ఏది గొప్ప?

మనసు వెళ్ళిన ప్రతి చోటుకు మనం వెళ్ళ లేము అలాగే చుసిన ప్రతి దాన్ని కావాలి అనుకోలేము  అనుకున్న దాన్ని పొందలేము కోరుకున్న దాన్ని దక్కించుకోలేము.

వీటికి కారణాలు ఏమైనా అవ్వొచ్చు ,పరిస్థితులకి తలోగ్గల్సిందే ఎప్పుడైనా  కాదంటారా ,అలాoటి ఒక కథే ఈ ఏది గొప్పా కథ….

అదొక మాములు మధ్య తరగతి ఇల్లు .దాని యజమాని నారాయణ ,పార్వతి గార్లకు నలుగురు సంతానం,కాకపోతే అబ్బాయి కావాలనుకుని అమ్మాయిలను కన్నారు.

గంగ, మంగ ,నర్మద అనే పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా కాకున్నా ఉన్నంతలో బాగానే చూసుకున్నారు, నారాయణ తన  ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు,

 

ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి లేకుండా గుట్టుగా బతకడం అలవాటుగా మారింది వారికీ.

 

ఇక పిల్లలలో గంగ డిగ్రీ వరకు చదువుకుంది,తన తెలివి తేటలతో ఒక చిన్న బళ్ళో పంతులమ్మ గా చేరింది, ఇద్దరు చెల్లెళ్ళు ఇంటర్ ఒకరు, పదో తరగతి ఒకరు చదువుతున్నారు,

 

వాళ్ళు కూడా చిన్నగా ట్యూషన్ చెప్తూ ఏంతో కొంత సంపాదించుకుంటున్నారు తమ పెళ్లి కోసం, ఇక గంగ పని చేసే బడిలో రాజేష్ కూడా ఒక ఉపధ్యాయుడు గంగను చూడగానే ప్రేమలో పడ్డాడు.

 

అది ఆమెకి చెప్పడానికి చాలా రోజులు పట్టింది,దాన్ని గంగ కూడా ఒప్పుకోవడానికి కూడా సమయం తీసుకుంది. తమ ఇంట్లో అలాంటి ప్రేమను ఒప్పుకోరని అనుకున్నా,

 

అతని నిజాయితీ చూసి,తన ప్రేమలో నిజం ఉందని గ్రహించి,ఎలాగైనా పెద్దవాళ్ళని ఒప్పించుకుంటాను అనే నమ్మకం తో ఆమె అతని ప్రేమని ఒప్పుకుంది..

 

ప్రేమలో పడ్డాక సమయమే తెలియదు అంటారు,అలా సమయం గడిచిపోయింది,వాళ్ళు ప్రేమలో పడినా ఎప్పుడు సినిమాలకు,షికార్లకు తిరగలేదు,చిలిపి పనులు చేయలేదు, హద్దులు మీరలేదు, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్నంతగా అల్లుకు పోయారు,.

ఒకరి కష్టాలు,ఒకరు పంచుకున్నారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఒకరి ఇష్ట ఇష్టాలు తెలుసుకుని ,ఒకరికి ఒకరు అనుకూలంగా మారారు,ఒకరి ప్రాణం ఒకరు దేహంగా మారిపోయారు,ఇలా మూడేళ్ళు వాళ్ళు గాడంగా ప్రేమించుకున్నారు.

 

గంగ ప్రేమలో పడిన సంగతి ఎవరికీ తెలియ కుండా జాగ్రత్త పడింది. తెలిస్తే నలుగురిలో చులకన అవుతాము అనే భయం తో,అలాంటి సమయం లో ఒక రోజు  గంగ తల్లి పార్వతి కి దూరపు చుట్టం  వరుసకు అన్నయ్య అయిన పరమ శివం పార్వతిని వేతుక్కుంటూ వారి ఇంటికి వచ్చాడు.

 

అతని రాక కు అందరూ చాలా సంతోషించారు.కారణం వారికీ బoధువులు ఎవరూ వారి ఇంటికి ఎప్పుడూ రాకపోవడమే,వారి ఆర్ధిక స్థితి ని చూసి ఎవరూ వారికీ విలవని ఇవ్వరు.

 

పైగా ముగ్గురు అమ్మాయిలే కావడం తో వారికీ ఎక్కడ సంబంధాలు చూడాల్సి వస్తుందో అనే భయం తో ఎవరూ వాళ్ళని పలకరించరు.

 

అలాoటి సమయం లో వారిని వెతుక్కుంటూ వచ్చిన పరమశివాన్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు వాళ్ళు,తనని చూసి లేని పోనీ మర్యాదలు చేస్తున్న వారిని చూసి,వారిని వారించి, తనకు ఆ మర్యాదలేమి వద్దన్నాడు పరమ శివం.

 

అయ్యో అదేంటి అన్నయ్య రాక రాక వచ్చావు  నీకు ఈ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా అంది పార్వతి.

 

అమ్మా పార్వతి నేను నిన్ను ఒక సహాయం కోరడానికి వచ్చాను.అలా అని మిమల్ని కించ పరచడానికి కాదు, మీరు నాకు ఆ సహాయం చేస్తే మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నాడు, 

అయ్యో అన్నయ్య మాకు ఉన్న వారిలో నువ్వే మా మంచి కోరే వాడివి, కాబట్టి నువ్వు మా మంచికే  చెప్తావు అనే భరోసా మాకుంది బావ ఏంటో చెప్పండి అన్నాడు నారాయణ కూడా భార్యకు వంత పాడుతూ…

చూడండి నాకు మీరంటే చాలా అభిమానం, పార్వతి తల్లి నన్ను సొంత కొడుకులా చూసింది కాబట్టే మీకు సహాయం చేయాలనీ ఇంత దూరం వచ్చాను అన్నాడు పరమ శివం.

నేను చెప్పే విషయాన్నీ బాగా అలోచించి నిరయం తీసుకునేది, అలా అని మీకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు ఇక విషయాన్నీ చెప్తాను వినండి, మా ఊర్లో మనవాడె అయినా ఒక గొప్ప మనిషి ఉన్నాడు, తనకి పెళ్లి అయ్యిన తర్వాత, భార్య పిల్లాన్ని కంటూ చనిపోయింది

భార్య చనిపోయిన భాదలో తాగి  వస్తూ ఉండగా లారి గుద్దేసి ఒక చెయ్యి విరిగిపోయింది, దాంతో దీనంతటికి కారణం  అ బాబే అని వాడిని సరిగా చూడలేకపోయేవాడు. అతని అవస్థ తెలిసిన నేను చెప్పగా చెప్పగా చివరికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.

అతని గురించి చెప్పాలి అంటే చాలా అంచి వాడు, ఎ అలవాట్లు లేని వాడు, ఒంటరి వాడు,మనసు కూడా వెన్న అలానే కాస్త వెర్రివాడు కూడా, దానికి తోడూ బంధువులందరూ అతన్ని మంచితనాన్ని డబ్బు చేసుకుంటూ ఉంటారు, పాపం ఆస్తినంతా కాజెయ్యాలని చూస్తున్నారు,

మీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అందులో ఎవరినైనా ఒకర్ని ఇచ్చి తనకి పెళ్లి చేస్తే మీకు కొంచం చెయ్యి తిరిగినట్టు గా ఉంటుంది.మిగతా వారికీ  మంచి సంబoధాలు  కూడా  పెళ్లి  చేయొచ్చు,

ఇక మీ నిర్ణయం మీదే కానీ అమ్మాయి అయితే సుఖపడుతుంది, బయట సంబంధాలకు లక్షల్లో ఇవ్వాలి ఆలోచించండి అని చెప్పాడు పరమ శివం.

నారాయణ ,పార్వతి ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.పరమ శివం చెప్పింది నిజమే,తమకు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసే తాహతు లేదు, ఒక అమ్మాయి పెళ్లి చేయడమే గొప్ప, 

అలాంటిది ముగ్గురి పెళ్ళిళ్ళు చెయ్యడం అంటే కష్టం,అలా అని ఎందుకు కన్నారు అంటే ఆడపిల్లలు పుడతారు అని ఎవరూ ముందే అనుకోరు కదా , 

వారిని అన్ని విధాల  బాగా చూడాలి అనే కదా వారిని చదివిస్తుంది కానీ చూస్తూ చూస్తూ రెండో సంభధానికి ఎలా ఇచ్చి చేస్తారు, ఒకవేళ చేద్దాం అని అనుకున్నా పిల్లలు ఒప్పుకోవద్దు.

తమని రెండో పెళ్లి వారికీ ఇస్తున్నావు అని తనని తిట్టరు అమ్మో వాళ్ళు తనని ఏమైనా అంటే తను బతక గలడా ?

అదే విషయాన్నీ పరమ శివానికి చెప్పాడు నారాయణ నాకూ ఏ అభ్యంతరం లేదు,కానీ నా పిల్లలకు నేను ఆ మాట చెప్పలేను అలా అని వారికీ మంచి వాళ్ళని తేలేను అంటూ తన అశక్తత ని తెలిపాడు,

బావ నువ్వు ఒప్పుకున్నావు కదా ,ఇక నీ పిల్లలని ఒప్పించే భాద్యత నాది అంటూ ఆ బాద్యత కూడా తనే తీసుకున్న పరమశివం ,

ఆ రాత్రి అన్నాలు తిన్నాక గంగ,మంగ,నర్మద లను ఆరుబయట వెన్నెల్లో కూర్చోబెట్టి ఉన్న విషయం మొత్తం చెప్పి, అమ్మలు నిర్ణయం ఇక మీదే మీలో ఒక్కరు చేసిన త్యాగం వల్ల మిగతా ఇద్దరు సుఖంగా ఉంటారు ,

దీన్ని త్యాగం అని అనుకోకపోతే మీరు కూడా సుఖపడతారు,గోప్పింటి కి కోడలుగా వెళ్తారు అని చెప్పి,మీ నిర్ణయాన్ని నాకు ఒక రెండు రోజుల్లో చెప్పండి అని అన్నాడు పరమ శివం.

ఆడపిల్లలు ముగ్గురు ఆలోచనలో పడ్డారు, 

అందులో గాబరా పడింది అంటే గంగనే  ఎందుకంటే రాజేష్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసి, సంబందాలు చుసారేమో అని ఒక పక్క భయం వల్ల ఆ రాత్రి నిద్ర పట్టలేదు,

తెల్లారి గంగ బాత్రూంలో ఉందని తెలియని తండ్రి తల్లి తో గంగ ఈ పెళ్ళికి ఒప్పుకుంటే బాగుండు మిగతా పిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చు, మన గుండెల మీద బాధ్యత పోతుంది,

పోనీ నేను చెప్పాలి అని అనుకున్నా నన్ను వాళ్ళు ఏమనుకుంటారో,ఒకర్ని చేసుకోమని అంటే నేను స్వార్ధ పరున్ని అనుకుంటారు, నన్ను బలి పశువుని చేస్తున్నారా అంటూ వారు చూసే చూపులు నేను తట్టుకోలేను,అది కాక నన్ను వాళ్ళు ప్రశ్నిస్తారేమో అని భయంగా ఉందంటూ

భార్యతో అని ఎలా జరుగుతుందో చూద్దాం అని బయటకు వెళ్ళాడు నారాయణ. తల్లి కూడా వంట గది లోకి వెళ్ళిన తర్వాత ,బాత్రూం లో నుండి బయటకు వచ్చిన గంగ కూ కన్నీళ్ళు ఆగకుండా వచ్చాయి.

పాపం తన తండ్రి తనకి చెప్పలేక, అడగలేక ఎంత మధన పడుతున్నాడో అని,దీన్ని బట్టి అర్ధం అయ్యింది ఏమిటంటే రాజేష్ ,తను ప్రేమించుకున్న విషయం తండ్రికి  తెలియదు అనేది అర్ధం అయ్యి, స్థిరం అయ్యింది మనసు గంగకు ఇక అప్పుడే నిర్ణయించుకుంది తానేం చేయాలో …

ఆ తర్వాత బడికి వెళ్ళి, తామెప్పుడు మాట్లాడుకునే స్థలం లో రాజేష్ ని కలిసి విషయం అంతా చెప్పి, తన నిర్ణయం కూడా చెప్పింది. ముందు ఆమె నిర్ణయానికి ముందు ఆశ్చర్య పోయిన రాజేష్ ,

మరి నేనేం చేయాలి గంగ,ఇన్నేళ్ళ మన ప్రేమ వట్టిదేనా, నువ్వు లేకుండా నేను ఉండగాలనా,నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటె ఈ మాట అనేదానివా అన్నాడు ఆవేదనగా, అవును రాజేష్ నేను గుండెని రాయి గా చేసుకున్నా,మా నాన్నగారి స్థితి తెలిసిన ఇంటికి  పెద్ద కూతురి గా నా భాద్యతని పంచుకోవాలి అని అనుకుంటున్నా,

ఆయనకూ ఏ ఇబ్బంది కలగకుండా చూడాలి అని అనుకుంటున్నా, మా కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన ఋణం తీర్చుకోవాలి అని అనుకుంటున్నా ,కాబట్టే మన ప్రేమని వద్దు అని అనుకుంటున్నా,

నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివే అయితే ,నన్ను మర్చిపో అంది గంగ ఆవేశంగా, మన పెళ్లి వల్ల మనం సుఖంగా ఉంటె సరిపోదు, మన వల్ల  మనవారు కూడా ఆనందంగా ఉండాలి అని రాజేష్ వంక చూసింది గంగ.

ఆమె మాటల్లో తన మీద  ప్రేమ, తండ్రి భాద్యత, తను పంచుకోవాలి అనే స్థిరమైన అభిప్రాయనికి అచ్చెరుపొందిన రాజేష్,నీ ఇష్టం గంగ ,నేను వెళ్తున్నా కానీ నిన్ను నా జీవితం లో మర్చిపోలేను,

అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండను, నువ్వు సంతోషంగా ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉంటాను అని అంటూ చివరి సారిగా ఆమె వద్దకు వచ్చి ఆమెని దగ్గరగా వెళ్ళి ఆమె నుదుటి  మీద చిన్నగా ముద్దు పెట్టుకుని,కళ్ళనిండా ఆమె రూపాన్ని నింపుకుని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.   

వెళ్తున్న అతన్ని వెనక నుండి చూస్తూ కళ్ళనిండా కన్నీరు నింపుకుని ,అ మసక కళ్ళతో దూరవవుతున్న తన చెలికా డు ని చూస్తూ,గుండెలు పగిలేలా మనసులో ఏడుస్తుంది గంగ,

కానీ అంతలోనే తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని,బడినుండి ఇంటికి వెళ్ళింది.

సాయంత్రం పరమ శివం అమ్మాయి లు మీ నిర్ణయం చెప్తే నేను రాత్రి బండికి  వెళ్ళిపోతున్నా అని అన్నాడు అందర్నీ చూస్తూ,ముగ్గురూ ఒకర్ని ఒకరు చూసుకుని, తలలు వంచుకున్నారు,లోపలి గదుల్లో నారాయాణ ,పార్వతి కూడా వారి సమాధానం కోసం చూస్తున్నారు,

వాళ్ళెం చెప్తారా అని అందరూ ఉత్కంట గా అది గమనించిన  గంగ ముందుకు వచ్చి, మామయ్య మీరు అన్న దానికి నేను ఒప్పుకుంటున్నా, మీరెలా అంటే అలాగే అంది గంగ. ఆమె మాట విన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆమెని తలెత్తి చూసి,మళ్ళి తలలు దించారు.

లోపలి నుండి గంగ మాటలను విన్న నారాయణ, పార్వతి కూడా గంగ వద్దకు వచ్చి.,మా యమ్మే, మా తల్లే ,నీకు మేమంటే ఎంత ఇష్టమే తల్లి అని అంది పార్వతి,అది ఏవరనుకున్నావె

మరి అది నా కూతురు నా మనసు అర్ధం చేసుకున్న నా బంగారు తల్లి అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని ,నూరేళ్ళు ఆనందంగా ఉండు తల్లి అని అంటున్న తండ్రి కళ్ళలో ఆనందం  చూసి తృప్తిగా నిట్టూర్చింది గంగ…

నెల రోజుల తర్వాత అంగరంగ వైభవంగా ముగ్గురి కూతుర్ల పెళ్ళిళ్ళు ఒకే పందిట్లో జరిపించారు నారాయణ,పార్వతి దంపతులు.ఆ పెళ్ళికి వచ్చిన బంధువుల్లో రాజేష్ ని ఎవరూ గమనించలేదు ఒక్క గంగ తప్ప,

ఆమె అత్తారింటికి వెళ్తున్న సమయం లోకూడా అక్కడే ఉన్న రాజేష్ కి తన గుర్తుగా తన వ్రేలికి ఉన్న వజ్రాల ఉంగరాన్ని వదిలి , 

అతన్ని కళ్ళనిండా చూస్తూ ,కారెక్కి వెళ్లిపోయింది గంగ ఆ ఉంగరాన్ని తీసి అపురూపంగా దాచుకున్నాడు రాజేశ్ ….. ఇప్పుడు చెప్పండి ప్రేమ గోప్పాదా ? కని పెంచిన పేగు బంధం గొప్పదా ?….

 

Related Posts