ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అమ్మాయి.

అంశం:⁠- ప్రతిఘటన
శీర్షిక:⁠- మన కర్తవ్యం

కల్పన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అమ్మాయి. వాళ్ళ టైలర్ పని చేస్తూ ఉంటారు. కల్పన అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడేది. కొందరు తన మాటలకు శత్రువుగా చూశారు.  10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యి చాలా దూరంలో ఒక కాలేజీ లో సీట్ వచ్చింది. అయినా సరే పట్టుదలతో వెళ్లి చదువుకునేది. తర్వాత నాలుగు సంవత్సరాలు అయ్యిన తరువాత ఒక కంపెనీ ఉద్యోగం చేస్తోంది.
తన జీవితం డబ్బులతో తన చెల్లికి ఫోన్ , కల్పనకి లాప్టాప్ కొన్నది.
అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ల ఇంట్లో వాళ్ళు కల్పనకి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.
చివరికి ఒక సంబంధం కుదిరి ,ఊరిలో చాలా బాగా పెళ్లి చేశారు.
పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగున్నా తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవాళ్ళు.
తన భర్తకి ఒక మెడికల్ షాప్ ఉంది. కల్పన ఉద్యోగం కి వెళుతుంది.
ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. పార్ట్ టైం ఉద్యోగం కోసం వెతుకుతుంది కల్పన.
ఒక రోజు తన ఫోన్ కి ఒక సందేశం వచ్చింది. కల్పన ఆ సందేశాన్ని ఓపెన్ చేసి చూడగా పార్ట్ టైం చేయడానికి మనుషులు కావాలి. మేము ఇచ్చే టాస్క్ లను పూర్తి చేస్తే డబ్బులు ఇస్తాము అని ఉంది.
వెంటనే ఏం ఆలోచించకుండా వాళ్ళని సంప్రందించింది కల్పన.
ఒక వారం రోజుల వాళ్ళు ఇచ్చే టాస్క్ లకు పూర్తి చేసి డబ్బులు కూడా వచ్చాయి.
ఆ తర్వాత వాళ్ళు డబ్బులు అడగడం మొదలు పెట్టారు. కల్పన నమ్మకంతో డబ్బులు ఇచ్చింది.
అలా కల్పన దగ్గర లక్ష రూపాయలు వసూలు చేశారు.
తర్వాత వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.
ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పిన ,వాళ్ళు తిట్టిన ఆ లక్ష రూపాయలు నువ్వే కట్టుకో అని చెప్పారు.
ఇది వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి వాళ్ళకి ఇచ్చింది కల్పన.
వాళ్లు ఏమో డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చిన మరికొంత ఇవ్వడానికి చాలా సంతమంతవుతుంది కల్పన.
ఇలా మీరు కూడా తప్పు చేసి బాధ పడకండి. అది చదువుకున్నా ,లేకపోయినా వాళ్ళు అయిన సులువుగా నమ్మేస్తారు.
ఇలాంటి విషయాలను ప్రతిఘటించడం మన కర్తవ్యం.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *