ఎఫెక్టు

ఆఫీసుకు లేట్ అయిపోతుందని తొందరగా బాక్స్ ఇవ్వు అన్నాడు మదన్ ఆ వస్తున్నా అంటూ బాక్స్ తెచ్చి భర్త చేతిలో పెట్టింది మంజుల. భర్త మొహంలోకి చూస్తూ ఈ లాక్ డౌన్ లో కూడా మీరు ఆఫీస్ పనంటూ వెళ్ళడం ఎందుకండీ? అక్కడ వైరస్ కూడా బాగానే ఉందట అంది భయంగా మంజుల. అలా వైరస్ అని భయపడితే ఎట్లా ఇప్పుడీ సమయంలో ఎవరు రాక ఆఫీసు పని పెండింగ్ లో ఉండి దాన్ని పూర్తి చేస్తే నాకు డబ్బు ఇంక్రిమెంట్ పెరుగుతుంది దాంతో మన అప్పుల బాధలు కాస్తయినా తగ్గుతాయి మరి వేరొకరి పనులు కూడా నేను మొదలు పెట్టా దానికి కూడా నాకు డబ్బులు వస్తాయి ఇది ఇలాగే కొనసాగితే మన అప్పులన్నీ తీరినట్టే అన్నాడు మదన్ అతని మోహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి నిట్టూర్చి ఏమోనండి అన్ని తెలిసిన వారు, బయటకు తిరిగే వారు మీరు జాగ్రత్తగా ఉండండి, నేనేం చెప్పినా అప్పుల విషయం గుర్తు చేసి నా నోరు మూయిస్తారు అంటూ ఇదిగోండి ఇది దగ్గర పెట్టుకోండి అంటూ సానిటైజర్ చేతికి ఇచ్చింది సరే మరి నేను వెళతా పిల్లలు,అమ్మ జాగ్రత్తగా ఉండండి అంటూ బైకు స్టార్ట్ చేసి వెళ్తున్న మదన్ ని పిలిచింది అతని ఎనభై ఏళ్ల తల్లి సావిత్రమ్మ,ఎంటమ్మ అంటూ దగ్గరికి రాగానే మదన్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ తిన్నావా బిడ్డా, పైలంగా పోయిరా నాయనా! అంటూ మొహాన్ని తలని తడిమింది.

ఆమెకి కళ్ళు మసగ్గా కనిపిస్తాయి తల్లిని చూస్తున్న మదన్ అమ్మ నా ఇంక్రిమెంటు పెరిగి, జీతం రాగానే నీకు మంచి టానిక్కులు, గోలీలు, తెస్తాను. మంచి పండ్లు, పాలు తెచ్చి తినిపిస్తా, కళ్ళ డాక్టర్ కి కూడా చూపిస్తా అని అనుకున్నాడు మనసులో కాని పైకి మాత్రం తిన్న అమ్మ మరిపోతా నాకు లేట్ అవుతుంది అంటూ బైక్ స్టార్ట్ చేసాడు. మదన్ ఒక మధ్యతరగతి వ్యక్తీ అతనికి ఒక తల్లి, ముగ్గురు పిల్లలు, భార్యతో సిటిలోని ఒక మారుమూల ప్రాంతంలో నివాసం ఉంటూ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అతను సంపాదించే పదివేలలో, పిల్లల ఫీజులు, తల్లి మందులు, ఇంటి కిరాయి, ఇవన్ని కావాలి. అతను సంపాదించే పదివేలు ఇలా రాగానే అలా ఎగిరిపోతాయి. ఈ మధ్యనే భార్యకు ఎదో జబ్బు చేసి అప్పు చెయ్యాల్సి వచ్చింది. దాంతో ఈ లాక్ డౌన్ లో కొన్ని రోజులు ఇంట్లో ఉన్నా, ఆ తర్వాత ఆఫీస్ వారు కొంత మంది ఉద్యోగులకు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో తమ అవసరాలు తీరుతాయనే ఆశతో చాటుమాటుగా పని చేస్తున్నారు. వివిధ కంపెనీలలో అలాంటి ఒక కంపెనీలోనే మదన్ కూడా చేస్తున్నాడు బైక్ ఆఫీస్ లోకి పోనిచ్చి పార్కింగ్ లో ఆపాడు మదన్.    

ఏరా నీకు ఈ సంగతి తెలుసా నీ పక్క బెంచ్ లో పనిచేసే సుందర్ కు కరోన వచ్చిందంట అంటూ చెప్పాడు రాజు. బండి దిగుతున్న మదన్ అలాగే ఆగిపోయాడు ఒక్క క్షణం అవునా ఎవరూ చెప్పారు అన్నాడు తాళం వేస్తూ. ఇదిగో వాడే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు. ఇంకో పది రోజుల వరకు రాడేమో, నిన్న ఇంటికి వెళ్తున్నప్పుడు అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుంటే ఈరోజు పొద్దున ఫోన్ కి మెసేజ్ వచ్చింది అంట హాస్పిటల్ కి రమ్మంటే ఖర్చుకు భయపడి రాన ని ఇంట్లోనే ఉంటాను అని అనడంతో ఊరుకున్నారట అన్నాడు సర్లే కానీ నువ్వు నిన్నంతా వాడితోనే ఉన్నావు కదా వాడిని తాకావా ఏంటి అన్నాడు రాజు మదన్ ని అనుమానంగా చూస్తూ ఏ చీ నేను వాడిని కనీసం ముట్టుకోలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు రాజు తన స్థానంలోకి వెళ్తూ మదన్ ని చూసి ఒరేయ్ ఎందుకైనా మంచిది నువ్వు కూడా ఒక్కసారి టెస్ట్ చేయించుకో  ఎందుకైనా మంచిది   మళ్లీ ఇంట్లో అమ్మ పిల్లలు ఉన్నారు నీకంటూ ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడు రాజు. ఆ చేయించుకుంటే ఏమొస్తుంది అయినా నా కెక్కడిది అది నాకు ఎందుకు వస్తది నేను వాడినీ ఏం తాకలేదుగా అని అనుకుంటూ తన పనిలో పడిపోయాడు మదన్ మధ్యాహ్నం వరకల్లా మదన్ కు చిన్నగా జ్వరం దగ్గు కూడా మొదలయ్యాయి.

 అయినా అలాగే పని చేస్తూ ఉండిపోయాడు మామూలు జ్వరమే అని అనుకుంటూ కానీ సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు కూడా మొదలయ్యాయి పని చేయలేకపోయాడు ఇక తన వల్ల కాదని అనిపించి శరీరం సహకరించదని తెలుసుకొని మదన్ ఆఫీస్ నుండి బయటకు వచ్చి బైక్ దగ్గర నిలబడ్డాడు ఒక్క నిమిషం ఇంతలో ఇంటి నుండి భార్య ఫోన్ చేసింది వస్తున్నారా అంటూ, తొందరగా రమ్మంటూ ఆ వస్తున్నా అని చెప్పిన మదన్ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా అని తెలిస్తే నన్ను హాస్పిటల్లో చేరమంటారు నేను హాస్పిటల్లో చేరితే నా వైద్యానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు ఎవరు పెట్టుకుంటారు అసలే అప్పుల్లో ఉన్నాo ఇప్పుడు పులిమీద పుట్రలా ఇదొకటి వస్తే ఎట్లా పని ఎవరు చేస్తారు పని లేక నేను హాస్పిటల్లో జాయిన్ అయితే జీతం రాదు పిల్లలు తల్లి భార్య ఆకలితో పస్తులు ఉంటారు నా తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరు ఇంటి కిరాయి సామాను కరెంటు బిల్లులు ఎవరు కడతారు ఇంటి యజమాని కి ఈ విషయం తెలిస్తే అతను ఊరుకుంటాడా ఇల్లు ఖాళీ చేయమని అనవచ్చు.

అవును ఈ మధ్య చాలామంది ఇలాగే అంటున్నారట అవును అతను కూడా ఏం తక్కువ కాదు అలాగే అంటాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి కానీ నేను హాస్పిటల్ లో ఉంటే ముసలి తల్లి భార్య పిల్లలు రోడ్డుమీద కి వస్తారు వారిని రోడ్డుమీద నిలబెట్టాల్సి వస్తుంది. తాము లేకపోవడం వల్ల ఎన్ని జరుగుతాయి పాపం నా భార్య అమాయకురాలు దానికి ఏమీ తెలియదు నలుగురిలోనూ తిరగలేదు నేను ఆసుపత్రి అనగానే బెంబేలు పడుతుంది తల్లిని పిల్లలను సముదాయించలేక ఇంట్లోకి తెచ్చిపెడితే చేసి పెడుతుంది దానికి ఏది ఎంతో కూడా తెలియదు ఇది వచ్చింది అని తెలిస్తే ఒకవేళ టెస్ట్ చేయించుకుంటే ఉందని అంటే మా పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది అటు అప్పులవాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు వారికి కావాల్సిన డబ్బే తప్ప మన గురించి వారికి అనవసరంగా పాపం వాళ్ళు మాత్రం తనకి సమయానికి ఇవ్వలేదు వారిని అని ఏమి లాభం లేదు కానీ ఇప్పుడు ఎలా మరి నేను టెస్ట్ చేయించుకోవాల్సిందే నా అని అనుకున్నాడు అవును చేయించుకోవాలి లేదంటే నేను ఇంట్లోకి ఇలాగే వెళితే నా తల్లి నా పిల్లలకు కూడా వస్తుంది కానీ ఈ విషయం తెలిస్తే ఇంటి యజమాని కి తెలిస్తే ఖాళీ చేయమంటాడెమో, ఖాళీ చేస్తే ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్దాం అంటూ టెస్ట్ చేయించుకుని వీలు లేదు ఇటు తెలిస్తే ఇల్లు ఖాళీ  చే యిస్తాడేమోనని భయం.

 అయ్యో ఇప్పుడు ఎలా పోనీ బ్రతిమాలడం అని అనుకున్న ఈ టైం లో ఎవరు వినరు హాస్పిటల్లో చేద్దామన్న ఆలోచన ఈ ఆలోచన లోనే ఇంటికి వెళ్ళాడు మదన్ భర్త అలా ఉండడం చూసిన భార్య ఏమైంది అని అడిగితే ఏదో చెప్పి అప్పటికి ఊరుకున్నాడు తెల్లారి పొద్దున్నే తనంతట తానుగా ఆస్పత్రికి వెళ్లాడు ఏమైతే అయిందని అనుకుంటూ ఆసుపత్రిలో తొందరగానే టెస్ట్ చేశారు కానీ రిజల్ట్స్ కు రెండు రోజులు ఆగాలి అనడంతో తాను అన్ని రోజులు ఆగలేని డబ్బుతో కాంపౌండర్ కి ఇవ్వగానే వాడు ఐదు నిమిషాల్లో రిజల్ట్స్ పేపర్ చేతిలో పెట్టాడు కొయ్యబారిపోయాడు అందులో కరోనా లేదని ఉంది అమ్మో దానికా నేను ఇంతగా  భయపడింది ఆలోచించింది ఎంత భయపెట్టింది కరుణ మామూలు జరుగు జ్వరాన్ని నేను కరుణ అనుకున్నా ఇంకా నయం వెళ్లి ఆత్మహత్య చేసుకోలేదు చేసుకుని ఉంటే నిజంగా నా కుటుంబం బజారున పడేది నా పిల్లలు దిక్కులేని వారు అయ్యేవారు ఏదో మొండి ధైర్యంతో నిన్న అలా ఉండబట్టి ఇప్పుడు నిజం తెలిసింది అదే నిన్న రాత్రి తాను ఆలోచించినట్లు ఆవేశం తో ఏదైనా లారి కింద పడితే ఎలా ఉండేది,రాత్రి నా మనసు లో అనుకున్నట్టుగా నేను చచ్చిపోతే ఎట్లా ఉండేది?ఒక పది నిముషాలు నేను లేట్ చేయబట్టి నా మనసు మర్చుకోబట్టి సరిపోయింది కానీ అదే నా మనసు స్థిరపరుచుకోబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను నా పిల్లలను కడసారి చూసుకోవాలి అని అనుకోబట్టి రాత్రి ఇంటికి వెళ్లాను కాని ఎదురుగా ఉన్న లారి ని గుద్దుకుని ఉంటె ఎలా ఉండేది అమ్మో నా తల్లిని,నా భార్యను ఎవరు చూసుకునే వారు లేరు నాకు అన్నదమ్ములు,అక్కాచెల్లెలు కూడా లేరు,బంధువులు కూడా పట్టించుకోరు,పెడితే తిని వెళ్ళే వాళ్ళు తప్ప తన వారిని ఆదుకునే వారు లేరు అనే ఆలోచన ఎంతో బాధని కలిగించింది అలా జరిగి ఉంటె …?

అమ్మో నా కుటుంబం నా పిల్లలు అనాధలయ్యే వారు ఏదో తెలియని శక్తి నన్ను నిన్న కాపాడింది లేకపోతే ఈ సమయానికి నా శవం ముందు నా వాళ్ళు ఏడుస్తూ ఉన్దేవారేమో లేదా  ప్రొద్దున్నే పేపర్ లో ఏదో మూల గుర్తు తెలియని శవం అని వచ్చేదేమో అనే పిచ్చి పిచ్చి ఆలోచనలో నుంచి తల విదిలించాడు ఆలోచనల్ని పక్కనపెట్టి ఆనందంగా బైక్ ఎక్కి ఇంటికి వచ్చాడు ప్రొద్దున అనగా వెళ్లిన భర్త ఇంకా రాకపోవడంతో మంజు బయట ఎదురుచూస్తుంది భర్త కోసం బైక్ ఆగగానే ఏమైంది అండి అంది,నిన్నంతా తన ప్రవర్తనతో భార్యని బాధ పెట్టాను అని భావించిన  మదన్  ఏమి లేదని  భార్యని గట్టిగా కౌగిలించుకున్నాడు అక్కడే  మంజుల సంతోషంగా ఉంది భర్త కౌగిలిలో  మైమరచి పోయింది మంజుల ఒక చిన్న భయం  నా కుటుంబం  బాగుండాలి అనే ఆలోచన మనిషిని ఎంత పనికి అయిన పునుకునేలా చేస్తుంది.ఎంతటి సమస్య అయినా తట్టుకునేలా చేస్తుంది కుటుంబం కుటుంబం గురించి ఆలోచనే మనల్ని బతికేలా చేస్తుంది మదన్ రాత్రి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబం దిక్కులేని అయ్యేది కానీ తన మొండితనం అతన్ని ఆగే లా చేసి కుటుంబానికి దూరం కాకుండా చేసింది, ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి అని అంటారు అందుకే పెద్ద వారు చిన్న విషయాలకే ఆగం అయ్యి,తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ముందు ఒక్క పది నిముషాలు ఇది ఎందుకు చేయాలి మనం ? దీనికి పరిష్కారం లేదా ? అసలు ఒక్క శాతం కూడా అవకాశం లేదా ? అనేది ఆలోచించాలి అదే మనం చేయవలసిన పని ఒక్క అయిదు నిముషాలు ఆలోచించండి…. దయచేసి ఆవేశం లో ఏ నిర్ణయం తీసుకోకండి …..

—- భవ్య చారు

Related Posts