ఆ!!వె!!🕉️🪷🚩
పాఠశాల స్థితిని పరిపుష్టి చేయంగ
ప్రజలు భాగమైన పరిఢవిల్లు!
అందుబాటులోన అధికారులున్నను
విలువ బెరుగు కృష్ణ వృద్ధిజెందు!!
తాత చేతిలోన తారాడు చుండును
పశుల కాపరి కడ వరలు చుండు!
గురువు చెంత నుండి గుణవృద్ధి జేయును
దీనిభావమేమి తెలుపుకృష్ణ!!
కం!!🚩🕉️🪷
చని శ్రీలంకకు మారుతి
కని సీతను చెట్టుకింద కడుమోదముతో
వినిపించి రామనామము
ననియెను రాఘవుని బంటునని వేగిరమున్!!
గడ్డం కృష్ణారెడ్డి