ఉ!!మా!!🦉🦉🦉
మబ్బులలోకి సూర్యుడట మారెడి వేళను మాతలెల్లరున్
గబ్బున చంటిబిడ్డలను కాచిరి నీ పొడ కానినంతనే
అబ్బురమయ్యె నాకును మహాత్ముడ! చూడగ రాత్రులందునన్
గబ్బిలమా! మనోజ్ఞములు గావె భవద్రమణీయ వీక్షణముల్!!
తే!!గీ!!🦉🦉🦉
కారుచీకట్లు క్రమ్మిన కానలోన
నిబ్బరమ్ముగ వేటాడు నేర్పరీడ
సకల జీవుల వర్ణించు సుకవిటులనె
గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గాదె!!
గడ్డం కృష్ణారెడ్డి