పెంటదినెడి కోడి వేగంగ పరుగెత్తు
గడ్డిమేయు పశువు గట్టిగుండు!
పైని రెంటిని దిని పడిపోవు నరులేల
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
తినిన కోడి మేక తీరైన చేపలు
రుజలు గలుగ వచ్చు నిజము నమ్ము!
చక్కనాకు కూర సమతులాహారమై
రక్ష జేయు కృష్ణ లక్షణముగ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!ఆ!!వె!!