ఆ!!వె!!🪷💐
రాత్రిపూట దోమ రక్తమ్ము బీల్చును
పగటివేళ నీగ పట్టిపీల్చు!
పగలురేయిననక పట్టి పీల్చునదేది
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
!!కం!!🚩🪷
మితవాదిగాను మెలగుచు
గతమును మరిపించి గురువు ఘనతను గూర్చున్
హితమును బోధించుచు తా
సతతమ్మాశీర్వదించు చాత్రుల కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి