గడ్డిదినెడి గోవు కడివెడు పాలిచ్చు
కుక్క కాపు గాచు కూడుబెట్ట!
అన్నిదినెడి నరుడు వెన్ను పోటు పొడుచు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
కం!!💐💐
కోతికి తోక బలము స్త్రీ
జాతికి వలపు బలమట గజమునకు కరమున్
స్వాతియె కార్తెలకు బలము
నేతకు బలమౌను నీతి నిజముగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట