ఒంటరి తల్లి

మధ్య టిక్ టాక్ బ్యాన్ అయ్యింది.అది మీ అందరికి  తెలుసుఅయితే అది బ్యాన్ అవ్వబోయే రెండు నెలల ముందు నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నావీడియోలు ఏమి చేయకున్నా చూస్తూ ఉండేదాన్ని అందరి వీడియోలు చాలా టాలెంట్ ఉన్నవాళ్లు  ఎందరో అందులో నాకు కనిపించారు.

వారికి అంత ప్రతిభ ఉండిపేరు రాకపోవడం బాధ అనిపించినావారు ప్రయత్నం చేసి ఉండరు అనే ఆలోచనకొన్ని వెకిలి వీడియోలుఅసభ్య వీడియోలు చాలా కనిపించాయి.ఇలా చూస్తూ వెళ్తున్న నాకు ఒక గొడవ కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించి అక్కడ ఆగిపోయాను.మరి సగం విని ఏం నిర్ణయిస్తాం కదావారిని ఫాల్లో అయ్యివివరాలువీడియోలు చూసాను.

అసలు ఎందుకు వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారు? కారణం ఏమిటీ ?అని వారి మొదటి వీడియో నుండి ఇప్పటి వరకు జరిగిన  వీడియోల వరకు దాదాపు అన్ని చూసాను.పెద్దగా కారణం నాకు కనిపించలేదు.ఒక నలుగురు ఆడవాళ్ళ మధ్య గొడవ అదిటిక్ టాక్ లొనే వారికి పరిచయం పెరిగి ఒకరి ఇంట్లోకి ఒకరు వెళ్లేంత స్నేహం చేశారు.

అలా వెళ్ళినప్పుడు మొదటి ఆవిడ రెండో ఆవిడ దగ్గర దొంగతనం చేసింది. అది గుర్తించని మొదటి ఆవిడ లైక్ కోసం మూడో ఆవిడను ట్రోల్ చెయ్యాలి అని అనుకున్నారు ఇద్దరూ.అలా మూడో ఆవిడను ట్రోల్ చేస్తున్నప్పుడు మొదటి ఆవిడ దొంగతనం చేసింది కాబట్టి ఆమె ఎక్కడ దొరికి పోతానో అని తప్పుకుంది.

మీకు అర్థం కావడం లేదా అయితే మనం వారికి పేర్లు పెట్టుకుందాం వారి అసలు పేర్లు ఎందుకు లెండి కానీ ప్రస్తుతానికి వారి పేర్లు శ్రీయలతమణిబేగం గా పిలుద్దాంశ్రీయ బేగం కలసి లతను ట్రోల్ చేశారు. విషయాన్ని లతమణి కి చెప్పి బాధ పడి వారి తో మాట్లాడి మాట్లాడి సెటిల్ చెయ్యమని కోరింది.తన ఇంట్లో తెలిస్తే తిడతారనివీడియోలు చెయ్యనివ్వరు అని అనడం తోపాపం అని మణి బేగం తోనూశ్రీయ తోనూ మాట్లాడింది.

బేగం ఊరుకున్నా శ్రీయ ఉరుకోలేక పోయింది.కారణం లత కు ఎక్కువ లైక్ లు రావడమేమణి ని తెగ బూతులు తిడుతూట్రోల్ చేయడం మొదలు పెట్టింది.చివరికి గొడవ ఎంత వరకు వెళ్లిందంటే ఆమె పర్సోనల్ లైఫ్ లోకి వెళ్లి పోయివిషయాలన్నీ బయటకు లాగి ఫోటోలుజెంట్స్ తో ఆమె మాట్లాడిన కాల్ రికార్డింగ్ లు కూడా అన్ని సేకరించిటిక్ టాక్ లో వీడియోలు పెడుతూఆమెని అసభ్యంగా బూతులు తిడుతూ నువ్వేవారే నాకు చెప్పేది అని అంటూ తెగ వీడియోలు చేసి పెట్టేది.

మరి మణి ఉరుకుంటుం దా తన బతుకునుపర్సోనల్ లైఫ్ ను బజార్లోకొన్ని కోట్ల మంది  ముందు పెట్టడం చూసితట్టుకోలేక మణి కూడా శ్రీయ పర్సనల్ లైఫ్ గురించి  తాను ఏం తక్కువ తినలేదు అన్నట్టుగా మాట్లాడ్డం మొదలు పెట్టింది.కానీ మణి ని జాగ్రత్తగా గమనిస్తే ఆమె శ్రీయ గురించి చాలా తక్కువ మాట్లాడింది అని చెప్పవచ్చు.

తనని శ్రీయ ఎందుకు ట్రోల్ చేస్తుందోఅసలు గోడవలోకి తనేందుకు వచ్చిందో అందరి కి చెప్తూ తనని అన్యాయంగా తిడుతున్న శ్రీయ అకౌంట్ తీసేయించమని అందర్నీ కోరుతూ ఉండేది.కొన్ని నిజాలు కూడా చెప్పేది మణి.కానీ శ్రీయ మాత్రం  మణి ని o బుతులు తిడుతూనన్నే ట్రోల్ చేస్తావా నా కోడల్ని నాకు కూతుర్ని చేస్తావానా అన్నతో నాకు సంబంధం అంట గడతావా అని మణి చెయ్యని పనులు కూడా చేసినట్టు చెప్తూ అందర్నీ నమ్మించేది.

టిక్ టాక్ లో ఫేమస్ అవ్వాలి అంటే అయితే బూతులు అయినా మాట్లాడాలిలేదా ఎక్సపోసింగ్ అయినా చేయాలి  అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది.అది చూసి కొందరు టాలెంట్ ఉన్న వాళ్ళు  అలా కాదని కామెంట్స్ పెట్టడంతోవారిని కూడా బూతులు తిట్టడం మొదలు పెట్టింది. బూతులు వినడానికి ఆమె వీడియోలు చూసే వారంటే అతిశయోక్తి కాదేమో..

నేను వారిలో గమనించింది ఏమిటంటే ఇద్దరి జీవితల్లోనూ వెలుగు లేదు.అంతా చీకటేశ్రీయకు తల్లిదండ్రులు లేరు.ఒక్కత్తి కోడల్ని పెట్టుకుని బ్రతుకుతుంది.బ్యూటీ పార్లర్ నడుపుతూఇలా మాట్లాడితే ఎవరు నా జోలికి రారుసమాజం లో బ్రతకాలి అంటే నేను బూతులు మాట్లాడాలిఅని అంది.

నిజంగా ఇప్పుడున్న నవ సమాజంలోనాగరికత పెరిగిపోయిన యీ సంఘoలోఒక ఒంటరి ఆడది బ్రతకాలి అంటే అయితే డబ్బు అయినా ఉండాలిలేదా నోరు అయినా ఉండాలి అనేది ఆమె వాదన. వాదనతో ఎవరైనా ఎఖీభవిస్తారా? ఆమె వాదనలో నిజం ఉందని నాకు అనిపించలేదు.ఎందుకంటే నోరున్నంత మాత్రాన శత్రువులు దొంగదెబ్బ తీయలేరని అనుకోలేము.

అయితే ఆమె అలా బూతులు మాట్లాడ్డం లొనే  తన భయం అంతా తెలిసిపోతుంది అని నేనంటాను? మరి మీరేమంటారు ? తల్లిదండ్రులు లేరు? ఉన్న అన్న జాబ్ చేస్తూ ఉన్నాడు.కోడలు అని చెప్తున్న పాప తో ఉంటుంది.మరి పెళ్లి అయ్యిందా?  అంటే కాలేదు అంటుంది చూస్తే అలా అనిపించదు అన్నది మణి వాదన..

ఇది ఇలా ఉంటే ఇక శ్రీయ మణి జీవితాన్ని మొత్తం నెట్టింట్లో పరిచేసింది.దాని సారాంశం ఏమిటంటే మణి పెళ్లి అయ్యాకఒక కూతురు పుట్టాకభర్త తో విభేధాలు వచ్చిఅతని నుండి విడాకులు తీసుకుని తల్లి తమ్ముళ్లుఅన్నయ్య లతోపాప తో బ్రతుకుతూ ఒక ప్రైవేట్ స్కూల్ లో  టీచర్ గా జాబ్ చేస్తూ తన పాపను పోషించుకుంటు ఉండేది.

అయితే  ఇక్కడ శ్రీయ మణి ని అన్న మాటలు నాలో ఆలోచనల్ని రేకెత్తించాయి.ఇది రాయడానికి కారణం అయ్యాయి.అది నిజమేనాఅలాగే అందరూ అనుకుంటున్నారా అనే మీమాంసలో నను నిలవనియ్యలేదు.

అందుకే మాటలుఆలోచనలు మీతో పంచుకొవాలనిసమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి నేను వెనకాడనుఎవరైనాఏదైనా చెప్తేనే కదా నలుగురికి తెలిసేదివిన్నా కూడా నలుగురి తో పంచుకోలేనప్పుడు అది వ్యర్ధమే కదామనకు తెలియని వాటిని పెద్దవారు చెప్తారులేదా ఒక దారి చూపిస్తారు అని చెప్పడం జరుగుతుంది.

ఇంతకీ శ్రీయ అన్న మాటలు ఏమిటంటే మొగుణ్ణి వదిలేసివేరే వాళ్ళ వెనక తిరిగే నిన్ను ఏమనాలి అని అంటే ఇంకా నువ్వు ఎందుకు బ్రతికి ఉన్నావునీకు బ్రతికే అర్హత లేదన్న మాటలుభర్త ను వదిలేసిన వాళ్ళు బొట్టు పెట్టుకునే అవకాశం లేదు భర్త చనిపోయినవారికి తెల్ల చీర ఉందిభర్త బ్రతికి ఉన్నవారికి పువ్వులుగాజులుబొట్టు ఉన్నాయిమరి మొగుణ్ణి వదిలేసిన నీకు ఏం చీరలు ఉన్నాయోఅసలు నీకు బొట్టుపువ్వులు అవసరమా అని ప్రశ్నించింది.

అయితే మణి తన భర్తను వదిలెయ్యడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చుఎన్నో బాధలు పడొచ్చు అది ఆమె వ్యక్తిగత విషయం ఆమె ఎవరితో తిరిగిందిఏం చేసింది అన్నది ఇక్కడ మనకు అప్రస్తుతం.కానీ శ్రీయ అలా అనడం నాకు చాలా అశ్చర్యాన్ని కలిగించింది.

సరే లైక్ కోసండబ్బు కోసం గొడవలు జరిగాయికానీ ఆమె వేసిన ప్రశ్న ఆడజాతికి ఎంత అవమానం కదాఆడవారికి ఆడవారే శత్రువులు అన్నది ఇక్కడ ఎంత బాగా చెప్పింది.

నిజంగా నాకు ఆమె వీడియోలు చూసిన తర్వాత ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా వస్తే ఎలా వస్తాయిఒక ఆడది భర్తనువదిలేసిధైర్యంగామొండిగా పిల్లల కోసం తన బ్రతుకు ఎదో తాను బ్రతుకుతూ ఉంటే  మెచ్చుకోవాల్సింది పోయితోటి ఆడదానికి కనీస గౌరవం ఇవ్వకుండా నీలాంటి దానికి గుర్తింపు ఏమిటంటూనిన్ను ఎలా గుర్తించాలినిన్ను ఎలా పిలవాలి అని అడుగుతూ ఆమె పరువుని తీస్తుంది.

భర్తలు ఉన్న వారు ముత్తైదువులుభర్త చనిపోయిన వారు విధవలుమరి భర్తని వదిలేసిన వారు బరితెగించిన వారా అలా అంటే లోకంలో ఎంతో మంది ఒంటరి తల్లులు ఉన్నారు.వారు ఎన్నో విజయలు సాధించారుతమ పిల్లలను చక్కగా పెంచిన వాళ్ళు ఉన్నారు.

భర్తను వదిలేస్తే వారికి ఉనికి లేదా ?వారిని ఎవరూ పిలవరా? ఎవరూ పట్టించుకోరా? వారికి ప్రత్యేక చీరలుడ్రెస్ కోడ్ ఉండాలా ? మన దేశంలో సింగిల్ పేరెంట్స్ ఎందరో ? దానికంటూ ఒక సంఘం ఉందా? లేదా? ఒక వేళా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఎదురైతే ఏం చేస్తారు? వారికి ఎవరు అండగా నిలబడతారు ? పెళ్లిళ్లకుపేరంటాలకు వారు పనికి రారా ?

ఎంతో చదువుకుని ఇంకెంతో మును ముందుకు పోతున్న నవ నాగరిక సమాజంలో భర్తను వదిలేసిన వారంటే ఇంత చులకనా? ఇంత హేళన ?భర్తను కావాలని ఎవరు వదిలెయ్యారు కదా ?ఎదో బలమైన కారణం ఉంటేనే కదా వదిలేసి ఇక అలాంటి జీవితం వద్దు అనుకుని ఒంటరిగా మిగిలిపోతారుఏ ఆడదైనా పిల్లలనుభర్తను వదిలేసి ఒంటరిగా ఉండాలని కోరుకోదు.ఎంతో కష్టపడితే తప్పా .

అలాంటిది పక్కనున్న వారే తోడేళ్ల లాగా మాటలతో హింసిస్తూ ఆమె బాధ పడుతుంటే చూసి నవ్వుకునే వారు ఉంటారు.ప్రియమైన అక్కా చెల్లెల్లార ఇలాంటి వారికి మనము గట్టిగా బుద్ది చెప్పాలిమిలో ఎవరైనా ఒంటరి తల్లులు ఉండొచ్చుచుట్టుపక్కల వారు మిమ్మల్ని ఏదైనా అంటే బాధ పడిభయపడి వెనక్కి తగ్గినోరుమూసుకుని ఉండకండిమీరు కష్ట పడుతున్నారువారేం మీకు పెట్టడం లేదు..

కాబట్టి మీ పరువుకు భంగం కలిగిస్తే వారిని వదిలి పెట్టకండిప్రశ్నించండివీలైతే వెళ్లి వారి ఇంట్లోనే ఉండండి నా పరువు తీసావు కాబట్టి నన్నునా పిల్లలను పోషించే బాధ్యత కూడా నీదే అని అనండిఅడగండిఅప్పుడు అప్పుడు ఇంకోసారి మిమ్మల్ని అనాలి అంటే భయపడే స్థితికి వారు వస్తారు.

మీ గళాన్ని విప్పి మిమ్మల్ని అనే వారిని చీల్చి చెండాడిఅబలలం కాదాని సబలలoఏదైనా సాధిస్తాం అని చూపించండి.ఒక్క చుట్టుపక్కల వారే కాదు ఇంట్లో వారుఇంటి యజమానులు ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తే ఉరుకోకండికోర్టులు ఉన్నాయిచట్టాలు ఉన్నాయి వారినివారి పరువుని బజారుకు ఈడ్చే శక్తి మీకుందని మీరు మర్చిపోవద్దు.ఇది ఒక మణి సమస్య నే కాదు.మనందరి సమస్యముఖ్యంగా ఒంటరి తల్లుల సమస్య..

మరి.. ఇంత చీప్ గా మాట్లాడిన శ్రీయని మణి ఏం చేసిందో తెలుసాశ్రీయని మణి కోర్టుకు లాగింది.ఇంతకు మణి ఎవరో కాదు ఒక జర్నలిస్ట్ లేడీ.ఒక ఛానెల్ లో పని చేస్తూ శ్రీయలాంటి ట్రోల్ చేసేవారిని పట్టుకోవడానికి కృషి చేసిన ఒక ఒంటరి తల్లిఒక మహిళా జర్నలిస్ట్ అని ఆమె తన లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు నేను ఆశ్చర్య పోయాను.

కేస్ పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నా కానీ టిక్ టాక్ బ్యాన్ చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేక పోయాను.ఆమె శ్రీయ గురించి ఎన్నో సాక్ష్యాలుఆధారాలు ఎక్కడెక్కడికో వెళ్లి సంపాదించాను అని అంది.చివరికి ఏం జరిగిందో అనే ఆసక్తి నాకు ఇప్పటికి ఉంది.

ఏదేమైనా శ్రీయ అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు ? .అసలు ఎవరి దగ్గరా ఉండదు ఏమో? మన పురాణాల్లో కూడా రాసి లేదేమో? మరి అలాంటప్పుడు ఒంటరి తల్లులు మనుషులుగా గుర్తింప పడరా? వారికి ఎలాంటి హక్కులు లెవా? వారికి ఓటు హక్కు వాక్ స్వతంత్రపు హక్కు లేదా ? స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా ? వారికి పథకాలు వర్తించవా ? ఇవ్వన్నీ తెలుసుకోవడానికి నేను ముందుకు వెళ్తే నా వెనక ఎవరైనా వస్తారా ? రారా ?

ఏమో పథకాలుహక్కులు ఉన్నా శ్రీయ లాంటి వారు  అడుగడుక్కి ఉన్నా లోకంలో ఒంటరి తల్లి ఏం చేయాలి ? ఎలా బతకాలి ? ఆమెకు అండ ఎవరు ? మృగాళ్ల కాలం లో ఆమెకు రక్షణ ఎక్కడ ? అన్ని సమాధానం లేని ప్రశ్నలేసమాధానాలు కావాలంటే సాగరాన్ని మధించిశోధించాలి. 

వ్యవస్థను మార్చాలిసంఘాన్ని సమాజాన్నినిర్మించాలి.అది మన వల్ల జరిగేనా ? మనకెందుకు అని ఇది చదివి గట్టిగా నిట్టూర్చే వారేనా అందరూ ? కొత్త సమాజాన్ని కొత్త వ్యవస్థను నిర్మించే శక్తి మనకు ఉందా ? ఇక్కడ మనం అంటే స్త్రీ శక్తి.ఆడవారికి ఆడవారు మిత్రులయ్యే నా ? ఏమో కాలమే పరిష్కారం చూపుతుందని అనుకుందామా ? లేక మొదటి అడుగు వేసి చరిత్రలో నిలిచి పోదామా ? జవాబు మీదే ఇక…..

Related Posts