ఎన్నో ఆశలతో…మరెన్నో ఉహలతో…

శీర్షిక…వేచిన ఉదయం…

ఎన్నో ఆశలతో…
మరెన్నో ఉహలతో…
పంచరంగుల కలలు కంటూ
అందమైన జీవితాన్ని ఆహ్వనిస్తు..

నీ ఇంట అడుగుపెట్టిన నాకు
నా హృదయంలో ప్రేమ జల్లు
కురిపిస్తావని ఆశ పడ్డాను..

ఒకటోకటిగా…
బయటపడే నీ రాక్షసత్వం
నా ఉహలోకాన్ని…
చెదరగోడుతుంటే
మూగగా రోధించింది నా హృదయం..

నిన్నేంతో ఆరాధించే నన్ను
నీవెంత గాయపరిచిన సహించాను..

కానీ….!!
ప్రేమను పంచే నా హృదయాన్ని
గాయపరుస్తుంటే భరించలేక పోయ…

ఇంతకాలం ఆశగా చూసాను
నీలో మార్పు వస్తుందని…
అది అడియాసే అని అర్థం అవుతుంటే
మనసు తల్లడిల్లిపోతుంది…

ఇక కాలం కరిగిపోకముందే
నన్ను నేనుగా మార్పు చెంది
నా భవిష్యత్తు కాలానికై
అడుగులు వేస్తాను
నూతన ప్రపంచం వైపు….
అంకుష్…✍️
బెల్లంపల్లి
9908968536
_________

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *