ఆశయాలకు సారథివి నీవు…!!!

ఆశయాలకు సారథివి నీవు…!!!

వాళ్ళొచ్ఛారని వీళ్ళొచ్ఛారని
వ్యక్తి పూజలు కాదన్నా ముఖ్యం…
వేదికలెక్కి కల్లబొల్లి మాటలతో పూటని
పులుముతు రంగులు తాపితే…
ఉప్పొంగిన మనస్సును కరకట్టలు
తెంచుకోకు…అవకాశవాదివి కాదు…
ఆశయాలకు సారథివి నీవు
నిర్ణయం నీదే…

నిఖార్సైన నిజ జీవితం
వేల మలుపులకు దిక్సూచి….
మానవత్వపు విలువలని పొలిబోయకు
ఆలోచించుకో యోగ్యులెవరని…
కాలానికి అర్థమిస్తు ఓటుకు నోటు కాదని
వేసే ఓటు వినియోగమై భావితరాలకు
మార్గదర్శకాన్ని నిలుపుకొనే
నిశ్చయం నీదే…

ఎవడో చూపిన ఆశల అరచేతిని
నమ్మితే…పెరగని వికాసాలతో
బోధపడని ప్రతిది మనస్సుకు వెలితే…
నిండిన వేదనలతో మనిషిగా స్థానం
కోల్పోయి అందరిని నీ అరచేయిని చూచి
అడగాల్సి వస్తుంది…
ఆశలతో దోచబడకు నిజం తెలుసుకో…

సముచిత భావాలతో సంఘానికి
క్రమ వరుసవై నియమాలను కూర్చుకో
సాధించిన ఘనతను సమాజంగా
నిలుపుకో…
నిన్నటి మార్పు నేటికి జ్ఞానమై
కనబడుతు నెగడని నూతి బతుకులను
కదిలిస్తు సరియైన న్యాయకత్వాన్ని
నడిపించుకో…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *