ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

తోటలోన పూలు కూటమి పార్టీలు
కూలిపోవు దొరలు కూలిపోవ
దొరతనమ్ము బోదు మరణమ్ము దరిజేర
సత్య వంతులిలను సాగు కృష్ణ!!

తే!!గీ!!💐 సమస్య పూరణ

భారతమున వర్ణించిన భవ్యకథను
కౌరవేంద్రుని సైన్యము కాలుద్రువ్వ
పాండుసుతులెల్ల భయపడి వణికినట్లు
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *