ఈ వర్షం సాక్షిగా

ఈ వర్షం సాక్షిగా

ఈ వర్షం సాక్షిగా

వర్షం పడిన ప్రతిసారి నువ్వు నాతో ఉన్నావు
ఆ గొడుగులు నీ పక్కన నిలబడిన ప్రతిసారి
నువ్వే నాకు ధైర్యం తోడు అనుకున్న
ఆ వర్షం మనల్ని కలిపింది అనుకున్నాను
కానీ ఆ వర్షంలోనే నువ్వు నాకు దూరం అవుతావని అనుకోలేదు
ఈ వర్షం సాక్షిగానే మనం కలిసినా
ఈ వర్షం సాక్షిగానే నువ్వు నాకు దూరమయ్యావని
బాధపడిన క్షణం లేదు
ఆ గొడుగులో ఒక్కదానిగా మిగిలిపోయాను..
వర్షంలో నడిచిన ప్రతిసారి నువ్వున్నావని ధైర్యంతో
ఆ వర్షంతో ఆటలాడే దాన్ని
ఇప్పుడు అదే వర్షంలో నేను ఒంటరిగా వెళ్తుంటే నువ్వు నా పక్కన లేవు అనే బాధ తప్ప
ఈ వర్షం సాక్షిగా నువ్వు నాకు దూరమయ్యావు అని తలుచుకుంటేనే
నాకు ఈ వర్షం మీద కోపం వస్తుంది
కానీ ఆ కోపాన్ని చూపించలేదు
నువ్వు నాకు దూరమైన సరే నా పక్కనే ఉన్నావని అనుకుంటూ
నువ్వు ఇచ్చిన ధైర్యంతో ముందుకు అడుగు వేస్తూ
ఒంటరిగా జీవితం గడిపేస్తున్నాను..

ఈ వర్షం సాక్షిగా

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *