ఎలర్జీ

మధు, మానస లకు పెళ్ళై మూడు నెలలు గడుస్తుంది. ఇంకా ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోలేక పోయారు. మానస తల్లి దగ్గర వంట బాగానే నేర్చుకుంది. ఆమె వంట చేస్తుంటే, లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు మాధవ్. అలా మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి సంసారం సాగి పోతుండగాఒక రోజు పక్కింటి బామ్మ గారు కూరగాయలు వెళ్తూ మానస ని కూడా రమ్మని ఆడిగింది.

ఆడిగిందే భాగ్యం అని అనుకుని బయల్దేరి వెళ్ళింది మానస దానికి కారణం ఇంట్లో కూరగాయలు ఏమి లేక పోవడమే ఒకటి అయితే మర్నాడు తన మామయ్య గారు వస్తున్నారు అని ప్రొద్దున్నే మధు చెప్పడమే, సరే బామ్మగారితో కలసి కూరగాయలకు వెళ్లిన మానస కు మార్కెట్లో నవ నవలాడుతూన్న వంకాయలు కనిపించాయి. అవి చూడగానే నోరు ఉరిపోయింది మానసకు, దాంతో రెండు కిలోల మంచి లేత కాయలను ఏరి బేరం ఆడి మరి కొన్నది.

మానసకు వంకాయ అంటే చాలా చాలా ఇష్టం దాన్ని ఎన్ని రకాలుగా వండలో అన్ని రకాలు అమ్మ దగ్గర నే కాకుండా పక్కింటి, ఎదురింటి వారి దగ్గర కూడా నేర్చుకునేది పట్టు బట్టి మరి, వాటితో రోజు మొత్తం తినమని అన్నా తింటుంది. ప్రతి దాంట్లోను వంకాయ వేసుకుని తింటుంది అంత ఇష్టం వంకాయ అంటే, అలాంటి మానస వంకాయలు తీసుకుని బామ్మగారితో ముచ్చట్లు పెడుతూ, వేరే కూరగాయలు కొన్నాను అంటే కొన్నాను అన్నట్టుగా తీసుకుంది.

ఇంటికి వచ్చిన మానస కు మధు ఫోన్ చేసి తన తండ్రి రావడం లేదని, వేరే పని ఉండడం వల్ల రాలేక పోతున్నాడు అని, మానస మనసులో సంతోషం ఫీల్ అయ్యింది, బయటకు మాత్రం అయ్యో అవునా అంటూ విచారం వ్యక్తం చెందింది, సంతోషం ఎందుకంటే వంకాయల్లో సగం మిగులుతాయి, తాను తినొచ్చు అని, పాపం వంకాయలు అంటే ప్రాణం అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమి లేదు పిచ్చి మొహానికి..

రోజు రాత్రి వంకాయ పచ్చడి చేసి, మంచి కారం కూరిన గుత్తి వంకాయ కూర చేసింది మానస, వండుతూ వండుతూ రుచి ఎలా ఉందొ అని చూస్తూనే సగం కూర అయిపోయింది. అన్ని రెడి చేసి మధు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. గంట అయ్యాక మధు ఆఫీసు నుండి వచ్చాడు. అతను ఫ్రెష్ అయ్యి, వచ్చే సరికి ఇద్దరికి కంచాలు పెట్టింది మానస, కంచం ముందు కూర్చుంటూ ఏంటి ఈరోజు ఏమి వండావు అన్నాడు, ఏమండీ మీకు ఇష్టం అని గుత్తి వంకాయ కూర చేసాను, చాలా బాగుంటుంది అంటూ సగం కూరని కంచంలో వేసింది మానస.

అది  చూడగానే వాంతి వచ్చినట్టు అయ్యింది మధుకు, కారణం అందరూ అత్యంత ఇష్టంగ, కావాలనుకునే తినే, అందరికి ఆప్తురాలిగా ఉన్న, ఆంధ్ర, తెలంగాణ అనే తేడా లేని, అమెరికా, ప్రవాస దేశీయులందరు కూడా ఇష్టపడే గుత్తి వంకాయ కూర మధుకు మాత్రం ఇష్టం లేదు.

దానికీ కారణం ఏమైనా కూడా, అతనికి మాత్రం కూర అంటే కాకరకాయ అంతా చేదు అన్నమాట, కానీ కొత్త భార్య, కొత్త కాపురం, పైగా మధుకు మొహమాటం ఎక్కువ కావడం వల్ల, వేరే ఏమి మాట్లాడక, తన కూర బాగుందా, లేదా అని మధు ఏమంటాడో అనే ఆత్రుత ఆమెలో చూసిన మధు ఏమి మాట్లాడకుండా గబగబా కూరని అన్నంలో కలిపేసి, ముద్దలు, ముద్దలుగా నోట్లో కుక్కుకున్నాడు.

అది చూసిన మానస  తన కూర భర్తకి బాగా నచ్చింది అని ఆనుకుంది. అలా వంకాయ కూర వారం రోజులు రోజు నాలుగు వెరైటీ లుగా చేసి భర్తకి పెడుతూ, తాను కూడా తింటూ, రుచిని ఆస్వాదిoచసాగింది మానస. పాపం మధు మాత్రం భార్యకు చెప్ప లేక, ఇష్టం లేని కూర తినలేక తనలో తానే మదన పడసాగడు. పైగా టిఫిన్ కు, లంచ్ లోను, స్నాక్స్ గా, రాత్రికి డిన్నర్ లోను కూడా అదే కూరను వెరైటీగా చేయసాగింది మానస.

వారం తర్వాత వంకాయ కూర పడక, మొఖామంత దద్దరు వచ్చి,  వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ లో జాయిన్ అయిన మధుని చూడడానికి ఊరు నుండి తల్లిదండ్రులు వచ్చారు. పాపం మానస భర్తకు ఏమయ్యిందోనని కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ కూర్చుంది హాస్పిటల్ బయట, అత్త మమయ్యాలని చూడగానే ఇంకా ఏడుపు ఎక్కువయ్యింది, పాపం కోడలు బాధ ని చూడలేని మామయ్య గారు డాక్టర్ దగ్గరకు వెళ్లి తన కొడుకు పరిస్థితి గురించి అడిగారు.

ఏమయ్యా అతనికి ఇష్టం లేదని, అలర్జీ అని తెలుసి పడని వస్తువులు పెడతారా, అది తినే అతనికి అలా అయ్యింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, భయపడకండి, రెండువరోజుల్లో ఇంటికి తీసుకుని వెళ్ళండి అన్నాడు, దాంతో బయటకు వచ్చి, ఏమి తిన్నాడు అని అడిగాడు కోడల్ని మామగారు..

అయ్యో మామయ్య గారు మీరు వస్తారని, ఇష్టం అని వంకాయలు తెచ్చాను, మీరు రాకపోవడంతో ఆయనకు వండి పెట్టాను, ఎంత చక్కగా తిన్నారో, ఇంతిo ముద్దలుగా చేసుకుని ఇష్టాంగ తిన్నారు, పాపం ఇలా అయ్యింది అంది ముక్కు చిదుతూ మానస,… 

కొడుకు మోహమాటనికి, కోడలు అతి మంచి తనానికి నివ్వెరపోయిన మామగారు, అత్తగారు మానసని దగ్గర కూర్చోబెట్టుకుని వివరంగా మధు గురించి, అతని అలవాట్ల గురించి చెప్పారు, దాంతో మానసకు తాను చేసిన తప్పేంటో అప్పుడు అర్థం అయ్యి, తల దించుకుంది. ఇక వారింట్లో ఎప్పుడూ వంకాయ కూర చేయలేదు అని సపరేట్ గా చెప్పాలా మీకు అర్థం అయ్యే ఉంటుంది కదా…..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *