస్తే ఆమెని అలా చూస్తూ ఉండిపోతాను నేను, ఇప్పుడు ఆమె ఇంకో ప్రత్యేకమైన అందంతో నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెని చూడగానే నాలో తెలియని ఆనందం కలుగుతుంది. ఇన్నేళ్లకు నాకు అర్థమైన విషయం ఎమిటంటే  ఆమె అంటే నాకు ఆరాధన అని, అది నేను చచ్చేవరకు ఉంటుంది అని….

ఎంతైనా ప్రతిభ ప్రతిభే

ఇలాంటి ప్రతిభలు  మీకు మీ జీవితం లో ఉండే ఉంటారు కదా,

వారి గురించి, మీ అనుభవాల గురించి నాతో పంచుకోండి

Related Posts