ఇల్లంతా సందడి

అబ్బాబ్బా ఇల్లు సర్ధ లేక చస్తున్నా అంది భాగ్య ,ఆనంద్ తో ,ఏంటి భాగ్యం నువ్వే అలా అంటే ఎలా చెప్పు ,మరేమీ చేయను, నాది పొలిసు ఉద్యోగం ,నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు, అయిన నీ భర్త నిజాయితి కి అందరూ ఇచ్చే అవార్డు బదిలీలు అందుకే ఎక్కడా ముడునేల్లకి మించి చేయనివ్వరు అంటూ భాగ్య ని దగ్గరికి తీసుకుంటూ, వీటికి తోడూ సరసాలు కూడానా అంటూ, అతన్ని అల్లుకు పోయింది భాగ్య.

వాళ్ళిద్దరూ ఎంతో అనోన్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ, గొడవలు వచినప్పుడు సర్దుకుని పోతు జీవనం కొనసాగిస్తున్నారు. అలా ఆనంద్ కి బదిలీలు అవుతూ, అవుతూ ఉండగానే నలుగురు పిల్లలు పుట్టుకు వచ్చేసారు, వారి చదువులు, పెళ్ళిళ్ళతో అసలు సమయమే తెలియ లేదు భాగ్యకు ,వారి పెంపకం, చదువును, వారేమి కోర్సులు చేయాలో కూడా భాగ్యనే చూసుకుంది.

ఆనంద్ మాత్రం ,తన ఉద్యోగం ఏంటో, తానెంటో చూసుకుంటూ ఉండేవాడు ,అతనికి తరచూ బదిలీలు అవుతూ ఉండడం వల్ల భాగ్య పిల్లల చదువుల కోసం ఒకే దగ్గర ఉంతను అని ఆనంద్ తో చెప్పి, అతన్నే రోజు వెళ్ళి రమ్మని అంది. దాంతో ఏమి మాట్లాడని ఆనంద్ సరే అని అన్నాడు. ఇక అప్పటి నుండి భాగ్యకూ పిల్లలే లోకంగా మారింది.

వాళ్ళ చదువులు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళకు వండి పెట్టడం, ఆహారం విషయంలో వారికీ ఇష్టమైనవి వండి పెడుతూ, వారిలోనే తన సంతోషాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టింది. అలా ఇల్లంతా నలుగురు పిల్లలతో ,ఎప్పుడు సందడిగా ఉంటూ ఉండేది. వారికీ అన్నం పెడుతూ, వారితోనే ఆడుకుంటూ, వారిని పట్టుకోవడానికి, పరుగెత్తుతూ పిల్లల్లో  ,పిల్లలాగా ,తల్లిగా ,ఎన్నో ఆటలు వారికీ నేర్పిస్తూ, అసలు తండ్రి అనే మాట కూడా వారికీ గుర్తు  రానంతగా వారిని మరిపించగలిగింది.

ఇక ఆనంద్ తనకు పెరిగే పేరు కోసం, వచ్చే ప్రమోషన్ కోసం, పెరిగే జీతం కోసం, తన నిజాయితీని అమ్ముకోకుండా కష్టపడి పని చేస్తూ, అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇంట్లో పిల్లలకు దురమవుతున్నాడని అనుకోలేక పోయాడు. ఫలితం గా పిల్లల దృష్టిలో తండ్రి కెవలం డబ్బు సంపాదించే ఒక మనిషి గా మిగిలిపోయాడు. కానీ అవేవి అప్పుడు ఆనంద్ దృష్టికి రాలేదు, పిల్లలకు మంచి విద్య, ఆహారం, మంచి పొజిషను అందించాలని బాగా కష్టపడి, అన్ని విధాల వారు స్థిర పడిన తర్వాత తన రిటైర్మెంటు అయ్యాడు.

పిల్లల పెళ్ళిళ్ళు,వారి చదువులు అన్నిటికి ముందు భాగ్యనే ఉంది. ఆనంద్ కేవలం ప్రేక్షక పాత్ర వహించాడు. పిల్లల అత్తగారు, మామగార్ల పేర్లు ఏమిటో, వాళ్ళు ఎవరో ,ఎక్కడ ఉంటారో కూడా ఆనంద్ కూ తెలియదు. కేవలం అన్ని రెడీ అయ్యాక అక్షంతలు వెయ్యడమే తెల్సు అంతే, పిల్లలకు తండ్రి అంటే భయం తప్ప ,ప్రేమ లేదు .అలా పెరిగారు వాళ్ళు.

ఇక ఇప్పుడు పిల్లలు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిర పడ్డారు .నలుగురు పిల్లలో ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ లోనే పిల్లలను చూసి పెళ్లి చేసింది భాగ్య ,వాళ్ళు స్థితి మంతులే, బాగా ఉన్నవారె ,ఇక అబ్బాయిలు ఇద్దరూ ఇంజనీరింగు చేసి అమెరికాలో స్థిర పడ్డారు.

ఇప్పుడు ఆనంద నిలయం ఇంట్లో   ఆనంద్ ,భాగ్య లు తప్ప ఎవరూ లేరు, ఆనంద్ రోజు తన పనులు అన్ని ముగించుకుని, భార్య ఇచ్చిన, టిఫిన్ తింటూ, కూర్చుంటాడు, సమయంలో భాగ్య టిఫిన్ చేసిన ఇది పిల్లలు అలా తింటారు, ఇలా తింటారు అని అంటూ పిల్లలు చిన్నప్పుడు చేసిన అల్లరి, అల్లరి పనులన్నీ ఆనంద్ కి వివరించి చెప్తుంటే అతను తన్మయత్వంతో ,వింటూ ఉంటాడు.

రోజు అలా వినడం అతనిదినచర్య,అతను చూడలేనివి, వినలేనివి, అనుభవించలేనివి, భాగ్య చెప్తుంటే ,కళ్ళు మూసుకుని, వాటిని ఉహించుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో ఇలా ఇద్దరే ఉండడం ఇద్దరికీ నచ్చడం లేదు. ఇప్పుడు అన్ని బాధ్యతలు  తీరిన తర్వాత ,పిల్లలకు దూరంగా ఉండడం అనుటే ,పైగా భాగ్య వారి చిన్నాప్పటి విషయాలు అన్ని చెప్తుంటే, వారి దగ్గర ఉండాలి అని, వారిని చూడాలి అని వారితో అడుకోలేని ఆటలు, వారి పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తుంది ఆనంద్ కి.

అందుకె ఒక రోజు భాగ్యను దగ్గర కూర్చో బెట్టుకుని, భాగ్య నాకు పిల్లలతో ఉండాలని ఉంది, వాళ్ళతో  కలిసి తినాలని, తిరగాలని ఉంది, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరనె ఉందాం, వెళ్ళి అని అంటూ తన కోరికను వెళ్ళడిoచాడు అరవై ఏళ్ల ఆనంద్..

భాగ్య భర్త ను చూస్తూ, అతను పిల్లలను ఎంతగా కోల్పోయాడో, పిల్లల మిద అతనికి ఉన్న ప్రేమకు, ఆప్యాయతకు ఆమె కదిలిపోయింది. తన భర్త తనని ఎప్పుడూ, ఏమి అడగని వాడు ఇప్పుడు అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది, దానికేం భాగ్యం అండి, వెళ్దాం లెండి, నేను పిల్లలకు ఫోన్ చేసి చెప్తాను అని అంది, వెంటనే పిల్లకు ఫోన్ చెయ్యడం, వాళ్ళు రమ్మని అనడం, వారం రోజుల్లో టికెట్స్ పంపించారు, వీళ్ళు ఆనందంగా వెళ్ళారు .కానీ అక్కడికి వెళ్ళాక మొదలయ్యింది అసలు సమస్య,

పిల్లలతో ఆనంద్ మాట్లాడాలని ప్రయత్నించడం, వాళ్ళు దూరంగా వెళ్ళాడం, వారి పిల్లలను కూడా దగ్గరికి రానివ్వక పోవడం వంటివి చేస్తూ ఉన్నారు, దాంతో ఆనందoకు చాలా కష్టంగా అనిపించసాగింది, వాళ్ళు అక్కడ కూడా ప్రతిదానికి అమ్మా అమ్మ ,అత్తయ్య, అత్తయ్య అని పిలుస్తూ ఆమె చుట్టే తిరుగుతూ తండ్రిని కానీ మామయ్యని కానీ పిలవకుండా ఉండడం, కేవలం తినడానికే అది కూడా భార్య వచ్చి పిలుస్తేనే వెళ్ళి తినడం ,మళ్ళి పేపెర్ చూడడం ఇదే పని మారింది..

ఆనంద్ కి అసలు తనని ఓక మనిషిగా కూడా వాళ్ళు గుర్తించక పోవడం చూసి అతను చాలా బాధ పడ్డాడు, అదే విషయాన్నీ భార్య తో చెప్పలి అని అనుకున్నాడు, పాపం భాగ్య కూడా అవన్నీ గమనిస్తుంది, కానీ ఏమి చెయ్యగలదు. ఇక ఇలా కాదని తనకు తన ఇల్లే మంచిదని భాగ్యతో  వెళ్ళి పోదాం అన్నాడు ఆనంద్ .సరే అని పిల్లలకు చెప్పింది భాగ్య. పిల్లలు దానికి అమ్మా వెళ్ళిత అతన్ని వెళ్లనివ్వు, నువ్వు మాత్రం ఉండమ్మా అని అన్నారు ,దానికి భాగ్య వారి అందర్నీ చూస్తూ, చుడండి నేను ఇక్కడ ఉండలేను నా భర్త ఎక్కడ ఉంటె నేను అక్కడే ఉంటాను, నా భర్త తర్వాతనే నాకు ఎవరైనా అంది .అదేంటమ్మ అలా అంటావు ,ఇక్కడ నీకు ఏమి తక్కువ అయ్యిందో చెప్పు, నీకేం కావాలన్నా మేమున్నాం ,కదా తెచ్చి పెడతం అని అన్నారు .

అదేంట్ర అయన లేకుండా మీతో నాకేం పని, అయన లేకపోతె నాకు మిరెక్కడి నుండి వస్తారు, నేను మీతో ఉండడం ఏంటి, మీరు నాకు కావల్సినవి తెచ్చి పెట్టడం ఎంటి ,నాకు కావాలంటే నా భర్త తెచ్చి పెట్టలేడా ,ఎదో అతను మిమల్ని చూద్దామని అన్నారని అతని కోసమే అంటే మీ నాన్న కోసమే నేను ఇంత వరకు వచ్చాను .లేదంటే నేను నా ఇంట్లో ఉండేదాన్ని హాయిగా ,అయినా ఈయనకు బుద్ది లేదు పిల్లలు ,పిల్లలు అంటూ నన్ను విసిగించి ,ఇంత వరకు తెచ్చారు అంది చాలా మామూలుగా అంటే అమ్మ నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదా, మా దగ్గర ఉండడం ఇష్టం లేదా అన్నారు వాళ్ళు మీకు ఇన్నేళ్ళు చేసిన చాకిరీ చాలదా ,మళ్ళి ఇక్కడ కూడా చాకిరీ చెయ్యడానికే నేను రావాలా, హయిగా నా ఇంట్లో నేను ఉండేదాన్ని, అంది, అమ్మా ఆయనకు అసలు ప్రేమ లేదు మా మిద నువ్వు కావాలని అల అంటున్నావు.

ఆయనకు మేము అంటే ఇష్టం లేదు కాబట్టే మమల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు, మా బడికి రాలేదు , మాతో గడపలేదు సరదాగా ఉండలేదు అని  అన్నారు, దానికి భాగ్య ,అరేయి నాని నిజమే మిమల్ని దగ్గరికి తీసుకోలేదు, మీతో గడప లేదు, మీ బడికి రానంత మాత్రానా ఆయనకు ప్రేమ లేదని అర్ధమా? మరి మీరింత చదువుకుని బాగా బతుకుతున్నారు అంటే ఆయన రక్తమే కదా అయన సంపాదించి పెడితేనే కదా మీరు అన్ని విధాలా చదువుకుని, ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యి, ఇప్పుడు మాకేం చేసారు అని అంటున్నారు ఆయన్నే వేలెత్తి చూపిస్తున్నారు, అప్పుడాయన మీతో గడపలేడనే, ఎంత బాధపడుతున్నారో మీకు తెల్సా, ఆయన వెళ్దామని అంటేనే నేను వచ్చాను.

మీరంటే ఆయనకు ఎంత ప్రాణమో తెల్సా ,ఆయన రాత్రిళ్ళు వచ్చాక ,మీరు నిద్ర పోతూ ఉంటె ,మీ కాళ్ళు నొక్కుతూ, మిమల్ని ముద్దు పెట్టుకుని, మీతో గడప లేకపోతున్నoదుకు చాలా బాధపడేవారు ,నేనే ఆయన్ని ఓదార్చే దాన్ని, మీరు బాగుండాలని, చదువు చదవాలని, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా డ్యూటీ చేసి, తన కష్టార్జితాన్ని, జీవితాన్ని, మీకు అంకితం చేసి, తన సుఖాన్ని, సంతోషాన్ని కూడా దులుకున్నారు .అంటూ దీర్ఘంగా చెప్పి ,ఉపిరి పీల్చుకుంది.

అమ్మా చెప్తున్నా ఒక్కో విషయం వింటున్న నలుగురు పిల్లలు ఆమె చెప్పడం అయ్యేసరికి నీళ్ళు వస్తునాయి ,లోపల ఆనంద్ కూడా ఏడవడం మొదలు పెట్టాడు. తన భాగ్య తనని ఇంతగా అర్ధం చేసుకున్నందుకు ఆనంద భాష్పాలు వెంటనే లోపలి నుండి వచ్చి, అక్కడ అందరూ ఉన్నా కూడా ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు వెంటనే, నలుగురు పిల్లలు, వారి భార్యలు కూడా వారి తల్లిదండ్రులు గుర్తొచ్చి తల్లిదండ్రులను కౌగిలించుకున్నారు 

ప్రతి తల్లి, తండ్రి తమ సంతోషాన్ని, సరదాలు అన్ని మానేసుకుని పిల్లల భవిషత్తును బంగారు బాట చెయ్యడానికి అహర్నిశలు కష్టపడతారు. అది తెలుసుకోలేక ,వారిని అపార్దం చేసుకుని, మలి వయస్సులో వారిని బాధ పెడుతూ ఉంటారు అలాoటి వారు తల్లిదండ్రులను అర్ధం చేసుకొని ,చిన్నప్పుడు మీరో పొందలేని ఆనందాలను, మీ పిల్లల ద్వారా తిర్చుకోనివ్వండి, వారిని ప్రేమగా, చూసుకోండి …..

Related Posts