ఆ!!వె💐🪷

ఆ!!వె💐🪷

ఆ!!వె💐🪷

భక్తి కొలదిగాను భజనలు జేయుము
శక్తిలేని నాడు శరణు వేడు!
ముక్తిదాత మెచ్చి మోక్షమ్ము నొసగును
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

ద్రవ్య రాశిలోన దైవమ్ము నిలువడు
వెండికనకమందు నుండలేడు!
పంటభూములందు పరిఢవిల్లుచునుండు
యన్నదాత వెన్నునంటియుండు

కోవెలందునిలుచు కోదండరామయ్య
బోధిసత్వునిగను పుట్టినాడు!
ఆదిశంకరునిగ యవతరించియు మోది
భరత ప్రజల గాచు భాగ్యదాత!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *