ఓ రెండు పక్షుల అభిమతం

శీర్షిక: నాడు – నేడు

ఓ రెండు పక్షుల అభిమతం
అది వాటి సమాజ హితం కోసం..

లోలోపల ఎన్నో ప్రశ్నలు..
సమాధానం దొరకని సంధర్బాలు.
సమాలోచనలతో తనామునకలు..

పచ్చని వాతావరణం
మన జీవనానికి ఆభరణం

నాగరికత ముసుగులో..
మనిషి తత్వాన్ని కోల్పోతున్న మనుషులు.

మన స్థాయి జీవి జీవించలేనిది.
వీరిది ఏపాటి స్థాయి.

బ్రతుకు పై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మన జాతి మనుగడను కోల్పోతున్నాం

జంటగా కలిసి బ్రతగగలమా..
లేక ఒంటిగా పోరాడదామా..

నువ్వాదరి .. నేనీదరి..
ఏది మన ఇద్దరి దారి..

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన
రచన: కిరీటి పుత్ర రామకూరి
స్థలం: విజయవాడ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *