"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ఆహారం తీసుకునేటప్పుడు ఒక పద్ధతి, ఒక నియమావళి, ఉండాలి ..ఆరోగ్యమేమహాభాగ్యం…

అంశం:ఆరోగ్యమేమహాభాగ్యం

మంచి అలవాట్లు
మామూలు గా జీవితం ఒక పద్ధతి లో నడుస్తుంది,కానీ మనిషికి ముఖ్యమైనది ఆరోగ్యం దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మనిషిదే.

తిండి తినేటప్పుడు మంచి ఆలోచనతో జ్ఞానంతో ఉండాలి. ఎందుకంటే నా ఆరోగ్యం నాది అనే ధైర్యంతో కొన్ని కాని పనులు చేయొచ్చు. ఎక్కడైనా అతి సర్వత్రా వర్జయేత్.

ఆహారం తీసుకునేటప్పుడు ఒక పద్ధతి, ఒక నియమావళి, ఉండాలి. కూరలు, ఆకుకూరలు, పప్పు, ఇటువంటి ముఖ్యమైనటు వంటి ఆహారంతో ఒక పూట చాలా సుష్టుగా భుజించి. రెండవ పూట తేలికైన ఆహారం తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.

దానికి తగ్గట్టు నీరు మనకు చాలా అవసరం .ఎందుకంటే మన శరీరం పంచ తత్వాలు కలిగినది. పూజకి నైవేద్యం పెట్టేటప్పుడు చెప్తాం కదా మంత్రం. ప్రాణాయ స్వాహా, అపాన యస్వహ, సమానాయ స్వాహా, ఉదానయ స్వహ , ఇవి మనలో ఉండే పంచప్రాణాలు. ఆరోగ్యాన్ని కాపాడుతాయి అవి బాగా పనిచేయడానికి యోగ, తిన్న ఆహారం అరిగేట్టుగా చూసుకుని, పద్ధతిగా తినడం, కంటికినిద్రకూడాకావలసినంత. ఇటువంటి సరైన క్రమ పద్ధతిలో, మనం నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అంతే.

 

ఈ రచన నాస్వీయ రచన అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
__కె.కె.తాయారు

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *