ఉల్లిపాయి ,గంజి పోసుకు తిన్నా….

ఆరోగ్యవంత ఖలు భాగ్య వంతః. అనేది నానుడి.

ఉల్లిపాయి ,గంజి పోసుకు తిన్నా ,నేల మీద తువ్వాలు వేసుకుని పడుకున్నా హాయిమన్న నిద్రవచ్చి గురకలు కొడుతూ నిద్రపోయినవాడే
అధిక సంపన్నుడు.

హంసతూలికా తల్పాలమీద పడుకున్న,తిన్నది అరగక,
బీ పీలు,షుగర్ లు,ఎప్పుడు
గుండాగిపోతుందో తెలియని హృద్రోగాలు వీటితో క్షణమొక యుగంగా గడిపే భాగ్యవంతులకు సుఖమెక్కడ ఉన్నది?

అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యాన్ని వదిలేసి ఏది పడితే అది తిని,కడుపు పాడుచేసుకునే వారికి ఈ
తిప్పలు తప్పవు.

అందుకునే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి ఆరోగ్యపు అలవాట్లు
చేయాలి.

మితాహారం,వేకువనే లేవటం, వ్యాయామం మొదలైన మంచి అలవాట్లు నేర్పితే ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది.

ఎప్పుడూ సంతోషంగా
ఉండటం,పరుల సొమ్ముకు ఆశపడకుండా,అందరి మంచి
కోరుతూ ఉండే వాళ్ళకు
అనారోగ్యం వారి చెంతకు రాదు.

చింతల్ని దూరంగా పెట్టి, భూతకాలం వదలి,భవిష్యత్ కోసం ఆలోచించక,
వర్తమానంలో ఉన్నవారే
భాగ్యవంతులు.

అప్పుడే వారికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

ఇది నా స్వంత రచన.

రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి
అంశం; ఆరోగ్యమైన మహాభాగ్యం
శీర్షిక: ఆరోగ్యవంతః ఖలు భాగ్యవంతః

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *