ఏడుకొండలవాడినేమి అడిగేము తన చూపుఒకటే చాలని వేడేము

తిరుమల గీతావళి

పల్లవి
ఏడుకొండలవాడినేమి అడిగేము
తన చూపుఒకటే చాలని వేడేము
చాలదా ఈ జన్మకు అది యొకటేమాకు
చింతలు దిగులు ఇకపైన ఉండవు

చరణం
చిలిపి నవ్వులవాడు మా శ్రీనివాసుడు
మమతలను కురిపించు మా స్థిరనివాసుడు
కష్టాలు కన్నీళ్లు ఎన్నివచ్చిననేమి
తనదివ్య నామమే దాటించు మమ్ము
కలియుగ దైవమై కాపాడు స్వామికి
ఏమివ్వగలము
తీరని ఋణమండీ స్వామితో మాకు

చరణం
కాలమెంతగ మమ్ము దండించితేనేమి
దయ చూపు ప్రభువు మా వెంట ఉన్నాడు
అభయమిచ్చేవాడికేమివ్వగలము
దండాలు దండిగా అర్పించుతాము
స్వామి రూపము మనము వీక్షించినంతనే
మనసేమో పులకించు..తనువేమో తపియించు

చరణం
ఎక్కడెక్కెడి వారు వస్తారులెండి
ఒక్క క్షణమైనా చూస్తాడు స్వామనుచు
మురిసిపోతుంటారు..కదిలిపోతుంటారు
తన చూపుతోనే పరవశిస్తుంటారు
తన దివ్యనామమును గానమే చేస్తూ
జీవితము ధన్యమని సంతసిస్తుంటారు

సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *