ఆ!!వె!!💐🪷

ఆ!!వె!!💐🪷

ఆ!!వె!!💐🪷

నిప్పు లేని చోట నిప్పును రగిలించు
బండ పైన నీరు పారజేయు
పోరులేని చోట పోరును పుట్టించు
నదియె పడతియంద్రు పరగ కృష్ణ!!

తప్పతాగి మొగుడు తన్నవచ్చు సతిని
అప్పుచేయవచ్చు నాలికొరకు!
పతినికాచునట్టి సతియేను సతియని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

పెండ్లి కాని వాడు పెండ్లాము కొరకును
తల్లిదండ్రి తోడతగువు లాడు
భార్య పెట్టు బాధ భరియించుచున్ తాను
చావలేక బ్రతుకు శరమువీడి!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *