శీర్షిక
ప్రమాద ఘంటికలు
ఈ రోజుల్లో ప్రేమలేఖలంటే
ప్రమాద ఘంటికలనే యువత
భావించాలి. ఏ పుట్టలో ఏ
పాముందో తెలియనట్టుగానే
ఏ ప్రేమలేఖ వెనుక ఏ రకమైన దుర్మార్గపు ఆలోచన ఉందో
తెలియటం లేదు. ఆ ప్రేమ
లేఖను ఆడవాళ్లు కనుక మగవాళ్ళకు వ్రాస్తే దాన్ని
పట్టుకుని వారిని బ్లాక్ మేల్
చేసే మగ పుంగవులు ఉన్నారు.
అదే మగవాళ్ళు కనుక తనకు ఇష్టమైన ఆడవారికి వ్రాస్తే అది
అందుకున్న ఆడవారు వెంటనే
రెస్పాండ్ అయ్యి ఓకే చెప్పారు
అంటే ఇక అంతే సంగతులు.
అవతల మనిషెవరో, అతను
ఏమి చేస్తున్నాడో, అతని గురించి ఏమీ తెలియకుండా
ఆ ప్రేమ వలలో పడిపోయి ఆ తర్వాత జరగరానిది ఏదైనా
జరిగి లబోదిబోమంటున్నారు.
ఇప్పుడు ఉన్న యువతను నేను విమర్శించటం లేదు.
అప్రమత్తంగా ఉండమని
మాత్రమే హెచ్చరిస్తున్నాను.
తెలిసీ తెలియని వయసులో
ప్రేమ అనే వలలో చిక్కుకుని
ఆ తర్వాత బయటకు రాలేక
వారి భవిష్యత్తు పాడయిపోయి
డిప్రెషన్లో పడిపోయి ఆ తర్వాత
ఆత్మహత్యలకు పాల్పడుతున్న
యువత ఎందరో. అందుకే నేను ప్రేమ లేఖలను ప్రమాద ఘంటికలు అంటున్నాను.
కొంచెం అప్రమత్తంగా ఉంటే
యువత ఆ ప్రేమ లేఖలను
శుభలేఖలుగా కూడా మార్చు
కోవచ్చు.
ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని