అంశం:- ఆశించకు
శీర్షిక:- అత్యాశకు పోకు
మబ్బులు కరిగినప్పుడు కన్నీళ్లు వస్తాయి
ప్రతి విషయాన్ని డబ్బుతో ముడి వేసి
నీకు ఉన్న విలువను ఇతరుల దగ్గర పోగొట్టుకోకు..
ఇతరులను చూసి అసూయ పడుతూ
నీకు ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటూ
ఆశపడు కానీ
ఫలితం ఆశించకు
నీకు నువ్వే గొయ్యి తవ్వుకోకు
డబ్బు అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశకు పోకు
ఊరికే దేన్ని ఆశించకు
నీ కష్టమే అన్నింటికీ మూలం అని తెలుసుకో
ఇతరుల దగ్గర గొప్ప కోసం అత్యాశ పోయి
నీకు ఉన్న విలువను పోగొట్టుకోకు..
నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు…
అత్యాశకు పోయి నీ జీవితం నాశనం చేసుకోకు
కష్టపడి పని చేస్తున్న రైతులందరికి ఫలితం దక్కాలని ఆశించే వాళ్ళగా
ఉండాలి కానీ
వాళ్ల దగ్గర ఏదో ఆశించి సహాయం చేయకూడదు..