ఏడుకొండల వాడా…వడ్డికాసుల వాడా ఏలేలరా

ఏడుకొండల వాడా ఏలేలరా నీవు
అంతెత్తు ఎక్కినావు …

వడ్డికాసుల వాడా ఏలేలరా నీవు అంతప్పు చేసినావు …

ఆపద మ్రొక్కల వాడా ఏలేలరా నీవు వడ్డీలన్ని మాకాడ గుంజేవు .

తిరుమల శ్రీనివాసుడా ఏలేలరా నీవు లక్ష్మీ మాతను అడగవు..

ఏడు కొండలపైన వేంచేసిన వాడా
ఎలేలరా నీవు మా కంటి కందవు ..

భక్తరక్షుకుడా గోవిందుడా ఏలేలరా నీవు భక్తులకే లొంగెదవు..

వైకుంఠ వాసుడా ఆపన్నుడా ఏలేలరా నీవు కలియుగ వాసుడవు …

కొండల్లో కొలువైన వాడా ఏలేలరా
నీవు మా కోర్కెలన్ని తీర్చేదవు ..

అలమేలుమంగమ్మ తల్లి నా బిడ్డాల కోర్కేలు తీర్చు మనసు పోరేనా .

తనయులకు తీర్చవయ్యా కోరికలంటూ అల పద్మావతి అలుక బూని సాదించెనా ….

సతుల ప్రేమ మీర నీవు ఏలేలనో వెలసితివా మాకై ఆ కొండల పైనా ..

ఏటేటా నీ మ్రొక్కులను భక్తితో తీర్చెదమయ్యా కరుణేల రావయ్యా కలియుగ వైకుంఠుడా …

ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *