ఎన్.శంకర్(రచయిత, నిర్మాత, దర్శకుడు)
నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. జయం మనదే రా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. 2011 సెప్టెంబరులో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.
గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో 1968 అక్టోబర్ 3 నా జన్మించాడు.
1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా , భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
తెలుగు
2 కంట్రీస్ (2017)
జై బోలో తెలంగాణా – (04.02.2011)
రామ్ -(30 మార్చి 2006)
ఆయుధం -(2003)
భద్రాచలం – (2001)
కన్నడ
నమ్మణ్ణ (2005)
నటుడిగా
రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యాడు.
అవార్డులు
నంది అవార్డులు
2011 లో సరోజినిదేవి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడు – ఎన్.శంకర్ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు – గద్దర్.
పదవులు
ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా
నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
గోవా ఫిలిం ఫెస్టివల్ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2018)
2020 సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో హైదరాబాదు నగరంలో వచ్చిన వరద నష్టానికి సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి శంకర్ 10లక్షల రూపాయల చెక్కును 2020 అక్టోబరు 22న మంత్రి కేటీఆర్ కి అందిచాడు.
మాధవి కాళ్ల
సేకరణ