ఒలకబోసిన వయ్యారాలతో

ఒలకబోసిన వయ్యారాలతో

సిరిమాను చందనానివి…!!!

పల్లవి :——

కొండమల్లి కోనకు వెలుగువు
ఒలకబోసిన వయ్యారాలతో
సిరిమాను చందనానివి…నువ్వు
ఓరచూపుల కొంటే తనాన్ని ముంగిట
వాల్చిన సింగారాల సిరిమల్లివి…

చరణం :——

నడిచి వచ్చిన దారులలో
ఎండిన వనాలను పూయిస్తున్నావు
మరువలేని నీరూపం మదిలో నిలువక
పోయినా…నీ నీడనైనా తాకే భాగ్యం
నాకు మరుజన్మకైనా ఉంటుందేమోనని
ఒక్కసారైనా చెప్పలేవా…

చరణం :—–

మనస్సు చెప్పిన మాటలు విన్నా
కొయ్య బొమ్మవు కాదు నీవని…
కోటి తారలు ఒలకబోసిన అందాల
జాబిలివి…వలచి వచ్చావా తెలియక
పొరబడ్డావో…చూపులైనా కలువక
ముందే తెరచాటై పోతున్నావు…

చరణం :—–

ఎన్నాళ్ళని చూడాలి…
ఏచోటని వెదకాలి…
ఎదురు చూసిన కళ్ళ ఘోషను
ఏమని ఓదార్చాలి…చూపుల రెక్కలతో
పర్వత అంచులకై ఎగబాకుతున్నా…
దయవుంటే కానరావా తడారిన
గొంతును తడుపరాదా….

– దేరంగుల భైరవ 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *