ఇదిగో ఇదే మా ఇల్లు

అక్షర కొరకు
అంశం:మనది కాని ఊళ్లో
శీర్షిక:ఇదిగో ఇదే మా ఇల్లు,,,,,!!

అలా సాయంసంధ్య పొద్దుక్రుంగే వేళ మా ఊరి పొలిమేరల్లో ,వరిచేల గట్లపై నుండి నడిచివస్తే మా ఇల్లు అగుపిస్తుంది.గేటు తీసుకుని లోపలికి రండి ఇంటి ముందు విరిసిన గులాబీ పూవుల మొక్కలు, కనకాంబరం పూవుల మొక్కలు, చేమంతి, ముద్దబంతి పూవుల మొక్కలు ఉంటాయి.ఎదురుగా నేనే ఈ ఇంటి యజమానిని అంటూ తీగ మల్లియల పందిరిని అల్లుకున్న లతలలో జాజిమల్లె పూవులు గుప్పుమంటూ నాసికలలో గుభాళింపులు మిమ్మల్ని మైమరిపిస్తూ స్వాగతిస్తాయి.ఇంటి ముందరి గదిలో చీకటి పడుతున్న వేళ మాసినబట్టల్లో,పెరిగిన గెడ్డంతో టేబుల్ పైన కొవ్వొత్తి వెలుగులో రాసుకుంటో, చదువుకుంటో ఉంటాను ,పక్కన చరవాణి కళ్ళు తెరుచుకుని చూస్తుంటుంది.నా వాళ్లంతా నన్ను వెలివేసి వెళ్లిపోయారు. కాని నేను సరస్వతీమాత తనయుడిని,ప్రకృతి కన్యక ప్రియుడిని. కానీ నేననే వాడిని నీతో ముక్తసరిగా మాట్లాడి పంపిస్తాను సుమీ. నా ముందు ఈ ప్రపంచంలో ఏమిటికీ కొరగాని రచనా వ్యాసంగం ఉంది. నీవు నా భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేవు.నీకై నీవే వెళ్ళిపోతావు,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం: ఈ కథనం నా స్వీయ రచన అని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *