ఇరవై రూపాయల నోటు

అడగనా ,వద్దా ,అమ్మో అడిగితె ఏమనుకుంటాడో అందరి ముందు అరుస్తాడు ఏమో ,అసలే ఆడపిల్లలు ఉన్నరు వాళ్ళ ముందు అవమానం అవుతుంది అరిస్తే,అయినా వీడు నాకే ఇవ్వాలా ఇది, ఇచ్చినప్పుడు అయినా నేను చూసుకోవాలి కదా

నా బుద్ది ఎటు పోయిందో మరి,అయినా వాళ్ళకు వచ్చిన వాటిని ఇలా నాలాంటి అమాయకులకు అంట గడతారు వెధవలు, ముండా నా కొడుకులు, ఛి నా బుద్ది  కి ఏమయింది మరి..

నేను వాడు మంచిదే ఇచ్చాడు అని అనుకుని జేబులో పెట్టుకుంటిని, ఆవుల గాడు ,అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నదే ఈ ఒక్క నోటు పొద్దున్న నుండి  కనీసం  టిఫిన్  కూడా  చేయకుండా  మా  దోస్తుగాడిని  కలవడానికి వెళ్తూన్న ..

కనీసం వాడి వద్దకు వెళ్తే అయినా ఒక్క పూట తిండి డబ్బులు మిగులుతాయి అని అనుకుంటి, పది రూపాయలు పెట్టుకుని వెళ్తే  మూడు పూటల తిండి కి డోఖా ఉండదు అని అనుకుని పోతున్నా

అ డబ్బుతో ఇంకో రెండు రోజులు ఆకలి ఇర్చుకోవచ్చు అని అనుకున్న ,కానీ విడు ,ఈ చెత్త వెధవ,ఇలా చేస్తాడు అని అనుకోలేదు..

అయినా ఇలాంటివన్నీ నా లాంటి వాడికే జరుగుతాయి ఎందుకో,నాకు ముందే మొహమాటం ఎక్కువ, దానికి తోడూ అమ్మాయిల ముందు మాట్లాడాలి అంటే సిగ్గూ ,బిడియం,

ఇప్పుడు అతన్ని అడగాలి అని ఉన్నా వాళ్ళ ఎదురుగ ఎలా అడగాలి,ఆ అమ్మాయిలు నన్ను చీప్ గా అనుకోరు,తీసుకునేటప్పుడు చూసుకున్నా బాగుండేది, అంటూ నాలో నేనే మాట్లాడుతున్న..

నేనొక నిరుద్యోగిని పట్టణానికి పొట్ట చేత పట్టుకుని ,పని కోసం వచ్చిన ,నా చదువుకు తగిన ఉద్యోగం కోసం చూస్తూ, తే లిసిన స్నేహితుల గదిలో తల దాచుకుంటూ,ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ,

ఉద్యోగం వస్తే, ఊర్లో ఉన్న తల్లిదండ్రుల ను బాగా చూసుకోవాలనే కలలు కంటున్నా వాడిని,ఆలాంటి నాకు నిన్న రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది,ఒక స్నేహితుడు ఫోన్ చేసి,

ప్రొద్దునే తనుండే  ప్లేస్ కూ రమ్మని, ఒక పరిశ్రమ లో సెక్యూరిటీ పోస్ట్ ఖాళి గా ఉందని, దానికి ఇంటర్వూలు జరుగుతున్నాయి..

 అని రమ్మని చెప్పడం తో ప్రొద్దునే లేచి,డబ్బు సరిపోదు అని ,అయిదు కిలోమీటర్లు నడిచి వచ్చి,ఖర్మ కాలి ఈ బస్ ఎక్కినా,ఉన్న డబ్బు వాడి చేతిలో పెట్టి టిక్కెట్ ఇవ్వమని అంటే మిగతా డబ్బులన్నీ చిల్లర ఇచ్చి, ఇది మాత్రం నాకు అంట గట్టాడు.

వెధవ అయినా నా బాధ వాడికేం అర్దం అవుతుంది.నా బాధ వాడికి అంటే ఉద్యోగం ఉంది.వాడికి నాలాంటి పరిస్థితి వస్తే తెలిసేది నా బాధ అని వాడిని ఎన్ని రకాలుగా తిట్టుకోవాలో అన్ని రకాలుగా తిట్టుకుంటూ కూర్చున్న,

కానీ నా దగ్గర అది తప్ప వేరేది లేదు.ఒక వేళ జాబు వచ్చినా నెల రోజుల వరకు అంటే జీతం వచ్చే వరకు నాకు అదే గతి, నేను దాంతోనే గడపాలి.

కానీ వాడు ఇచ్చిన దాన్ని తీసుకుంటే ,నాకూ ఎలా కుదురుతుంది,దాన్ని వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు దాన్ని నా మొఖాన కొట్టి, బయటకు గెంటుతారు,

వీడు నా కడుపును కొడుతున్నాడు,వెధవ ఎన్ని బూతులు తిట్టుకోవాలో అన్ని బూతులు తిట్టుకున్నా నేను అయినా మనసులో ఎదో అలజడి,నేను అడగకపోతే వాడు ఇవ్వడు,వాడు ఇవ్వక పొతే నా కడుపు మాడుతుంది.

మా అమ్మ చెప్పిన సామెత సమయం లో ఎందుకో గుర్తు వచ్చింది. అడగంది అమ్మయినా పెట్టదు అని,దాంతో నేను వాడిని అడగాలని అనుకుని నిర్ణయించుకున్నా,నా మొహమాటాన్ని,

సిగ్గుని వదిలేయాలి అని అనుకుని చుట్టూ చూసాను ఎవరూ ఉన్నారా అని బస్ లో ఇద్దరు అమ్మాయిలు నేను తప్ప  ఎవరూ లేరు,

డ్రైవర్,కండక్టర్ ఇద్దరూ ఎదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు అమ్మాయిలు చెవి లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని బిజీ గా ఉన్నారు. ఇదే మంచి సమయం అడగడానికి అని అనుకున్నా, 

లేచి నిలబడ్డా అడగడానికి ,నేను నిలబడ్డం చుసిన అమ్మాయిలు తలెత్తి నన్ను చూసారు,దాంతో నేను మళ్ళి కూర్చున్నా సిగ్గుతో,అది చూసి కండక్టర్ వెనక్కి నా వైపు వచ్చాడు,.

ఏంటి బాబు నువ్వు సిటీ కి కొత్తనా నువ్వు దిగే స్టేజి  రావాలి అంటే  ఇంకో  ఇరవై నిముషాలు పడుతుంది,

 మధ్యలో రెండు స్టేజిలు దాటాలి అని అంటూ నా జేబులోంచి  బయటకు  కనిపిస్తున్న ఇరవైరూపాయలనోటు ని చూసి, అయ్యో ఈ నోటుని నీకు ఇచ్చానా బాబు ,

అయినా నన్ను అడగొచ్చు కదా, అప్పటి నుండి దీని కోసమే వెతుకుతున్నా ,ఇది మొత్తం చిరిగింది,దిన్ని డిపోలో ఇచ్చి, వేరేది మార్చాలి,అంటూ ఆ నోటు తీసుకుని నాకు చిల్లర రెండు పది నోట్లు ఇచ్చాడు..

అప్పటి వరకు నేను పడిన ఆందోళన అంతా చేత్తో తీసేసినట్టు ఒక్కసారిగా పోయింది, మనసు గాల్లో ఎగిరింది,పాపం అతన్ని ఎన్ని తిట్లు తిట్టుకున్నానో గుర్తొచ్చి,మనసులో నవ్వుకున్నా,

బయటకు మాత్రం థాoక్స్ అనే చిన్న పదం చెప్పాను. అతను నవ్వుతూ నాదే తప్పు బాబు చూడకుండా ఇచ్చాను సారీ అని తన సీట్ లోకి వెళ్ళిపోయాడు.

బస్ దిగుతూ అనుకున్నా నేను లోకం లో ఇంకా మంచితనం, మానవత్వం మిగిలే ఉందని……..

Related Posts