ఈనాటి రావణాసురులు – అనాధ పిల్లలు

అంశం:⁠- ఈనాటి రావణాసురులు

శీర్షిక:⁠- అనాధ పిల్లలు

 

                     ఒక ఊరి చివరలో ఒక అనాధాశ్రమం ఉంది. అందులో పిల్లలు మాత్రమే ఉన్నారు. అందులో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు.

అనాధాశ్రమం యజమాని మాత్రం విదేశాల్లో ఉంటాడు. ఆశ్రమం బాధ్యతలన్ని బాగా నమ్మకస్తుడైన బాలాజీకి అప్పగించారు.

అక్కడ పిల్లలకు అన్నం వండి పెట్టడం , వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటుంది మాలిని.
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పిల్లలు ఆలనా పాలన చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేది మాలిని.

బాలాజీ ఒక్కడే పిల్లలందరినీ చూసుకొని ఉండేవాడు.
మాలిని ఉన్నంతసేపే ఆడపిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. మాలిని వెళ్లిపోయిందనుకో ఇంక ఏడుస్తూ ఒక పక్కన కూర్చుంటారు.

తన తోటి అబ్బాయిలు అడిగితే ఏమి చెప్పకుండా ఏడుస్తూనే కూర్చుంటుంది యుక్తికా.
బాలాజీ ప్రతిరోజు రాత్రి ఒక అమ్మాయిని తన రూమ్ కి రమ్మని పిలుస్తాడు.

ఆ అమ్మాయి రెండు గంటల తర్వాత ఏడుస్తూ రూమ్ నుంచి బయటికి వస్తుంది.
కొన్ని రోజుల తర్వాత సిరి అనే అమ్మాయిని ఆశ్రమంలో జాయిన్ చేయించింది మాలిని.

మాలిని ఆశ్రమంలో ఉన్నంతసేపు అమ్మాయి అందరూ సరదాగా ఆడుకుంటూ ఉండేవారు  , ఎందుకంటే అప్పుడు బాలాజీ ఉండేవాడు కాదు.

ఒక రోజు అందరూ నిద్రపోయిన తర్వాత సిరిని బాలాజీ తన రూమ్ రమ్మని పిలిచాడు.
ఏం తెలియని సిరి పిలిచిన వెంటనే బాలాజీ రూమ్ కి వెళ్ళింది.

రెండు గంటల తర్వాత సిరి రూమ్ నుండి ఏడుస్తూ బయటకు వచ్చింది.
అందరూ నిద్ర పోయినట్టు నటిస్తూ సిరిని చూస్తున్నారు. సిరి మాత్రం ఏడుస్తూనే ఉంది.
మరుసటి రోజు ఎప్పటిలాగే మాలిని ఆశ్రమానికి వచ్చింది.

అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు కానీ వాళ్ళలో సిరి లేదు.
మాలిని సిరి దగ్గరకు వెళ్ళి ఎంత అడిగినా సమాధానం చెప్పడం లేదు.

అది గమనించి కొంచెం ధైర్యం చేసి జరిగిన సంఘటన గురించి చెప్పింది యుక్తికా.
బాలాజీ మీద విపరీతమైన కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుని ఒక ఉపాయం ఆలోచించింది మాలిని.

“ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళాను. నేను చెప్పినట్టు మీరు చేయండి” అని చెప్పింది మాలిని.
అందరూ తలాడించారు. భోజనంలో మొత్తం కలిపేసి బాలాజీకి పెట్టింది మాలిని.
తిన్న తర్వాత మత్తుగా నిద్రలోకి వెళ్లి మాలిని అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు.
మరుసటి రోజు పోలీసులు వచ్చి బాలాజీని తీసుకొని వెళ్లారు.

ఆశ్రమ యజమానికి రాత్రి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తే ఇకనుంచి ఆశ్రమం నేనే చూసుకుంటానని చెప్పాడు.

అందరు పిల్లలు బాలాజీని పోలీసులు తీసుకెళ్లందుకు సంతోషంగా తృప్తిగా తిని నిద్రపోయారు.
అనాధ పిల్లలు ఏమైనా చేస్తే అడిగే వాళ్ళ అడిగే దిక్కు ఉండదు అని తన ఇష్టమొచ్చినపుడు చేశాడు బాలాజీ.

ఆనాటి రామాయణంలో ఒక రావణాసురుడే ఉన్నాడు. ఇప్పటి కాలంలో ఈనాటి ప్రపంచంలో రావణాసురులు ఎంతో మంది ఉన్నారు.

అడుగడుగునా ఇలాంటి రావణాసురుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *