ఆశ ఎక్కువే, ఎదగాలని
కోరికలు వెల్లువలు కాకూడదు
మితములో నుండుటే మేలు
ప్రయత్నం తప్పుకాదు
చరత్రలో గణుతికెక్క
గౌరవనీయమైన,నీదు
ప్రయత్నం, అమోఘామైన
ఆలోచనలు చేయ మేలు
గట్టి ప్రయత్నమే ,మన
వల్ల జరుగు మహత్కార్యం
మనగౌరవాన్నినిలబెట్ట
ఆశయం తోడ సాధించ
శక్యమే సకలములు
అందుకే ఎదగాలి
దివ్యత్వంతో సత్కార్య
ఆచరణతో,పొందగలం !!
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
…..కె.కె.తాయారు.