ఆలోచనల అసమతుల్యత

ఒంటరిగా

అక్షర కొరకు
అంశం : మానసిక ఒత్తిడి
శీర్షిక : ఒంటరిగా

గతం లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా సమస్యలు వస్తే ఇంట్లో అందరూ కూర్చొని పరిష్కారం చేసుకొనేవారు. కానీ ఇప్పుడు తరాలు మారాయి. కాదు మార్చుకున్నారు. కుటుంబాలు లేవు. మేము మాకిద్దరు అనే జనరేషన్ వచ్చింది. మళ్ళీ సమస్యలు వచ్చినా అటు తరపున వాళ్ళు ఇటు తరపు వాళ్ళో వచ్చి పరిష్కారం చెప్పి వెళ్ళేవారు.

నలుగురు అయినా సంతోషం గా ఉండేవారు. అప్పుడప్పుడు ఊర్లో ఉన్న తమ వారిదగ్గరికి వెళ్ళి సమయాన్ని గడిపి వచ్చేవారు.

తరం మారింది.నేను నా జీవితం అంటూ గిరిగిసుకుని పక్కింటి వారితో కూడా మాట్లాడని సాంకేతిక జీవితం అయిపొయింది. దాంతో పాటే పని ఒత్తిడి, టార్గెట్ లు, ప్రాజెక్టు లు అంటూ ఇరవై నాలుగ్గంటలు పనిలో మగ్గిపోతు పనిలో గెలవలేక ఇటు కొత్తగా వచ్చిన ఏ. ఐ. టెక్నాలజీ పేరుతో సగం ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని స్థితి లో సతమతం అవుతూ చాలా ఒత్తిడి పెంచుకుని కొందరు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. మరి కొందరు హాస్పిటల్ పాలు అవుతున్నారు.

ఈ జనరేషన్ లో చాలా మంది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడడం వలన ఇలాంటి పరిస్థితి వస్తుంది. అదే కుటుంబం తో ఉంటే తమ ఒత్తిడి తగ్గించుకునే అవకాశం ఉండేది. పెద్దవాళ్ళు ఉంటే ఉద్యోగం లేకపోతే ఎలాగైనా బతకోచ్చు అని సర్ది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఒంటరిగా ఉండటం వల్ల చెప్పేవాళ్లు ఎవరూ ఉండడం లేదు.

ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువై ఉన్న ఉద్యోగాలు పోతాయని భయంతో కొందరు ఇలా చేస్తుంటే మరికొందరు కాలేజీలో ర్యాంకులు రాక తల్లిదండ్రులు పెట్టే ఫీజులు కట్టలేక వారి ఊహలకు తగ్గట్టుగా చదవలేక ఒత్తిడికి గురై చనిపోతున్నారు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

కానీ ఇప్పుడు వారికి మానసిక ఒత్తిడిలో ఉన్నారని గ్రహించి కుటుంబ సభ్యులు అండగా ఉంటే ఎలాగోలా బ్రతకొచ్చు అనే నమ్మకాన్ని ఇస్తే ఇలాంటి ఆత్మహత్యలు చాలావరకు ఆపుకోవచ్చు. ఉద్యోగం చేసిన అదే డబ్బు వస్తుంది. చిన్న బడ్డీ కొట్టు నడుపుకున్న అదే డబ్బు వస్తుంది బండి కొట్టు పెట్టుకొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ ఆదర్శంగా చూపించి కుటుంబ సభ్యులు భార్య ఒత్తిడిని తగ్గించగలిగితే ఇలాంటి మరణాలను ఆపవచ్చు.

*అనుకున్నది జరగనప్పుడు ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాలి *

ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను
భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *