మనస్సు నిగూఢ అంతర్ముఖంలో
మనస్సు పొరలు విరిగి కూలిపడుతూ,,,,,
కుదేలయిన మనస్సు చేసే ఆలోచనలు
అక్షరాల కందని భాష్యాలు ఉల్లిరేకుల్లా ఎగిసిపోతూ
ఈ అర్ధరాత్రి కళ్ళు నింపుకున్న నక్షత్రాలు
ఒకటొకటిగా కళ్ళల్లోంచి ఏరి కుప్పబోస్తున్న బైరాగి
లెక్కలు తేలని వైరాగ్యం జీవితం
ఈ భూమ్యాకాశాలు విస్తుపోయేలా
మైలపడిన మనస్సు కపాలం నుండి తీసి
గజిబిజి ఆలోచనల కీకారణ్యం చెత్త తొలగించి
మనస్సు గూడు యధాస్థానంలో,,,,, తీసి పెట్టలేము కదా !!,,,,,,,,
ఆలోచనలనేవి జీవనం జాగృతికి మూలాలు,,,
నరకతుల్య ఆలోచనలకు దూరంగా
పరిధి దాటని స్నేహాలు, బంధుత్వాలు
ఆలోచనల సమతుల్యత కాపాడుతుంది
బాధాతప్త కల్మషభూయిష్ట ఆలోచనలు
అగ్నిధారలై నిండు జీవితాన్ని కూల్చేస్తాయి
వ్యక్తిత్వ వికాసంతో జీవితం స్వర్గధామం చేసుకో,, ,,,,
సంక్లిష్ట జీవన పోకడలకు దూరంగా ఉండాలి,,,,,,
మనస్సు పక్వమైన పండులా పదికాలాలు మనగలగాలి,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట