ఇది నిజం
నేను బానిసను కాను
ఎందుకవుతాను?
నీకు పని చేస్తే బానిసనా?
పాపమని దయ తలచి
నీకు రాని పని చేసి పెడితే
బానిసనా?
నా కోసం నువ్వేమీ చేయక
పోయినా నీకు నేను వరమిస్తే
నువ్వు నాకు శాపమిస్తావా?
ఈ లోకం తీరే అంత! పాపం
అన్న వాల్లను ముంచేస్తారు నట్టేట్లో!
రాక్షసులనే నమ్ముతారు గయ్యాళులే
గెలుస్తారు! మెాస కారులను, నమ్మక
ద్రోహులనే నమ్మే కాలమిది నమ్మించి
గొంతులు కోసే కాలమిది!
మంచి వాల్ల రోజులు కావివి మంచి
తనానికి లేదు విలువ!
కానీ నమ్మి నంత మాత్రాన బానిసను
కాను ఇక్కడ ఈ కాలంలో దేవుడు
చూడక పోయినా పైన చూస్తాడు తప్పని
సరిగా! ఇక్కడ గెలిచామని విర్ర వీగుతారు
ఈ ద్రోహులు అక్కడ తప్పించు కోలేరు!
ఇది నిజం!
ఉమాదేవి ఎర్రం