ఉ!!మా!!🚩💐🪷

ఉ!!మా!!🚩💐🪷

ఉ!!మా!!🚩💐🪷

మాటలచేత పండితులు మాయలు జేయుచు కీర్తిపొందగన్
మాటలు రువ్వ జానలకు మండిత కానుక లిచ్చుచుండగన్
మాటలు విన్న భూపతులు మాన్యములెల్లను పంచిపెట్టగన్
మాటలు చెప్పకుండినను మన్నుట కష్టము భూతలమ్మునన్!!

పుణ్యము రాదు దేవుడికి పొందుగ దండము బెట్టినంతనే
పుణ్యము రాదు మిక్కిలిగ పూజలు చేసిన దైవసన్నిధిన్
పుణ్యము వట్టిమాటలుగ బోధన జేసిన రాదురాదులే
పుణ్యఫలమ్ము దక్కునట పోషణ జేసిన పేదవారినిన్!!

కాకరపుల్లవోలె తను కాలుచు క్రాంతిని బంచుచుండునే
కూకటివేళ్ళతోడ తను కూలుచు పిల్లల కాచుచుండునే
ఆకలి గొన్నవేళతను యప్పటికప్పుడు బొజ్జ నింపి యా
చాకలి కన్న మిన్న గను చక్కని సేవలు గూర్చునమ్మరో!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *