ఆలోచిస్తే అందమే ఒక పెద్ద శాపమేమో.

ఆలోచిస్తే అందమే ఒక పెద్ద శాపమేమో.

అందం చూసి వెంటనే వెంట
పడటం మొదలెడతారు.
ఆ అందానికి దాసోహమని ప్రేమ బాణాలు వేసేస్తుంటారు.
మనసును అర్ధం చేసుకోవటం
వదిలి శరీరాన్ని కోరుకుంటారు.
తమ మోహాన్ని తమ భావాల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు.
వారి వికారపు చూపులను తట్టుకోవటం కష్టమవుతోంది.
వారి చేష్టలన్నీ చూస్తుంటే
అందానికి భయమేస్తోంది.
తనకు నచ్చే మగవాడికోసం
ఎంత వెతికినా లాభం లేదు.
అందాన్ని ఆరాధించే వారే కానీ మనసిచ్చే వాడే కనపడడు.
అందమైన మనసు కోసం
వెదుకుతోంది ఆ అందం.
అది ఎప్పటికి దొరుకుతుందో.
అసలు దొరుకుతుందో లేదు.ఆలోచిస్తే అందమే ఒక పెద్ద శాపమేమో.

వెంకట భానుప్రసాద్ చలసాని

ఆలోచిస్తే అందమే ఒక పెద్ద శాపమేమో.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *