ఇద్దరు మిత్రులు (పిల్లల కథ)

ఒక ఊర్లో సుధాకర్, రంగడు అనే మిత్రులు ఉండేవారు. వారు చాలా స్నేహంగా కలిసి మెలిసి తిరిగే వారు. ఎక్కడికైనా ఇద్దరూ ఉండేవారు. వారిని చూసి బడిలోని పిల్లలు అందరూ మెచ్చుకునే వారు. బడిలో కూడా బాగానే చదివే వారు ఇద్దరు. వారిని చూసి, వారి స్నేహాన్ని చూసి అసూయా చెందే వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది వినోద్ ఒక్కడే ఎందుకంటే వినోద్ ఇంట్లోనే రంగడి తండ్రి పని చేసే వాడు. అలాగే సుధాకర్ ఇంట్లో రంగడి తల్లి పని చేసేది.

వినోద్ కి బాగా అహంకారం తమకు డబ్బుంది అని రంగడి తండ్రి తమ కింద పని చేసే వాడు అని వాడిని చులకనగా చూసే వాడు. కానీ సుధాకర్ మాత్రం తమ తల్లిదండ్రులకూ తమ స్నేహాన్నికి అడ్డు రాదని, అంతా సమానమే అని చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పడం వల్ల అందరితోనూ కలివిడిగా ఉంటూ, అందరి వద్ద మంచివాడు అనే పేరును తెచ్చుకున్నాడు.

రంగడు కూడా సుధాకర్ స్నేహం లో అల అన్ని నేర్చుకుని  తనూ కూడా నలుగుర్లోను మంచి వాడు అని అనిపించుకున్నాడు. బడిలోనూ, ఇళ్ళ లోనూ సుధాకర్ కూ, రంగడి కి మంచి పేరు రావడం వినోద్ కి నచ్చ లేదు. దాంతో వారిని ఎలాగైనా విడదియ్యాలని అనుకున్నాడు. అనుకుంటే సరి పోదు కదా వారిని విడదియ్యాలి అంటే ఏంతో కష్టంతో కూడుకున్న పని, ఒకరి మిద ఒకరు చాలా నమ్మకం ఉంటుంది.

చెడుగా చెప్తే నమ్మారు ఎవరూ కూడా, అలా ఇంతకూ ముందు ప్రయత్నించి ఓడిపోయాడు వినోద్. అంతటి నమ్మకం వారికీ. వినోద్ బాగా అలోచించి అలోచించి, ఇలా కాదని వారి తండ్రుల ద్వారా వఅరిని విడదియ్యాలని అనుకున్నాడు. కానీ ఎలా విడదియ్యాడం అని ఆలోచిస్తూ ఉండగా, ఆ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. అది సాకుగా చేసుకుని వినోద్ తండ్రి వద్దకు వెళ్ళి సర్పంచ్ గా నిలబడిన ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ద్వేషం పెరిగేలా చెయ్యమని, అప్పుడు నువ్వే గెలవొచ్చు అని ప్లాన్ చెప్పాడు వినోద్.

అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి సర్పంచ్ సీట్ ఆ ఉరికి ఈసరి దళితులకి వచ్చింది, దళితులు ఎవరూ లేకపోతె ఇంతకూ ముందు ఉన్న వాళ్ళే సర్పంచ్ అవుతారు,అంటే ఇంతకూ ముందు ఉన్నదీ మన వినోద్ తండ్రి అప్పల నాయుడు. అతనికి డబ్బు, అహంకారం బాగా ఉంది, డబ్బు ఎగజల్లి ఎన్నికల్లో గెలిచి, అసలు ఊర్లో పనులేమి చెయ్య కుండా, డబ్బుని వెనక వేసుకునే వాడు, అతన్ని గెలిపిస్తే ఊరిని బాగుచేస్తాడు అని ఆనుకున్న రామాపురం ప్రజలకు అతనేమి చేయకుండా, కనిస అవసారాలు కూడా తిర్చలేదు.

దాంతో ఆ ఊరి ప్రజలు అతని మిద చాలా కోపంగా ఉన్నారు. కానీ, వినోద్ రంగన్ని, సుధాకర్ ని విడదియ్యాలని అనుకుని, ఈ సరి నిలబడిన సుధాకర్ తండ్రి గురించి రంగడి తండ్రి  దగ్గర చులకనగా మాట్లాడాడు, అయితే రంగడి తండ్రి తన అమాయకత్వం తో ఏ విషయం గురించి అయితే అప్పల నాయుడు  మాట్లాడాడో అది నిజామా, కాదా అని అడిగాడు అందరి ముందు, అందరూ చాలా కోపంగా, ఆశ్చర్యంగా చూసారు రంగడి తండ్రిని, ఇంట్లో సుధాకర్, రంగడు కూడా అక్కడికి వచ్చారు.

రంగడి తండ్రి రంగన్ని, సుధాకర్ ని చూస్తూ మళ్ళి అదే మాటని అడిగాడు. రంగడు సుధాకర్ తండ్రి వద్దకు వెళ్ళి అంకుల్ మా నాన్నకు  ఏమి తెలియదు, ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర అని అన్నాడు, దానికి సుధాకర్ తండ్రి చలపతి నవ్వుతు, చూడు రంగా ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం మిమల్ని, ఎవరూ ఏంటో నాకు తెలియదా, మిరిద్దరే కాదు, నేను మీనాన్న కూడా స్నేహితులమే, వాడు అలా అమాయకంగా ఉండిపోయాడు.

నేను కొంచo తెలివి పెంచుకుని ఇలా అయ్యాను, అయినా మేము ముగ్గురం కూడా స్నేహితులమే, వాడు ఎలాంటి వాడో మాకు తెలుసు, ఈ అప్పలనాయుడు కూడా అసుయతో మి నాన్నకు కావాలని దెబ్బ తగిలించాడు దాంతో మీ నాన్నా ఇలా అయ్యాడు. వాడి బుద్దులే ఇప్పుడు వాడి కొడుకు వినోద్ కూ వచ్చయి,కానీ ఇన్ని రోజులు పోనిలే అనీ ఊరుకున్నాం ఇప్పుడు వాడి పని పట్టే సమయంవచ్చింది.వాడిని ఈ ఊరు నుండి వెళ్ళ కొడదాం పదండి అని అన్నాడు సుధాకర్ తండ్రి చలపతి.. 

దానికి రంగడు పోనీ లెండి అంకుల్ తెలియక చేసి ఉంటారు ఇక నుండి బాగానే ఉంటారు లెండి అని అన్నాడు, సుధాకర్ కూడా చలపతితో అవును నాన్న అంకుల్ ని వినోద్ ని ఉండనివ్వoడి అని అనడంతో పిల్లలకున్న బుద్ధి వాడికి లేకుండా పోయింది అని అన్నారు అంతా, అక్కడే చాటు గా ఉంది వింటున్న అప్పలనాయుడు, వినోద్ లు కూడా వారి వద్దకు వచ్చి, అందరి ముందు అప్పలనాయుడు రంగడి తండ్రి చేతులు, వినోద్ రంగడి తోను మమల్ని క్షమించండి, మేము మిమల్ని విడదియ్యాలని చుస్తే మీరు మమల్ని వెళ్ళిపోకుండా చూసారు. అని అంటూ ఏడవడంతో మనమందరం స్నేహితులం రా మన మధ్య క్షమాపణలు ఎందుకు అంటూ హత్తుకున్నారు… 

Related Posts