ఈ రోజు అంశం ఈ నాటి రావణాసురులు..

ఈ రోజు అంశం
ఈ నాటి రావణాసురులు.

శీర్షిక
రావణాసురునికి కోపం వచ్చింది.

ఒక సారి త్రేతాయుగంలో నారద మహర్షి రావణాసురునితో ” చూడు
రావణాసురా, భూలోకంలో
అతి నీచమైన మనిషిని నీతో
పోలుస్తున్నారు. ఆ విషయం
నీకు తెలుసా?”అన్నాడు.
అప్పుడు రావణాసురుడు
“నా‌రదా, నేను తపస్సు చేసి

ఈశ్వరుని వద్ద వరాలు పొందాను.

అసలు నేను ఎందుకు జన్మించానో చెపుతాను విను.
శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ కుమారులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన నేను నా సోదరుడు (జయ విజయులు) బ్రహ్మ కుమారులను చూసి అడ్డగించాము.

దీని వల్ల బ్రహ్మ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులైన మమ్మల్ని భూలోకంలో జన్మించమని శపిస్తారు. మేము శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు.

ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులైన నేను మా సోదరుడు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడ్డాము ఈ విధంగా జయవిజయులైన మేము కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడిగా, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడిగా, ఇంకా
ద్వాపరయుగంలో కూడా
జన్మించాలి.

ఈ విధంగా త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములుగా జన్మించాము.
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మనికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడిగా నేను జన్మించాను.

నా తమ్ముళ్లు
కుంభకర్ణుడు, విభీషణుడు.
నా చెల్లెలు శూర్పణఖ.
రావణాసురుడినైన నేను చిన్నతనం నుండి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగి ఉండేవాణ్ణి.

ఏకసంథాగ్రాహిగా ఉండేవాణ్ణి, వేదవిద్యలు నేర్చుకున్న గొప్ప విద్వాంసుణ్ణి. నా తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, దైత్యకృత్యాలు నేర్చుకున్నాను.

నేను జన్మించిందే మహా విష్ణువు అవతారమైన శ్రీరాముని చేతిలో మరణించేందుకే. అందుకే
నేను సీతాదేవిని లంకకు
తీసుకుని వచ్చి శ్రీరామునికి
కోపం తెప్పించాను.


విధంగా శ్రీరాముడు నన్ను
వధించవచ్చాడు. నాకు
శాపవిమోచన కలిగించేందుకు
వచ్చాడు. అటువంటి నన్ను
అకారణంగా మనుషుల్ని
హింసించి ఆనందించే వారితో
పోలుస్తున్నారు. దానికి నాకు
కోపం వస్తోంది. అయినా చేసిన
పాపం ఊరికే పోదు కనుక
నా చరిత్ర ఇలా శాశ్వతంగా
ప్రజల కోపాగ్నికి గురైంది”
అన్నాడు. నారదుడు ఆ
రావణుని మాటలు విని
” అవును రావణా, నీ
కధ నాకు తెలుసు. కానీ
ప్రజలకు తెలియదు
కదా. ఏదిఏమైనా నువ్వు
చేసింది తప్పు వలనే
శ్రీరాముడు నిన్ను వధించ
వచ్చాడు” అన్నాడు.
రావణుడు శ్రీ రాముని
ఆగమనం కోసం ఎదురు
చూస్తున్నాడు.

ఈ కధ నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *