అక్షర కొరకు
అంశం: ఏయ్ చాయ్ !! ఇటురా !!( చిత్రకవిత)
శీర్షిక: ఉల్లాసంగా…. ఉత్సాహంగా…. చాయ్…..!!
ఏమి ఆ రుచి !? ఏమి రుచి రా!!
ఏమి ఆ చాయ్ రుచి బ్రదరూ !!
అరటాకు లాంటి సొగసరి నయన చకోరి చిన్నది………
చాయ్ కలిపి ఇస్తే అలా అలా ఆకాశంలో తేలిపోయే రంగు రుచి చిక్కదనం వహ్వా వహ్వా !!
ఆ తృప్తి జిహ్వ ఆనందం ముందు ఈ ఆకాశం ఈ ప్రపంచం చాలా చిన్నది……..!!
వెనుకటికి ఏదో మాయల మరాఠీ సినిమాలో విలన్ పాత్రధారి నిద్రిస్తున్న హీరోయిన్ మంచాన్ని లేపుకుని ఆకాశం గుండా ఎత్తుకుని పోతుంటే నిభిడాశ్చర్యంతో చూసినటుల.,………
చుట్టూర ప్రపంచంలో ఏం జరుగుతుందో! ఎలా వుందో! గమనించే స్థితిలో లేని మరులుగొని తేలిపోయేట్లు చేసిన తేనీటి పరిమళాల మాధుర్యంలో అదిగదిగో హిమశిఖరాలలో వెచ్చని చాయ్ రుచి……….
మనో తటాకంలో ఆకుపచ్చని అడవుల గుండా తేనీటి సెలయేరు ప్రవహిస్తున్నట్లు ఆహా చాయ్!! ఓహో చాయ్ !! ……..
ఏయ్ పిచ్చి నీచే దేఖో!! నీవు అరటాకుపై నీ ఇంట్లో కూర్చున్నావు, నీ ముందున్న సుకుమారి వయ్యారి జడవూపుతూ చిరు చిరు నవ్వుల చిన్నది నీ సతీమణి ఓ సారి కళ్ళు తెరువు !!
చాయ్ జీవితం విలువ తెలియజేసే మనోల్లాసంలో తేలియాడజేసే నల్లమందు…….
రేడియోలో…… ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…..అంటూ పాట వస్తుంది…..!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ కవిత నా స్వీయ రచన అని నా హామీ.