ఈ నిర్మల సాగరగర్బంలో
భీకర సునామీలకు మూలమేది ?
అతి క్రూర,భయానక తిమింగళాలు, సొరచేపలు ,మొసళ్ళకు నివాస మిదే,,,,,
అతి తీవ్రమైన భయంకర తుఫాను పెనుగాలులకు మూలమీ ప్రశాంత సముద్రం,,,,,,
ఒకనాడు ఈ సాగరంలోనే ప్రళయంలా విరుచుకుపడ్డ సునామీ వేల ప్రాణాలను తనలో కలిపేసుకుంది,,,,,,,
అప్పటి వార్త ఓ పదమూడేళ్ళ అమ్మాయి అండమాన్ నుంచి ఈదుకుంటూ కొట్టుకుంటూ కొట్టుమిట్టాడుతూ చెన్నై తీరం చేరింది,,,,,,,
ఏమి ఇది భగవత్ లీల కాదా నాస్తికులు,,,,,,
భూమి తన జీవం ఉనికి కోల్పోకముందే మనుషులు మేల్కోవాలి,,,,,
ప్రకృతి గుండెల్లో గుణపాలు గుచ్చుతూ వృక్షాలు, వన్యప్రాణులను మింగితే,,,,,,
ఇప్పటికే నింగినుండి కారుమబ్బులు కూలిపడుతున్నాయి,,,,,,,
భయంకరమైన చలిరాత్రులు గడవడమే కష్టమయ్యింది మొన్నటి దాకా,,,,,,
ఈ ఏప్రిల్ లోనే నిప్పులు కక్కే ఎండల మంటలు మే నెలలో ఎలావుంటుందో ఏమో,,,,,,,
పొట్టకూటికి దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, కండలు పిండిచేసే కర్షకుల పరిస్థితి దీనాతిదీనం,,,,,
అగ్నితుఫానులు, అతిశీతల పవనాలు, కుంభవృష్టి వర్షాలు మీదపడి చీల్చిచెండాడక ముందే మేల్కొవోయ్,,,,,,
అక్షర సత్యం చెబితే పెడచెవిన పెట్టి ఇలాగే చెట్టూ పుట్టా కూల్చివేతే నీ లక్ష్యం కాకూడదు సుమీ,,,,,,,
నీవు ఇంకా నికృష్టునివేయైతే గర్జించే సునామీలలో మింగేసే మహత్యం సాగరగర్భానిది,,,,,,
నెత్తురు చిందకుండా జీవం కోల్పోతావు జాగ్రత్త,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట