ఎద మీటిన రాగాలు !

నీ సాన్నిహిత్యం
మండు వేసవిలో
పువ్వుల వసంతాలు
వెన్నెలలు పూచిన పున్నమలు
మల్లెల మనస్వినులు!

హృదయం తెరిస్తే
గులాబీల గుభాళింపులు
అద్భుత రసస్వినులు
నీ మోము ఓ చంద్రలేఖ
గుండెల్లో గుబులు రేపు
సింధూర పెదవుల నగవులు
తేనెటీగల ఝుంమని రాగాలు
హృదయం లోతుల్లోంచి
కమ్మని తేనీయల ఊటల మాటలు
మనస్సు తెలిసినాకొద్ది
శతకోటి దృశ్యాలు
పెనవేయు బంధాలు
వేయి వేణువుల గళం
సాయం సంధ్య సమ్మిళితంలో
ఊహల ఉల్లాసంలో
పొడిచిన తొలి నెలవంకలా
అందనంత దూరం చేరువై
మన మిద్దరమే మరోలోకం!!

జీవితం ఎల్లప్పుడూ రసతుళ్యమే
ఆహ్లాదంగా పెనవేసుకున్న బంధాల్లో
ప్రతి వాక్కు సరిగమల సాన్నిహిత్యాలే
ముద్దు మురిపాలు ముంగిళిలో!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *