ఓ పల్లె కథ

మనోహర్ కి చాలా చిరాకుగా ఉంది.తను పోటి చేద్దాము అని అనుకునే లోపునే ఆ వీరయ్య పోటి కి వస్తాడా,ఈ సారి బి.సి లకు సీట్ కేటాయించారు,తను చాలా సంతోష పడి పోటి చేయవచ్చు అని అనుకున్నాడు,పొలం పని లో పడి కొంచం ఆలస్యం అయ్యింది,దాంతో తన పార్టీ లోనే ఉన్న వీరయ్య నిలబడ్డాడు అని తెలిసి హుట హుటిన వచ్చే సరికి ఇక్కడ అంతా జరిగి పోయింది,తను ఎన్నాళ్ళు గానో కలలు కంటున్నా పదవి,మొన్నటి వరకు ఆ పెద్దయ్య నిలబడి గెలిచాడు కూడా,ఈ సారి మనకు రిజర్వు ఉన్నాయని తెలిసి అన్ని రెడీ కూడా చేసుకున్నాడు కూడా,

ఎక్కడికి వెళ్ళాలి,ఏమి చెయ్యాలి,ఎలా మాట్లాడాలి అని అన్ని ప్లాను లు వేసుకున్నారు,తన భార్య,పిల్లలు,తనని అభిమానించే వాళ్ళు అందరూ తను నిలబడినంత సంబర పడ్డారు ,కానీ ఇప్పుడు ఆ వీరయ్య నిలబడ్డాడు అని తెలిసే సరికి వాడి మిద కోపం వచ్చింది పికల దాక..ఆ తర్వాత పార్టీ వాళ్ళ మిద కోపం వచ్చింది,ఎన్నో ఏళ్లుగా పార్టీ ని నమ్ముకుని ఉంటె ఇప్పుడు ,ఇన్నేళ్ళకు తనకు ఛాన్స్ ఇవ్వకుండా నిన్నా,మొన్న వచ్చిన ఆ విరయ్యకు టిక్కెట్ ఇచ్చి నిలబెడతార,తనలో లేనిది ఏంటి,వడిలో ఉన్నదీ ఏంటి,బోడి వాడొక రోజు కూలి గా పని చేస్తూ ఉండే వాడు ,

అది కుడా తన పొలం లోనే చేసే వాడు.ఇప్పుడు వాదిని నేను సర్ సర్ అని పిలావాలా,వాడి వెనక తిరగల,అసలు నాకు చెప్పకుండా,నన్ను అడగకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.అనే అనుమానం వచ్చిన మనోహర్,అదే విషయాన్నీ పార్టీ పెద్దన్న ని అడగాలని అనుకుని తయారయ్యి వెళ్ళాడు పెద్దన్న దగ్గరికి …

మనోహర్ ని చూస్తూనే నవ్వుతు పలకరించిన పెద్దన్న,అతని మొహం మది పోయి ఉండటం చూసి,ఎదో మధన పడుతున్నాడు అని తెలిసి,అది కూడా తనకు తెల్సు అన్నట్టుగా చూసి,ఏమయ్యా మనోహరా ఏంది కథ ఇలా వచ్చావు అని అడిగాడు సున్నితంగా,హ ఎందుకు వస్తే ఏమి లాభం లెండి ,నన్నొక పురుగులా చూస్తున్నారు అందరూ ,అయినా దిన్ని పట్టుకుని కూర్చున్నా నేను ,ఇక ఈ పార్టీ లో ఉండకుడదు అని అనుకుంటున్నా అని అన్నాడు మనోహర్

అయ్యో మనోహర్ ఏందయ్యా నీ భాధ అయినా నీ బాధలో అర్ధం ఉంది లే కానీ ,నీకు ఆలోచన కూడా లేదయ్యా అని అన్నాడు పెద్దన్న,ఎంటండి మీరు అనేది నాకు ఆలోచన లేకపోవడం ఏంటి, అవును లెండి ఆలోచన లేకనే నేను ఇంకా పార్టీ లో ఉన్నాఅన్నాడు అక్కసుగా,అది కాదయ్యా నీకో మాట చెప్తాను అది విన్న తర్వాత కూడా నీకు కోపం ఉంటె,పార్టీ వదిలెయ్యాలి అని అనిపిస్తే వదిలెయ్యి అని అన్నాడు.

పెద్దయ్య అలా అనగానే మనోహర్ కి వీరయ్య ని నిలబెట్టడం లో ఎదో మతలబు ఉందని అనిపించి,అదేంటో తెలుసు కోవాలని అనిపించి,హ చెప్పండి అదేంటో విని తరిస్త అన్నాడు బింకంగా,చూడు మనోహరా వీరయ్య ఒక చదువు రాని రోజు కూలి చేసుకునే వ్యక్తి,అతన్ని నిలబెట్టడo వల్ల ,మనం ఏమి చెప్పినా చేసే విలు ఉంది,పైగా అతను కూలి పని చేసే వాడు అతన్ని నిలబెడితే  పార్టీ కి ఓట్లు బాగా వస్తాయి,మనకు కూలి జనాల్లో మంచి పేరు వస్తుంది.మనం ఏమి చేసిన అతనె చేసాడు అని అతని మిద నిందని వేయొచ్చు,పేరుకే అతని పదవి,మిగతా అంతా మన రాజ్యం కాబట్టి అతన్ని ఇందులో నిలబెట్టడం జరిగింది.

కాబట్టి నీకు టిక్కెట్ ఇవ్వలేక పోయాము అనేది మర్చిపోయి,అతనితో మంచి మాటలు మాట్లాడుతూ నీకేమైనా పనులు కావాలి అంటే చెప్పి చేయించుకో ,మనలాంటి వాళ్ళు బాగున్నావా అంటేనే పొంగి పోయి పది మంది కి చెప్తారు ఈ కులోళ్ళు ,కాబట్టి నువ్వు అతన్ని ఎలా వాడు కుంటావో వాడుకో,అతనికి అన్ని నేర్పించినట్లు నటించి,నీకు అవసరమైన వాటి మిద అతని సంతకాలు తీసుకో గెలిచాక అని చెప్పాడు పెద్దన్న..

పెద్దన్న లో ఇంత స్వార్ధం ఉందని గ్రహించని మనోహర్ నివ్వెర పోయి చూసి, పల్లె లో కూడా మొదలైన రాజకీయాలు చూస్తూ,తనకూ వీరయ్య తో జరిగే పనులు ఏమున్నాయో అని ఆలోచిస్తూ ,సరే మీ మాటని కాదంటానా ఇంత వివరంగా చెప్పక అని అంటూ సెలవు తీసుకుని బయటకు నడిచాడు మనోహర్.ఎన్నికలు అయ్యయి ,కానీ పెద్దన్న పార్టీ గెలవలేదు,స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన నిల కంఠం గెలిచాడు,అతను తన వారసుడిగా విరయ్యను ప్రకటించింది. 

అది తెల్సుకున్న మనోహర్,పెద్దన్న ఆశ్చర్య పోయారు,తామెందుకు ఓడిపోయారో తెలుసుకునే క్రమం లో ఆ రోజు పెద్దన్న మనోహర్ తో మాట్లాడిన మాటలు అన్ని పెద్దన్న కూ తెలియకుండా నిల కంఠం ఏర్పాటు చేసిన మైక్ లో రికార్డ్ అయ్యి,అవి ఊరంతా విని వారికీ ఓటు వేయాకుండా చేసారు.ఇదంతా చాలా నిదానంగా,చాప కింద నీరులా జరిగింది.కానీ ఆ సంగతి మనోహర్ కి కానీ,పెద్దన్నకు కానీ తెలియలేదు.ఇంకా మీరు పల్లె జనాలని మోసం చెయ్యలేరు అని ప్రజలు చెప్పకనే చెప్పారు…

Related Posts