ఇద్దరిది ఒకే మాట

ఇద్దరిది ఒకే మాట

 ఇద్దరిది ఒకే మాట

” జ్యోతి నేను కొన్నాళ్ళు మా అమ్మాయి  విమల వాళ్ళ ఇంటికి వెళ్ళుతున్నా నువ్వు అబ్బాయి జాగ్రత్తగా ఉండండి” అని చెప్పింది పార్వతీ.
“అదేంట అత్తయ్య ఇప్పుడే కదా మాకు పెళ్లయింది అప్పుడే విమల వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లడం” అని అడిగింది జ్యోతి.
“విమలకు ఇప్పుడు ఎనిమిదో నెల కదా అమ్మ అందుకే దగ్గరుండి చూసుకోవాలి కదా తను ఇంటి పనులు సరిగా చేసుకోలేక పోతుంది అందుకే వెళ్తున్నాను” అని చెప్పింది పార్వతి.
“సరే అత్తయ్య విమలని అడిగానని చెప్పండి” అని చెప్పింది జ్యోతి.
“అలాగే చెప్తాను అని జ్యోతి చెప్పి , రాజా నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చెయ్” అని చెప్పింది పార్వతి.
“హా వస్తున్నాను అమ్మ” అని చెప్పి టిఫిన్ చేసేసి బయలుదేరారు.
వాళ్ళు వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళిపోయి ఇంటి పనులు చేసుకుంటుంది జ్యోతి. ఇలా చాలా ఆనందంగా రోజులు గడిచిపోతుంటే ఒకరోజు ఫైల్ మర్చిపోయానని ఇంటికి వచ్చాడు రాజా.
“జ్యోతి నా ఫైల్ మొన్న నీకు ఇచ్చాను కదా ఫైల్ తీసుకొని రా” అని చెప్పాడు రాజా.
“సరే అండి ఇప్పుడే తీసుకుని వస్తాను” అని చెప్పి రూమ్ లోకి వెళ్లి ఫైల్ తీసుకొని వచ్చి రాజాకి ఇచ్చింది.
“ఏవండీ ఎలాగో లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడే తినేసి వెళ్ళండి” అని చెప్పింది జ్యోతి.
“బాక్స్ అక్కడ ఉంది కదా నేను అక్కడే తింటాలే సరే నేను వెళ్తాను” అని చెప్పాడు రాజా.
“జ్యోతి…… జ్యోతి….. ఎక్కడున్నావ్?” అని పిలుస్తూ రాజా వచ్చాడు.
“హా వస్తున్నానండి. ఏంటండీ ఎందుకు అలా అరుస్తున్నారు? నేను కిచెన్ లో వంట చేస్తున్నాను చెప్పండి” అని అడిగింది జ్యోతి.
“విమలకి బాబు పుట్టాడంట అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది” అని ఆనందంతో చెప్పాడు రాజా.
“అవునా చాలా సంతోషంగా ఉంది అండి. మరి ఫ్రెష్ అయ్యి రండి ఈ లోపు వంట అయిపోద్ది” అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోయింది జ్యోతి.
ఇద్దరు కొన్నాళ్లు ప్రేమ లోకంలో విహరిస్తూ ఉన్నారు.
సరే అని చెప్పి వెళ్లిపోయాడు రాజా.
ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న , పెద్దలు చేసిన పెళ్లయిన గొడవలు తప్పవు.
జ్యోతి వాళ్ళ అమ్మకి అసలే కొంచెం కోపం ఎక్కువ. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం.
ఊరు పండుగలు అవుతున్నాయని పార్వతి తన చుట్టాలు అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. జ్యోతి వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి
“హలో వదిన గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు” అని అడిగింది పార్వతి.
“మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు వదినగారు” అని చెప్పింది సుమిత్ర.
“విమల కి బాబు పుట్టాడు. ఇప్పుడు మేము ఊర్లోనే ఉన్నాము పండుగలు జరుగుతున్నాయి ఆ పండగలకు మీరు తప్పకుండా రావాలి” అని చెప్పింది పార్వతి.
“అవునా తప్పకుండా వస్తాం , సరే వదినగారు ఉంటాను” అని చెప్పేసి కాల్ కట్ చేసేసింది సుమిత్ర.
సుమిత్ర కాల్ చేసి “జ్యోతి ఎలా ఉన్నావ్? మేము బాగున్నాము మీ అత్తయ్య గారు మాకు పండుగలకి రమ్మని చెప్పారు. నాన్న ఏమో రావడం కుదరదు. నేను వెళ్దాము అంటే నాకు ఆ ఊరు తెలియదు మీరు ఎప్పుడు వెళ్తున్నారు” అని అడిగింది సుమిత్ర.
“మేము రెండు రోజుల్లో బయలుదేరుతాం అమ్మ” అని చెప్పింది జ్యోతి.
“నేను మీతో వస్తాను. అల్లుడు గారికి ఒకసారి అడిగి నాకు చెప్పమ్మా “అని అడిగింది సుమిత్ర.
“సరే అమ్మ నేను అడిగి రేపు పొద్దున్న ఫోన్ చేస్తాను నీకు” అని చెప్పి కాల్ కట్ చేసింది జ్యోతి.
రెండు రోజుల తర్వాత ఊరు బయలుదేరారు జ్యోతి, రాజా , సుమిత్ర.
“ఏంటిది వదినగారు అమ్మాయి బాలింతరాలు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పింది సుమిత్ర.
“చుట్టాలందరూ ఉన్నారు కదా వదినగారు అందుకే చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది” అని చెప్పింది పార్వతి.
“ఇంట్లో బాలింతరాలు ఉండగా ఎందుకండీ పండగలకు చుట్టాలని పిలిచారు చూసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది” అని చెప్పింది సుమిత్ర.
” ఇంటికి వచ్చిన చుట్టాలను నేను చూసుకుంటాను
మీకు అభ్యంతరం లేకపోతే విమలని మీరు చూసుకోండి తనకేం కావాలో చూసుకోండి” అని చెప్పింది పార్వతి.
“అలాగే వదిన గారు తనని చూసుకునే బాధ్యత నాది” అని చెప్పింది సుమిత్ర.
మీ ఊర్లో చీరలు చాలా బాగుంటాయి కదా వదినా మనం ఒక రోజు షాపింగ్ కి వెళ్దామా అని అడిగింది సుమిత్ర.
“ఇక్కడ అంత మంచి చీరలు ఉండవు వదిన మంచి చీరలు కావాలంటే చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఏమనుకోవద్దు” అని చెప్పింది పార్వతి.
” సరేలెండి వదిన గారు” అని చెప్పి సైలెంట్ అయిపోయింది సుమిత్ర.
పండుగలు అయిపోయిన తర్వాత రాజా, సుమిత్ర, జ్యోతి వెళ్ళు వచ్చేసారు.
ఒకరోజు రాజాకి జానకి ఫోన్ చేసి “కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత మొదటిసారి మన ఊరు పండగలకి జ్యోతి వాళ్ళ అమ్మ వచ్చింది కదా ఆవిడకి చీర పెట్టారా?” అని అడిగింది.
“లేదు పిన్ని ఆ విషయం నాకు తెలియదు అమ్మనే అడగాలి. కంపల్సరిగా పెట్టాలా పిన్ని” అని అడిగాడు రాజా.
“అవును రా కానీ మొదటిసారి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ పెట్టాలి” అని చెప్పింది జానకి
“సరే పిన్ని ఉంటాను నేను తర్వాత కాల్ చేస్తాను” కాల్ కట్ చేస్తాడు రాజా.
“ఈ విషయం జ్యోతి కి చెప్పితే అవునా నాకు తెలియదు విషయం అత్తయ్యకే తెలియాలి” అని చెప్పింది.
పార్వతి మీద కోపంతో తన మరదలు అయినా సరళ “మీరు విమలని బాగా చూసుకునేందుకు చీర పెట్టాలి అని అనుకుంది మా వదిన. కానీ అక్కడ మీరు అన్నమాటలకి మా వదిన బాధపడి మీకు చీర పెట్టకూడదు అనుకుంది “అని సరళ దానికి రెండు చెప్పుడు మాటలు కలిపేసి చెప్పింది సుమిత్రకి.
ఈ మాట డైరెక్ట్ గా పార్వతికి ఫోన్ చేసి అడిగితే “ఒక వారం తర్వాత మీకు చీర పెట్టాలనుకున్న వదిన కానీ ఈ మాట నేను అసలు అనలేదు” అని చెప్పింది పార్వతి.
“ఇంకెప్పుడు మీకు ఫోన్ చేయను మీతో మాట్లాడను మీ ఇంటికి ఎప్పుడు రాను” అని కోపంతో ఫోన్ పెట్టేసింది సుమిత్ర.
ఈ విషయం తెలిసిన జ్యోతి , రాజా వాళ్లలో వాళ్లు గొడవ పడకుండా అసలు ఏం జరిగిందని ఆలోచిస్తూ దానికి కోసం పరిష్కారం వెతికారు.
ఈ గొడవ అంతటికి కారణం తన అత్తయ్య సరళ అని తెలిసి ఆమె చేతనే అందరి ముందు నిజం చెప్పించారు.
ఇరు కుటుంబాలకి గొడవ జరిగినప్పుడు భార్యాభర్తలు ఆ గొడవకి కారణం ఏంటో అని తెలుసుకోకుండా భార్యాభర్తలు కూడా గొడవ పడుతారు. ఆ గొడవ పరిష్కారం కోసం ఎవరు ఆలోచించారు. ఇదే చాలా మంది చేస్తున్నారు.
పార్వతి జ్యోతి , రాజా లను చూసి మీ ఇద్దరిది ఒకే మాట మీద ఉన్నారు.. భార్య భర్తలు అంటే అలాగే ఉండాలి అని చెప్పింది.

-మాధవి కాళ్ళ

నాకు నచ్చిన రంగు Previous post నాకు నచ్చిన రంగు
ప్రేమైక జీవితం Next post ప్రేమైక జీవితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close