ఆలంబన!

ఆలంబన!

దీపాలు పెట్టే వేలాయె
నీవు రావైతివి ప్రియతమా
కాటుక కళ్ళు వేచి వేచి
కన్నీళ్ళ పర్యంతమయి
కురిసే వెన్నెలలు
జాలిగా చెట్ల క్రీనీడల్లో
ఆడుకునే పిల్లలు
అటుతరువాత
తత్వాలు పాడే బైరాగి
తీతువు పాడే పాటలు
నా గుండెల్లో రైల్లు పరుగెడుతూ
ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ
సుఖధుఖాల్లో మనం ఒకటిగా
మన కాపురాన్ని పూల తోటలా
చిన్న ఇల్లయినా చింతలెరుగక
నా మనసంతా పందిరి వేసి
వాకిలిలో ఏకాంతంగా
నీ రాక కోసం కనులు కాయలు కాయగా
నీవేల ఇంత రాత్రి దాకా రావేల!?
క్షణాలన్నీ యుగాలుగా తరగిపోక
మనసు ఏదో కీడు శంకిస్తూ
ఇలాగే ఇలాగే వేచి వేచి నిద్రలోకి జారుకున్నా
తెల తెలవారుతుండగా
నా భుజం పట్టి పైకి లేపి
ఉన్నాను నీ కోసం వచ్చా
ఏదీ నీ కమ్మటి కాఫీ!?
రేయంతా నడచి నడచి వచ్చా నీ పరిశ్వంగన కోసం
మన బంధం చాలా బలమయినది సుమీ!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *